BigTV English

Malaysia Couple: న్యూస్ చూసి స్పాట్ కు వెళ్లిన వృద్ధ జంట, అది AI వీడియో అని తెలిసి షాక్!

Malaysia Couple: న్యూస్ చూసి స్పాట్ కు వెళ్లిన వృద్ధ జంట, అది AI వీడియో అని తెలిసి షాక్!

AI టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏది నిజమో? ఏది అబద్దమో? చెప్పలేకపోతున్నారు జనాలు. అచ్చం నిజమే అన్నట్లు వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. ఈ వీడియోలను చూసి నెటిజన్లు నిజమే అని భ్రమపడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ వీడియోను చూసి మలేషియాకు చెందిన ఓ వృద్ధ జంట దారుణంగా మోసపోయారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో న్యూస్ చూసి..

మలేషియాలోని కౌలాలంపూర్ కు చెందిన ఓ వృద్ధ జంట సోషల్ మీడియాలో ఓ వీడియో చూసింది. ఇందులో ఓ అందమైన లేడీ రిపోర్టర్ అద్భుతమైన కేబుల్ కార్ పర్యటక ప్రదేశం గురించి న్యూస్ ఐటెమ్ ప్రెజెంట్ చేసింది. ఆ ప్రాంతం అంతా చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. వందలాది మంది పర్యాటకులు అక్కడికి చూడ్డానికి వస్తున్నట్లు ఆ వీడియోలో చెప్పింది. ఎలాగైనా తాము కూడా ఆ ప్రదేశానికి వెళ్లాలి అనుకున్నారు. కౌలాలంపూర్ నుంచి పెరాక్ ప్రాంతానికి చేరుకున్నారు. సుమారు మూడు గంటలు ప్రయాణించి ఓ హోటల్ లో దిగారు. హోటల్ సిబ్బందిని అందమైన కేబుల్ కార్ గురించి అడిగారు. వారు చెప్పిన మాట విని హోటల్ సిబ్బంది నవ్వుకున్నారు. జోక్ చేస్తున్నారేమో అనుకున్నారు.


సోషల్ మీడియాలో వీడియో చూపించిన వృద్ధ దంపతులు

హోటల్ సిబ్బంది నమ్మకపోవడంతో సోషల్ మీడియాలో తాము చూసిన వీడియోను వృద్ధ దంపతులు చూపించారు. ఆ వీడియో చూసి అక్కడి వాళ్లు అదో AI వీడియో అని చెప్పారు. ఆ మాట విని వృద్ధ జంట షాకైంది. ఆ వీడియోలో పెరాక్‌లోని కువాక్ హులు పట్టణంలోని సరదా ట్రామ్ రైడ్, కువాక్ స్కైరైడ్ గురించి  టీవీ రక్యాత్ అనే ఛానెల్‌ కు చెందిన ఓ లేడీ జర్నలిస్టు ఈ న్యూస్ ను ప్రజెంట్ చేసింది. అందమైన అడవులు, పర్వతాల నడుమ ఈ అందమైన కేబుల్ కార్ గురించి వివరించింది. అక్కడికి వచ్చిన పర్యాటకుల అనుభవాలను కూడా రిపోర్టు చేసింది. పర్వత దృశ్యాలతో కూడిన రెస్టారెంట్‌లో ఫ్యాన్సీ భోజనాన్ని ఆస్వాదిస్తున్నట్లు చూపించింది. ఈ వీడియోను చూసి నిజమని నమ్మి ఆ వృద్ధ జంట అక్కడికి వెళ్లి మోసపోయారు.

AI వీడియో క్రియేటర్స్ పై కేసు

అసలు విషయం తెలిసిన తర్వాత వృద్ధ దంపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలోని జర్నలిస్ట్‌పై కేసు పెడతానని హోటల్ సిబ్బందికి చెప్పారు. అసలు ఆ వీడియోలోని వ్యక్తులు ఎవరూ నిజమైనవారు కాదని తెలుసుకుని మరింత కోపంతో ఊగిపోయారు. ఈ వృద్ధ జంటతో పాటు మరో వ్యక్తి కూడా తన తల్లిదండ్రులను ఆ ప్రాంతాన్ని చూపించేందుకు తీసుకొచ్చినట్లు మలేషియా వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ కేసుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. AI-సృష్టించిన కంటెంట్ వల్ల కలిగే నష్టాలపై చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read Also:  జపానోళ్లది బుర్రే బుర్ర.. ఎయిర్ లైన్స్ లోకి అదిరిపోయే టెక్నాలజీ, ఇది ఊహించలేరు!

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో చాలా స్పీడ్.. పాతబస్తీ కల నెరవేరే సమయం దగ్గరలోనే!

AP metro rail tenders: విశాఖ, విజయవాడ మెట్రో రైల్.. తాజా పరిస్థితి ఏంటి? అసలేం జరుగుతోంది?

IRCTC Vietnam Tour: IRCTC వింటర్ వియత్నాం టూర్, 8 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి!

Indian Railways: రూ. 24 వేలకే జ్యోతిర్లింగాల దర్శనం, IRCTC అదిరిపోయే ప్యాకేజీ!

Indian Railways: ప్రయాణీకుల భద్రతకు రైల్వే కీలక నిర్ణయం, ఇక కోచ్ లలోనూ సీసీ కెమెరాలు!

Nellore airport: AP లో మరో ఎయిర్‌పోర్ట్.. నెల్లూరులో గ్రాండ్ ఎంట్రీ!

Big Stories

×