BigTV English

Kaushal Manda: హీరో నానిని అవమానించిన బిగ్ బాస్ కౌశల్.. హోస్ట్ గా వేస్ట్ అంటూ!

Kaushal Manda: హీరో నానిని అవమానించిన బిగ్ బాస్ కౌశల్.. హోస్ట్ గా వేస్ట్ అంటూ!

Kaushal Manda: బిగ్ బాస్ (Bigg Boss) .. పాశ్చాత్య దేశాలలో మొదలయ్యి.. నేడు ఇండియా వ్యాప్తంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే హిందీలో 18 సీజన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. అటు 9వ సీజన్ కి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR ) హోస్ట్ గా ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 ఎంతలా పునాది వేసింది అంటే.. ఇక ఈ షో ఆయన హోస్టింగ్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.


బిగ్ బాస్ హోస్ట్ పై కౌశల్ మంద కామెంట్స్..

ఇక తర్వాత రెండవ సీజన్ కి నాని(Nani )హోస్ట్ గా వ్యవహరించినా.. పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. ఇక మూడవ సీజన్ నుంచి కింగ్ నాగార్జున(Nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తూ.. ఆయన పరంపర కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ కౌశల్ మంద (Kaushal Manda) తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని.. ఇన్ డైరెక్ట్ గా హీరో నానిపై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో భాగంగా.. నాగార్జున ఎన్నో రోజులుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కానీ ఎన్టీఆర్ వేసిన మార్క్ ఇప్పటికీ ఎవరూ చెరపలేకపోయారు. అలాగే కంటెస్టెంట్ గా మీరు వేసిన మార్క్ ను కూడా ఎవరు చెరపలేకపోయారు . ఆ మార్క్ ఎలా సాధ్యమైంది? అని ప్రశ్నించారు.


ఎన్టీఆర్ పై ప్రశంసలు..

కౌశల్ మంద దీనిపై మాట్లాడుతూ.. “ప్రస్తుత జనరేషన్లో మొదటి ఐదు నిమిషాలు సినిమా చూసి జడ్జ్ చేసే స్థాయికి ఆడియన్ ఎదిగాడు. అలాగే ఏదైనా షో చేస్తున్నప్పుడు ఫస్ట్ వేసిన మార్క్ ను బట్టి.. ఆ షో జీవితం మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఎన్టీఆర్ అంత స్ట్రాంగ్ గా, అంత ఫెమిలియర్ పర్సనాలిటీతో.. నిర్మొహమాటంగా హోస్ట్ గా చేయగలిగిన క్యాపబిలిటీ ఉంది కాబట్టే.. పిల్లర్ కూడా చాలా స్ట్రాంగ్ గా పడింది. ఒక్కసారి పిల్లర్ స్ట్రాంగ్ గా పడింది అంటే ఆ తర్వాత ఎంతమంది ఆ స్థానాన్ని భర్తీ చేయాలని చూసినా అది కుదరదు. ఎన్టీఆర్ వేసిన పిల్లర్ వల్ల బిగ్ బాస్ ఇప్పటికీ స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. అదే ఒకవేళ యావరేజ్ హీరో ఎవరైనా చేసి ఉండుంటే ఈ షోకి ఇంత రెస్పాన్స్ వచ్చిండేది కాదు..” అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసల కురిపిస్తూ కౌశల్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి..

ఇన్ డైరెక్ట్ గా నానికి అవమానం..

ఇక ఇది చూసిన నెటజనులు అంటే నాని హోస్ట్ గా పనికిరాడా.. ? ఎన్టీఆర్ ను మీరు పొగుడుతూ నానిని తక్కువ చేసి కామెంట్లు చేశారు. అంటూ అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఇకపోతే దీనికి తోడు నాని హోస్టుగా ఉన్నప్పుడు చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. హోస్టింగ్ లో నాని పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోతున్నారు అని కామెంట్లు చేశారు. దీనికి తోడు ఇప్పుడు కౌశల్ మందా కూడా నాని హోస్టుగా వేస్ట్ అన్నట్టు ఇండైరెక్టుగా కామెంట్లు చేయడం గమనార్హం. మరి ఈ కామెంట్స్ ఎంతవరకు వెళ్తాయో చూడాలి.

ALSO READ:K.A.Paul: నావల్లే సెలబ్రిటీలు అరెస్ట్.. నిజాలు బయటపెట్టిన కే.ఏ. పాల్!

Related News

Bigg Boss Telugu 9 Live Updates: బిగ్‌బాస్‌ గ్రాండ్‌ లాంచ్‌.. ఈసారి డబుల్‌ హౌజ్‌, డబుల్‌ డోస్‌తో రణరంగమే..

Bigg Boss 9: బిగ్ బాస్ 9 ఫైనల్ కంటెస్టెంట్స్ జాబితా ఇదే..6గురు సామాన్యులతో పాటు!

Bigg Boss 9 Telugu : ట్విస్ట్ అదిరింది.. బిగ్ బాస్ కే కండిషన్స్ పెట్టిన నాగార్జున..!

Bigg Boss 9 Promo :ఫస్ట్ డేనే ఫస్ట్ ఎలిమినేషన్… అంతా డబుల్ డోస్ డబుల్ ట్విస్ట్

Bigg Boss : బిగ్ బాస్ చూస్తూ ఎమోషనల్ అయిన హీరో… స్టేజ్ పైనే కన్నీళ్లు..

Bigg Boss 9 Telugu: మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్.. కంటెస్టెంట్స్ లిస్ట్ చూశారా?

Big Stories

×