Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా వచ్చినవారిలో అతి తక్కువమంది ప్రేక్షకులకు తెలిసిన వ్యక్తి నాగ మణికంఠ. సీజన్ ప్రారంభం అయిన రోజే హౌజ్ నుండి ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్న కంటెస్టెంట్ ఎవరు అని కంటెస్టెంట్స్‌తో నాగార్జున ప్రాంక్ చేయగా చాలామంది మణికంట పేరే చెప్పారు. అప్పటినుండి తనకు ఈ అవకాశం చాలా ముఖ్యమంటూ తన ఎమోషన్స్‌ను దాచిపెట్టుకున్న మణికంఠ.. నామినేషన్స్ సమయంలో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు మళ్లీ అంతలాగా ఎమోషనల్ అవ్వకుండా గేమ్‌పైన ఫోకస్ పెట్టాడు. అయినా కూడా కొందరు హౌజ్‌మేట్స్ తనను టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
పర్సనల్‌గా టార్గెట్
బిగ్ బాస్ సీజన్ 8లో మొదటివారంలోనే చీఫ్ అవ్వడం వల్ల యష్మీ.. ఇప్పటివరకు నామినేషన్స్‌లోకి రాలేదు. కానీ ఇప్పుడు తనకు ఆ చీఫ్ స్థానం లేకపోవడంతో తనను కూడా ఎవరైనా నామినేట్ చేయవచ్చు. దీంతో చీఫ్‌గా ఉన్నప్పుడు తను చేసిన తప్పులను చూపిస్తూ చాలామంది యష్మీని నామినేట్ చేశారు. అందులో మణికంఠ కూడా ఒకడు. గేమ్ వేరు, ఫ్రెండ్‌షిప్ వేరు అంటూ మణికంఠ చెప్తున్నా వినకుండా నామినేషన్స్‌ను పర్సనల్‌గా తీసుకుంటూ ఇంకొకసారి తనను ఫ్రెండ్ అనొద్దంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. పైగా తన మనసును ముక్కలు చేశాడంటూ తను బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంతకాలం మణికంఠను నామినేట్ చేస్తానని ఛాలెంజ్ చేసింది.
Also Read: సోనియాకు పృథ్వి ముద్దు, నిఖిల్‌తో సీత పులిహోర.. ఇవెక్కడి ప్రేమకథలు?
అవకాశం ఇవ్వట్లేదు
నామినేషన్స్ ముగిసిపోయిన తర్వాత ఇది గేమ్ అని, అదంతా మర్చిపోమని యష్మీకి ఎంతో నచ్చజెప్పాలని చూశాడు మణికంఠ. అయినా తను వినకుండా హగ్ చేసుకున్నా కూడా కంఫర్ట్ లేదంటూ మణికంఠను దూరం పెట్టింది. పైగా తనకు ఏదో అన్యాయం జరిగినట్టు ఏడ్చేసింది. మిగతా కంటెస్టెంట్స్ మాత్రం నామినేషన్స్ అవ్వగానే నార్మల్ అయిపోయారు. యష్మీని, మణికంఠను కలపడానికి ట్రై చేశారు. అయినా యష్మీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. అభయ్ టీమ్‌లో చేరినందుకు కూడా మణికంఠకు సరైన అవకాశాలు ఇవ్వకుండా తనను కార్నర్ చేస్తున్నారని చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు. రేషన్ కోసం జరిగిన క్యాబేజ్ టాస్క్‌లో ప్రతీ టీమ్ నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ ఆడాలని బిగ్ బాస్ తెలిపారు. అయితే మణికంఠను కాకుండా ఆ టాస్క్ కోసం ఆదిత్య ఓంను సెలక్ట్ చేశాడు అభయ్. తనను ఎందుకు సెలక్ట్ చేయలేదు అని అడగగా.. ఆదిత్యకు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు.
ప్రేరణతో గొడవ
ఆ టాస్క్ కోసం మణికంఠకు సంచాలకుడిగా సెలక్ట్ చేశాడు బిగ్ బాస్. టాస్క్ తనకు అర్థమయిన ప్రకారం బుట్టలోని క్యాబేజ్‌లు అయిపోగానే టాస్క్ అయిపోయిందని నిఖిల్ టీమ్ విన్నర్స్ అని ప్రకటించాడు మణికంఠ. దీంతో టాస్క్ ఆడిన ప్రేరణకు కోపమొచ్చింది. తనకు టాస్క్ అలాగే అర్థమయ్యిందని ఎంత చెప్తున్నా వినకుండా అభయ్‌తో పాటు టీమ్ మొత్తం తనపై విరుచుకుపడింది. ముఖ్యంగా ప్రేరణ అయితే తొక్కలో సంచాలకుడు అని వ్యాఖ్యలు కూడా చేసింది. రేషన్ రాకపోతే కడుపు మాడ్చుకొని ఉండాలని, వారం రోజులు ఆ కష్టాలు ఎలా ఉంటాయో చూసిన తర్వాత కూడా ఒకరికి తాను అన్యాయం చేయనని మణికంఠ చెప్తున్నా సరే పొగరుగా ప్రవర్తించింది ప్రేరణ. చివరికి తానే వచ్చి టాస్క్ సమయంలో అలా కోప్పడ్డానని చెప్తూ మణికంఠను హగ్ చేసుకుంది.