BigTV English

Bigg Boss 8 Telugu: మణికంఠ వీడియోలు బయటపెట్టిన నాగార్జున.. షాకయిన కంటెస్టెంట్స్

Bigg Boss 8 Telugu: మణికంఠ వీడియోలు బయటపెట్టిన నాగార్జున.. షాకయిన కంటెస్టెంట్స్

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8.. 16 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమయ్యింది. అందులో చాలావరకు సీరియల్ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలే ఉన్నారు. అందులో కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఉండగా.. అందులో మణికంఠ కూడా ఒకడు. అసలు మణికంఠ గురించి చాలావరకు బిగ్ బాస్ ప్రేక్షకులకు తెలియదు. కానీ బిగ్ బాస్ ప్రారంభమయిన మొదటి రోజు నుండే తన పర్సనల్ లైఫ్‌లోని కష్టాలు చెప్పుకుంటూ ఆడియన్స్ దగ్గర సింపథీ కొట్టేశాడు. అప్పటినుండి సింపథీపైనే దాదాపుగా తన గేమ్ నడుస్తోంది. కానీ గతవారంలో మాత్రం మణికంఠ పూర్తిగా మారిపోయాడు. దానికి సంబంధించిన వీడియోను కంటెస్టెంట్స్ అందరికీ చూపించారు నాగ్.


హౌస్ కీపర్

గతవారం బిగ్ బాస్ హౌస్‌లోకి ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చారు. వారంతా బిగ్ బాస్ ప్రేక్షకులకు ముందు నుండి తెలిసినవారే అయినా ఆట మాత్రం కొత్తగా మొదలుపెట్టారు. కొత్త కంటెస్టెంట్స్ అంతా రాయల్స్ అయ్యారు. పాత కంటెస్టెంట్స్ అంతా ఓజీగా మారారు. ఇక ఈ రాయల్స్, ఓజీ కలిసి ఆడిన మొదటి టాస్క్.. ‘బీబీ హోటల్’. ఈ టాస్క్‌లో మణికంఠ ఒక హౌస్ కీపర్‌గా నటించాడు. అంతే కాకుండా తనకు దొంగతనాలు చేసే అలవాటు ఉంటుందని, అలా దొంగతనాలు చేసినా వెంటనే ఇచ్చేయడం తనకు అలవాటు అని బిగ్ బాస్ వివరించారు. దీంతో టాస్క్ మొదలయినప్పటి నుండే తన క్యారెక్టర్‌లో లీనమయిపోయాడు మణికంఠ.


Also Read: బిగ్ బాస్ బ్యూటీ ప్రైవేట్ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్

రోహిణితోనే ఫ్లర్టింగ్

హౌస్ కీపింగ్ అంటే గెస్టులు ఏం చెప్పినా చేయాలి. వారి దగ్గర నుండి టిప్స్ అందుకోవాలి. అలా మణి ఎక్కువగా గెస్టులుగా ఉన్న అవినాష్, రోహిణి, గంగవ్వ చుట్టే తిరుగుతూ వారిని ఎంటర్‌టైన్ చేశాడు. ముఖ్యంగా రోహిణితో ఫ్లర్ట్ చేస్తూ తనలోని మరో యాంగిల్‌ను బయటపెట్టాడు. ఇప్పటివరకు హౌస్‌లో ఉన్న ఆడవారితో మణికంఠ చనువుగానే ఉన్నా ఎవరితో ఫ్లర్ట్ మాత్రం చేయలేదు. అలా సడెన్‌గా రోహిణి ముందు ఆ యాంగిల్ బయటపడేసరికి అందరూ షాకయ్యారు. అంత ఫ్లర్ట్ చేసి చివర్లో అక్క అన్నాడని నాగార్జునతో చెప్పి ఫీలయ్యింది రోహిణి. బీబీ హోటల్ టాస్క్‌లో మణికంఠ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఒక వీడియో ప్లే చేసి మరీ చూపించారు నాగ్.

అలాగే ఉండాలి

రాయల్స్ ఎంటర్ అయినప్పటి నుండి మణికంఠలో జోష్ పెరిగింది. అప్పుడే వచ్చారు అన్న ఆలోచన కూడా లేకుండా వారితో కలిసిపోయాడు మణి. ముఖ్యంగా అందులో కొందరు కంటెస్టెంట్స్‌తో కలిసి సరదాగా ఉండడం, జోకులు వేయడం మొదలుపెట్టాడు. ఇక బీబీ హోటల్ టాస్క్‌లో ఒకవైపు హౌస్ కీపింగ్ చేస్తూనే.. మరోవైపు దొంగతనం చేయడం, అంతే కాకుండా పాటలు పాడి, డ్యాన్స్ చేసి గెస్టులను ఎంటర్‌టైన్ చేయడం లాంటివి చేశాడు. ఇవన్నీ ఒక వీడియోలో చూపించారు నాగార్జున. దీంతో తనలో నిజంగానే అంత మార్పు వచ్చిందా అని కంటెస్టెంట్స్ అంతా షాకయ్యారు, వీడియో చూసి ఎంజాయ్ చేశారు. ఇకపై ఎప్పటికీ అలాగే ఉండాలని మణికి సలహా ఇచ్చారు నాగ్.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×