JayaPrakash Reddy:దివంగత నటులు జయప్రకాశ్ రెడ్డి (Jaya Prakash Reddy) సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు దాదాపు 300కు పైగా సినిమాలలో నటించారు. తన మేనరిజంతో , స్పెషల్ డైలాగ్ డెలివరీతో రాయలసీమ యాసలో అద్భుతంగా నటించి ఒదిగిపోయారు. ముఖ్యంగా తెలంగాణ శకుంతల తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ ఎంత పాపులారిటీ అయితే సంపాదించుకున్నారో.. ఇక్కడ రాయలసీమ యాసలో మాట్లాడుతూ జయప్రకాశ్ రెడ్డి కూడా అంతే పేరు సొంతం చేసుకున్నారు. ఇక విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన.. 74 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు.
ఇండస్ట్రీ వల్ల బాగా నష్టపోయారు…
ఈయన నేడు మన మధ్య లేకపోయినా.. ఈయన నటించిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నాయి. ఇకపోతే జయప్రకాశ్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబానికి సంబంధించిన ఏ ఒక్కరు కూడా మీడియా ముందుకు రాలేదు. కానీ తొలిసారి జయప్రకాష్ కుమార్తె మల్లిక (Mallika ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, తన తండ్రి గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. మల్లికా మాట్లాడుతూ.. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అయితే సినిమాల మీద మక్కువతో ఒకవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే.. ఇంకొక వైపు స్టేజిపై నాటకాలు వేయడం మొదలుపెట్టారు.. అలా ఆయన నటన చూసిన సినిమా వారు.. ఆయనకు ఇండస్ట్రీ నుంచీ ఆహ్వానం అందించారు. దాంతో సినిమాల్లోకి వెళ్లిపోయారు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లిన తర్వాత రూ.5 లక్షల వరకు అప్పు కావడంతో మళ్లీ సినిమాల్లోకి వెళ్ళకూడదు అనుకున్నారు. ఇక దాంతో ఏడేళ్ల పాటు టీచర్ గానే పనిచేసిన ఆయన ఒకసారి రామానాయుడు (Ramanaidu) కంటపడడంతో తిరిగి సినిమాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. అలా ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో నాన్నకు మంచి గుర్తింపు లభించింది . ఈ సినిమాతో మళ్ళీ ఆయన వెను తిరిగి చూడలేదు..” అంటూ జయప్రకాష్ రెడ్డి కూతురు మల్లికా తెలిపింది.
నాన్న అంతిమయాత్రకు ఇండస్ట్రీ నుండి ఎవరూ రాలేదు – మల్లిక
అలాగే కరోనా సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ..” నాన్నగారి కంటే రెండేళ్ల ముందే అమ్మ చనిపోయింది నాన్నకు లో బీపీ..అదే సమయంలో నా తమ్ముడికి , అతడి పిల్లలకు కూడా వైరస్ అవ్వడంతో నాన్న భయపడిపోయారు. షుగర్ లెవెల్స్ కూడా తగ్గడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారం రోజుల తర్వాత ఆరోజు కూడా ఉదయం నాలుగున్నర గంటలకు నిద్ర లేచి స్నానానికి వెళ్లారు. అయితే ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో ఇంట్లో వాళ్ళు డోర్ తెరిచి చూస్తే.. ఆయన అప్పటికే మరణించారు.. ఇక నాన్న మరణం మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము. లాక్ డౌన్ వల్ల నాన్న అంతిమయాత్రలకు కూడా సెలబ్రిటీలు ఎవరు రాలేకపోయారు. ఇకపోతే అఖండ , క్రాక్ వంటి సినిమాలలో నాన్న చనిపోవడానికి ముందు ఆఫర్లు వచ్చాయి. కానీ అంతలోనే ఇది జరిగిపోయింది” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మల్లికా . అంతేకాదు తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుండెపోటుతోనే మరణించారని చెప్పి అభిమానులను కూడా కన్నీళ్లు పెట్టించింది. మొత్తానికి అయితే జయప్రకాశ్ రెడ్డి కూతురు మల్లికా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Yuganiki Okkadu: సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. అప్పుడే ప్రారంభం అంటూ..!