Sobitha Dhulipalla: అక్కినేని నాగచైతన్య, సమంతతో విడిపోయిన తర్వాత శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెల్సిందే. ఇక ఈ మధ్యనే విరి ఎంగేజ్మెంట్ ఘనంగా చేసుకో.. ఆ వార్తలను నిజం చేశారు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహం అత్యంత సన్నిహితుల మధ్య జరగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అక్కినేని ఇంట పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి.
ఇకపోతే ఏ ముహూర్తాన శోభిత అక్కినేని ఇంట అడుగుపెట్టిందో కానీ, అప్పటినుంచి స్టార్ సెలబ్రిటీ లిస్టులో చేరిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఆమె కంటూ ఒక గుర్తింపు లభించడం విశేషం. మొన్నటికి మొన్న ఏఎన్నార్ నేషనల్ అవార్డు వేడుకల్లో శోభితనే షో స్టాపర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఈ తెనాలి పిల్లనే హాట్ టాపిక్ గా మారడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Akkineni Nagarjuna: కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు.. ఎక్స్ లో సారీ చెప్తే సరిపోదు
తాజాగా అక్కినేని కుటుంబం గోవాలో జరుగుతున్న ఇఫీ 2024 ఉత్సవాల్లో ప్రత్యక్షమయ్యారు. అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, శోభిత ఈ వేడుకలకు హాజరయ్యారు. నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే ఈ వేడుకలకు ఇండస్ట్రీ పెద్దలు,ప్రముఖులు,సెలబ్రిటీలు అటెండ్ అవుతున్నారు, ఈ వేడుకల్లో అక్కినేని కోడలు శోభిత మరింత అందంగా కనిపించింది. లైట్ పింక్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకొని.. పెద్ద గాగుల్స్ తో చై పక్కన శోభనీయంగా కనిపించింది. ఈ జంటను చూసి అభిమానులు ఎంతో ముచ్చట పడుతున్నారు.
అయితే కొంతమంది మాత్రం శోభితాను ఓవరాక్షన్ చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకు కారణం ఆమె పెద్ద గాగుల్స్ పెట్టుకొని తిరగడమే. ఈవెంట్ మొత్తం ఆమె అవే గాగుల్స్ తో కనిపించింది. ఇక పక్కన అమల ఎంతో సింపుల్ గా చీరలో కనిపించగా.. శోభిత మాత్రం గాగుల్స్ పెట్టుకొని షో చేస్తున్నట్లు తిరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Pushpa2 : ఏంటి బన్నీ ఇలా చేస్తావని ఊహించనేలేదు.. పవన్ ఫ్యాన్స్ దారుణమైన ట్రోల్స్..
పెళ్ళికి ముందే ఈ చిన్నది ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకే రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక శోభితా కెరీర్ గురించి చెప్పాలంటే.. పెళ్లి తరువాత ఆమె సినిమాలు చేస్తుందా.. ? లేదా.. ? అనేది ఇప్పటివరకు తెలియదు. బాలీవుడ్ లో అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన శోభితా.. పెళ్లి తరువాత గ్లామర్ పాత్రలు చేయడానికి ఓకే చెప్తుందా.. ? లేదా.. ? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ అలాంటి పాత్రలు చేస్తే కచ్చితంగా సమంత కన్నా ఎక్కువ ట్రోలింగ్ కు గురి అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అంటున్నారు. మరి శోభితా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.