BigTV English

Nagarjuna University: సాంబార్ లో కప్ప.. నాగార్జున యూనివర్సిటీ ఘటనపై లోకేష్ సీరియస్

Nagarjuna University: సాంబార్ లో కప్ప.. నాగార్జున యూనివర్సిటీ ఘటనపై లోకేష్ సీరియస్

Nagarjuna University: సాంబార్ లో కప్ప. ప్రెజెంట్ ఏపీ హాస్టల్ విద్యార్ధుల్లో ఇదే హాట్ టాపిక్. అయినా సాంబార్లో కప్ప పడితే.. ఆ తిండి ఎవరైనా తినగలరా? అన్న చర్చ విద్యార్ధిలోకంలో జోరుగా సాగుతోంది.


ఆచార్య నాగార్జున వర్సిటీ లేడీస్ హాస్టల్లో జరిగిన ఈ ఘటన ద్వారా ఒక్కసారిగా క్యాంపస్ లో కాక చెలరేగింది. అంతే కాదు విద్యార్థినులు రాత్రని కూడా చూడకుండా హాస్టల్ బయట నిరసన వ్యక్తం చేయడంతో.. ఈ వార్త దావానంలా వ్యాపించింది.

గతంలో కూడా అంతే జెర్రి వచ్చిందనీ.. ఈ తిండి తినలేక పోతున్నామని.. ఎంత మొత్తుకుంటున్న ఎవరికీ పట్టడం లేదనీ. ఎన్ని కంప్లయింట్లు చేసినా ఉపయోగం ఉండటంలేదని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారీ విద్యార్ధినులు.


ANU విద్యార్థినుల ఆందోళన పై ఏపీ విద్యా మంత్రి లోకేష్ రియాక్టయ్యారు. స్టూండెంట్స్ కంప్లయింట్ చేసినా పట్టించుకోని వార్డెన్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసారు. మెస్ కాంట్రాక్టర్ పై కూడా విచారణ చేపట్టాలని ఆర్డర్ పాస్ చేశారు.

మంత్రి లోకేష్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. వర్సిటీలో ప్రత్యేక తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు.. ఆర్డీవో సైతం తనిఖీ చేశారు. ఉదయం సమయంలో విద్యార్ధులకు అందిస్తున్న అల్పాహారాన్ని పరిశీలించిన అధికారులు.. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి.. మంచినీటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చెక్ చేశారు. ఫ్రిడ్జిలో నలుగు ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. దీనిపై ఆరా తీశారు. లేడీస్ హాస్టల్లో విద్యార్ధినులకు అందించే ఆహారం ఎలా ఉందో ఒక నివేదికను అందించనున్నారు అధికారులు. ఈ రిపోర్ట్ ఆధారంగా వార్డెన్, మెస్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకునే అవకాశముంది.

Also Read:  కలిసిరాని నేతలు.. రంగంలోకి జగన్

మరోవైపు వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు మౌలిక సౌకర్యాల విషయంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. హాస్టళ్లలో నాణ్యమైన భోజనంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కల్పిస్తున్న వసతులను పరిశీలించేందుకు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలతో పాటు రాత్రి బసలు కూడా చేస్తున్నారు.

Related News

Duvvada Srinivas: ఎమ్మెల్యే కూన రవికుమార్-సౌమ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్, సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ

Aruna Arrest: పోలీసుల అదుపులో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ, ఉలిక్కిపడిన అధికారులు, నేతలు

Amaravati Crda office: అమరావతి సీఆర్డీఏ ఆఫీసు.. కళ్లు చెదిరేలా లోపల దృశ్యాలు

Bhogapuram Airport: వేగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు.. మహానాడుకు ముందే రాకపోకలు, బీచ్ కారిడార్‌పై ఫోకస్

New Bar Policy: గుడ్ న్యూస్..! ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు భారీ తగ్గుంపు..

Tirumala News: తిరుమల కొండపైకి ఉచిత బస్సు ప్రయాణం.. మహిళల్లో ఆనందం, కాకపోతే

Big Stories

×