BigTV English

KA Paul: నావల్లే సెలబ్రిటీలు అరెస్ట్.. నిజాలు బయటపెట్టిన కే.ఏ. పాల్!

KA Paul: నావల్లే సెలబ్రిటీలు అరెస్ట్.. నిజాలు బయటపెట్టిన కే.ఏ. పాల్!

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా పేరు సొంతం చేసుకున్న కేఏ పాల్ (KA Paul).. తాజాగా సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో భాగంగా కేసు ఫైల్ అవ్వడంతో కీలక కామెంట్లు చేశారు. తాజాగా ఢిల్లీ మీడియాతో మాట్లాడిన ఆయన.. “రాణా (Rana), విజయ్ దేవరకొండ(Vijay deverakonda), మంచు లక్ష్మీ (Manchu Lakshmi) లాంటి మొత్తం 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసినందుకు ఈడీ అధికారులకు నా ధన్యవాదాలు. బెట్టింగ్ యాప్ లతో కోట్ల మంది యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్ లపై చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టులో కేసు వేశాను. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒకరకంగా చెప్పాలి అంటే నా వల్లే ఇప్పుడు వారిపై కేసులు నమోదయ్యాయి” అంటూ కేఏ పాల్ కామెంట్లు చేశారు. ఇక ప్రస్తుతం కే ఏ పాల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో ఇరుక్కున్న సెలబ్రిటీస్..

ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో దాదాపు 29 మంది సెలబ్రిటీలు చిక్కుకున్నారు. ఇందులో సినీ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు కూడా ఉన్నారు. వీరందరూ కూడా డబ్బులకు కక్కుర్తి పడి.. యువత ప్రాణాలతో చెలగాటమాడడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ లో భాగంగా.. రానా దగ్గుబాటి, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, అనన్య నాగళ్ళ, రీతూ చౌదరి, శ్యామల, శ్రీముఖి వంటి సెలబ్రిటీలతోపాటు..విష్ణుప్రియ, నీతూ అగర్వాల్, సిరి హనుమంతు, వర్షిణి, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, నయనీపావని, అమృత చౌదరి, నేహా పఠాన్ , పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, పండు, టేస్టీ తేజ, సన్నీ యాదవ్, బండారు సుప్రీత వంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పై కూడా కేసు నమోదయింది.


పలు సెక్షన్ల కింద కేస్ ఫైల్..

ఇదిలా ఉండగా ఇలా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై బీఎన్‌ఎస్‌లోని 318(4), 112, రెడ్‌విత్‌ 49, తెలంగాణ గేమింగ్‌ యాక్ట్‌లోని 3, 3(ఎ), 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66డి సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హైదరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది.

ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన అంశాలు..

ఇకపోతే చట్ట విరుద్ధమైన యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి అంటూ అటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇటు సినిమా సెలబ్రిటీలు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు వారు భారీగా పారితోషకంతో పాటు కమీషన్ కూడా తీసుకున్నారని పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేకమంది ఆత్మహత్యలు చేసుకోగా.. చాలా కుటుంబాలలో ఆర్థిక సంక్షోభం నెలకొంది అని పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.

ALSO READ:Kotthapalli lo Okappudu Trailer: ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్ లాంచ్.. ఎలా ఉందంటే?

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×