Allu Arjun: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో అల్లు అర్జున్ కూడా ఒకరు అని చెప్పొచ్చు. గంగోత్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అల్లు అర్జున్ ఆర్య సినిమాతోనే తనదైన శైలిని చూపించి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత మంచి విభిన్నమైన సినిమాలను ఎన్నుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని వచ్చినా కూడా నేడు అల్లు అర్జున్ కి ఒక సెపరేట్ ఆర్మీ ఉంది అని చెప్పొచ్చు.
పుష్పతో పాన్ ఇండియా రేంజ్
అయితే అల్లు అర్జున్ కెరియర్లో చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు పుష్ప సినిమాకి ఎత్తు. పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డును తీసుకొచ్చిన సినిమా పుష్ప. ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత తెలుగు సినిమా స్థాయిని, తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా పుష్ప. దీనికి కారణం సుకుమార్. ఇకపోతే సుకుమార్ కి అల్లు అర్జున్ కి ఉన్న రిలేషన్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటేనే ఒక హై రేంజ్ లో ఉంటుంది. దానికి తోడు అల్లు అర్జున్ కూడా ఈ స్థాయిలో ఉండటానికి సుకుమార్ కారణమంటూ చాలా వేదికల పైన చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు.
బర్త్డే ట్రీట్ ఇదే
అల్లు అర్జున్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ్ దర్శకుడు అట్లీ తో చేతులు కలపబోతున్నట్లు తెలిసిందే. రాజా రాణి సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు అట్లీ. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. మొదటి సినిమాని చేసిన అట్లీ కి తమిళ్ లో వరుసగా స్టార్ హీరోస్ తో సినిమాలు చేసే అవకాశం దక్కింది. ఇక తర్వాత అట్లీ షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 1000 కోట్ల వరకు వసూలు చేసింది ఈ సినిమా. అయితే ఇప్పుడు అట్లీ స్థాయి కంప్లీట్ గా మారిపోయింది అని చెప్పొచ్చు. అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా జరుగుతుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా ప్రస్తుతం తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు అట్లీ. అల్లు అర్జున్ హీరోగా అట్లీ చేయబోయే సినిమా డిస్కషన్స్ వీడియోను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. అయితే దీని గురించి బన్నీ వాసు ట్విట్టర్ వేదికగా ఒక హింట్ కూడా ఇచ్చారు.
Also Read : Allu Arjun: ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఏంటంటే.?