BigTV English
Advertisement

OTT Movie : సినీ రంగంలో జరిగే అరాచకాలన్నీ ఈ ఒక్క సిరీస్ లోనే చూడవచ్చు… ఎక్కడ ఉందంటే?

OTT Movie : సినీ రంగంలో జరిగే అరాచకాలన్నీ ఈ ఒక్క సిరీస్ లోనే చూడవచ్చు… ఎక్కడ ఉందంటే?

OTT Movie : సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, నెపోటిజం, రాజకీయాలు చాలా దారుణంగా ఉంటాయని, స్టార్ కిడ్స్ వల్ల అప్ కమింగ్ నటీనటులకు ఛాన్సులు రావట్లేదనే కామెంట్స్ చాలా వరకు విన్నాం మనం. అయితే సినీ పరిశ్రమలో జరిగే అరాచకాలన్నీ కళ్ళారా చూడాలి అనుకునే వారికోసమే ఈ మూవీ సజెషన్. పైగా హాట్‌స్టార్ లోని ఒక షోలో చూపించినట్లుగా ఎప్పుడూ తెరపై ఈ విషయాలను చూపించలేదు. ఇలాంటి వివాదాస్పద అంశాలపై సినిమా లేదా సిరీస్ చేయాలి అంటే దమ్ము, ధైర్యం కావాలి. పైగా ఇండస్ట్రీ లోని చాలామంది ఇలాంటి విషయాలను బయట పెట్టడానికి ఒప్పుకోకపోవచ్చు. పైగా చాలామందికి ఇలా చేస్తే అవకాశాలు కరువు అవుతాయేమో అనే భయం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో మాత్రం పిన్ టూ పిన్ అన్నీ విషయాలను రివీల్ చేశారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో తెరకెక్కిన ఆ సిరీస్ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయంలోకి వెళ్తే…


డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్…

ఈ ఒక్క సిరీస్ లోనే సినిమా ఇండస్ట్రీలో జరిగే అరాచకాలన్నీ చూపించారు. మౌని రాయ్, రాజీవ్ ఖండేల్వాల్, శ్రేయ శరణ్, నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మి, మహిమా మక్వానా, విజయ్ రాజ్ ఈ సిరీస్ లో కీలక పాత్రలను పోషించారు. ఈ సిరీస్ పేరు మరేదో కాదు ‘షో టైమ్‌‘. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌లు అన్నీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్ని ప్లస్ హాట్‌ స్టార్‌ లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ సిరీస్ లో ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రి గురించి విన్న ఏదో ఒక విషయాన్ని తెరపై చూడవచ్చు ప్రేక్షకులు. కథ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇండస్ట్రీలోని రాజకీయాల బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకుల్ని బాగా ఎంగేజ్ చేస్తుంది. అర్చిత్ కుమార్, మిహిర్ దేశాయ్ ద్వయం ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ విధంగా ఈ సిరీస్ ‌ను తెరకెక్కించడం అనేది సాహసమే. కొన్ని చోట్ల ఈ సిరీస్ నెమ్మదిగా సాగుతుంది అన్పిస్తుంది కానీ సినీ ఇండస్ట్రీలో ఆఫ్ స్క్రీన్ లో జరిగే విషయాల గురించి తెలియాలంటే చూడాల్సిందే. మరి ఈ సినిమాను మీరు ఇప్పటిదాకా చూశారా లేదా తెలియాలంటే కథలోకి వెళ్దాం పదండి.


కథలోకి వెళ్తే…

బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షాకు సినిమా నిర్మాణ సంస్థకు సంబంధించిన స్టూడియో ఉంటుంది. దాన్ని తన కొడుకు ఇమ్రాన్ హష్మీ చూసుకుంటాడు. కానీ అతను తీసిన సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతాయి. అయితే నసీరుద్దీన్ తన కొడుకు తీసే పనికిమాలిన సినిమాలను చూసి తన పేరు, తన నిర్మాణ సంస్థ పేరును చెడగొడుతున్నాడు అంటూ ఫైర్ ఆవుతాడు. ఈ గొడవల వల్ల తండ్రి కొడుకులకు ఒక్క క్షణం కూడా పడదు. దీంతో తన వారసత్వంగా ఆ స్టూడియోను కొడుకుకు ఇవ్వకుండా, తన మనవరాలు మహిమా పేరున రాస్తాడు. దీంతో మహిమ సినిమాను ఓ హీరోతో ఎలాగైనా నాశనం చేయాలని చాలా రాజకీయాలు చేస్తాడు ఇమ్రాన్. మరి సూపర్ స్టార్ హీరో ఎవరికి మద్దతు ఇస్తాడు? వీరిద్దరి పోరులో చివరికి గెలిచింది ఎవరు? సినీ పరిశ్రమలోని ఎలాంటి చీకటి రహస్యాలు వెలుగులోకి వచ్చాయి ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సిరీస్ చూడండి.

Related News

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : భార్య చనిపోవడంతో మరో అమ్మాయితో… దెయ్యం పాపతో ఆ పనులేంటి భయ్యా ?

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Big Stories

×