Alekhya Chitti Pickles:ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీలు తమ సినిమాను ప్రజలలోకి తీసుకువెళ్లడానికి ఎలాంటి స్ట్రాటజీలు ఉపయోగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక హీరో ఏమో బైక్ ఇస్తానంటారు.. మరొక హీరోనేమో ఉచితంగా టికెట్ అంటారు.. ఇంకొక హీరో ఏమో ప్రేక్షకులను ఎలాగైనా సరే థియేటర్ కి రాబట్టాలి అనే నేపథ్యంలో ఈ సినిమా చూడండి నా సినిమా చూడకపోయినా పర్లేదు అనే రేంజ్ లో కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రమోషన్స్ పిచ్చి పరాకాష్టకు వెళ్ళిపోయింది. ఎక్కడో పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి జీవనం కొనసాగిస్తున్న ముగ్గురు అక్కచెల్లెళ్ల జీవితంలో రేగిన ప్రకంపనలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దానినే ప్రమోషన్స్ గా చేస్తూ.. తమ సినిమాను ప్రజలలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు ‘సారంగపాణి జాతకం’ మూవీ బృందం. ఈ మేరకు విడుదల చేసిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఎవర్రా మీరంతా… ?మీరెక్కడ తయారయ్యార్రా..?ఈ గొడవను కూడా వదిలి పెట్టకుండా మీ ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వైరల్ గా మారిన అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం..
అలేఖ్య చిట్టి పికెల్స్.. ఈ పచ్చళ్లకు సోషల్ మీడియాలో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ముగ్గురు అక్క చెల్లెళ్లు సొంతంగా పచ్చళ్ల వ్యాపారాన్ని మొదలుపెట్టి, తమకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి మరణం తర్వాత ఎవరి సపోర్టు లేకపోయినా ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఒకరికొకరు తోడుగా.. ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు భారీగా పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇంత క్రేజ్ వచ్చిన తర్వాత ఒక కస్టమర్ తో ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఒకరైన అలేఖ్య మాట్లాడిన తీరుకి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కస్టమర్ వాట్సప్ చాట్ ద్వారా పికెల్ కొనుగోలు చేయాలనుకున్నారు. అయితే సదరు కస్టమర్ ధరలు ఎందుకు ఇంత అధికంగా ఉన్నాయని ప్రశ్నించడంతో.. అలేఖ్య కష్టమర్ పై బూతులు తిడుతూ కెరియర్ మీద ఫోకస్ చెయ్యి.. పచ్చళ్లే కొనలేని వాడివి పెళ్లి చేసుకుని పెళ్ళానికి బంగారం ఏం కొనిపెడతావు అంటూ కామెంట్లు చేసిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
Aditya 369 : బాలయ్య చేసిందేం లేదు… చిరంజీవి వల్లే ఆదిత్య 369 బ్లాక్ బస్టర్ అయింది..!
ఈ వివాదాన్ని ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్న సారంగపాణి జాతకం టీమ్..
ముఖ్యంగా ఈ ఆడియోని పలు రకాలుగా మీమర్స్ ఉపయోగించుకుంటూ.. అక్కాచెల్లెళ్లను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై అలేఖ్య అక్క సుమ స్పందించినా సరే ట్రోల్స్ ఆగలేదు. పైగా ఇప్పుడు సినీ సెలబ్రిటీలు కూడా ఈ విషయాన్ని ఉపయోగించుకుంటూ ప్రమోషన్స్ చేస్తూ ఉండడం పై ఆశ్చర్యంగా అనిపిస్తోంది అసలు విషయంలోకి వెళ్తే.. ప్రియదర్శి ప్రధాన పాత్రలో.. రూప కొడవూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హీరో , హీరోయిన్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.. అందులో భాగంగానే ప్రియదర్శి ఒక పుస్తకం చదువుతూ ఉండగా రూప మొబైల్ లో ఒక డ్రెస్ చూపిస్తూ ప్రియదర్శితో ఈ డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతుంది. దానికి ప్రియదర్శి చాలా బాగుంది కానీ ధర ఎందుకు అంత ఉంది అని ఆశ్చర్యపోతాడు. దీంతో వెంటనే రూప.. దయచేసి నువ్వు కెరియర్ పైన ఫోకస్ పెట్టు. ప్రేమా, పెళ్లిళ్ల జోలికి వెళ్ళకు. ముష్టి డ్రెస్సే రేట్ ఎక్కువ అన్నవాడివి.. రెప్పోద్దున పెళ్లి అయ్యాక ఆ పిల్లకి బంగారం, ల్యాండ్ ఏమి కొని పెడతావు అంటూ కామెంట్లు చేసింది. మొత్తానికైతే ఈ గొడవను కూడా ప్రమోషన్స్ కి వాడుతుండడంతో ఈ అక్కాచెల్లెళ్లు మరింత పాపులారిటీ అవుతున్నారని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అంత సీరియస్ గొడవని కూడా ఇప్పుడు సిల్లీ చేసేసారని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
#AlekhyaChitti Pickels ni ila Kuda Vaaduthunnara 😭😂#SarangapaniJathakam pic.twitter.com/drzaThDdTU
— Movies4u (@Movies4uOfficl) April 5, 2025