Alekhya Chitti in Bigg boss:వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ (Bigg Boss) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఎంతోమంది సెలబ్రిటీలు..ఈ షోలో సందడి చేశారు. ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ లోకి ఓన్లీ సెలబ్రిటీలను కాకుండా సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిని కూడా హౌస్ లోకి పిలిపించి, వారితో ఆటలు ఆడిస్తున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏకంగా టైటిల్ కూడా అందుకున్నారు. ఇక తెలుగులో ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా పూర్తి అవ్వగా.. ఇప్పుడు తొమ్మిదవ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే అలేఖ్య చిట్టి పికెల్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, ఇప్పుడు ఒక్క వివాదంతో ఊహించని రేంజ్ లో క్రేజ్ దక్కించుకున్న అలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్స్ కి బిగ్ బాస్ లో అవకాశం లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాంట్రవర్సీతో పాపులర్ అయిన అలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్స్..
అలేఖ్య చిట్టి పికెల్స్.. గత కొన్ని రోజులుగా ఈ పేరు బాగా మారుమ్రోగుతోంది. పచ్చళ్ల వ్యాపారం చేసుకుని ఈ ముగ్గురు సిస్టర్స్.. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఆ క్రేజ్ ను ఉపయోగించుకొని గత కొన్ని సంవత్సరాలుగా పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ మంచి లాభాలు కూడా అందుకుంటున్నారు. వెజ్ తోపాటు నాన్ వెజ్ తో కూడిన పలు రకాల పచ్చళ్లను విక్రయిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకొని.. తమ వ్యాపారంతో మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా భారీ లాభాలతో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో ఒక కస్టమర్ పచ్చళ్ళు ఎందుకు ఇంత ధర అని అడగగా.. అలేఖ్య బూతులు తిడుతూ కష్టమర్ పై విరుచుకుపడింది. సదరు కస్టమర్ అలేఖ్య మాట్లాడిన ఆడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఇప్పుడు ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లపై మీమ్స్ , ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అలేఖ్య చిట్టి సిస్టర్స్ లో ఒకరికి తప్పకుండా బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనే ఛాన్స్ వస్తుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్స్ లో వారికే బిగ్ బాస్ లోకి అవకాశం..
ముఖ్యంగా ఈ ముగ్గురిలో రమ్యకి ఈ ఛాన్స్ దక్కనున్నట్లు సమాచారం. నిత్యం మోడ్రన్ డ్రెస్సులతో ఈమె చేసే రీల్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంటాయి. కాబట్టి బిగ్ బాస్ ఆఫర్ రమ్యకే రానుంది అని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు జియో హాట్స్టార్ లో కూడా పచ్చళ్లకు సంబంధించిన ఒక సీను షేర్ చేశారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చత్రపతి సినిమాలోని పచ్చళ్ళ సీన్ వీడియోని అందులో షేర్ చేస్తూ “గెస్ వి ఆర్ ఇన్ పికిల్ ,ఇప్పుడు మిర్చి కావాలి అంటే మన హాట్ స్టార్ లోనే చూడాలి” అంటూ ఈ వీడియోకి ఒక క్రేజీ క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే దీన్ని బట్టి చూస్తే అలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్ లో ఒకరికి బిగ్ బాస్ ఆఫర్ రావడం కన్ఫర్మ్ అయిపోయిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీరు ముగ్గురిలో ఒకరికి బిగ్ బాస్ లో అవకాశం రావచ్చని కూడా చెప్పారు. ఏది ఏమైనా ఈ పచ్చళ్ల ద్వారా ఒక రకమైన పాపులారిటీ దక్కించుకున్న వీరు ఇప్పుడు కాంట్రవర్సీతో ఏకంగా బిగ్ బాస్ లోనే అవకాశం సొంతం చేసుకోవడం నిజంగా లక్కీ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
JayaPrakash Reddy: సినిమా ఇండస్ట్రీ నా జీవితాన్ని అప్పుల్లో ముంచేసింది.. కానీ..!