Illu Illalu Pillalu Today Episode September 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. భాగ్యం ప్లాన్ గురించి ఎలాగైనా శ్రీవల్లితో చెప్పి ఒప్పించాలని అనుకుంటారు. 10 లక్షలు తీసుకొని శ్రీవల్లికి ఇవ్వబోతారు. దీని గురించి అమ్మాయితో మాట్లాడాలి అనుకుంటారు. ప్రేమ ఆ కళ్యాణ్ గాని ఊరంతా తిప్పించి మరీ కొట్టాను ఇక జీవితంలో వాడు నాకు ఫోన్ చేయడు అని సంతోషంగా ఉంటుంది. ధీరజ్ ప్రేమ టెన్షన్ కి కారణం ఏంటో తెలుసుకోవాలని కనిపించిన తన ఫ్రెండ్స్ అందరిని అడుగుతూ ఉంటాడు. అయితే ఎవరు ఈ ఏమైందో తెలియదు అని అంటారు. ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళిన ధీరజ్ ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటాడు. ప్రేమ కాలేజీకి రెడీ అవుతుంటే కళ్యాణ్ ఫోన్ చేసి నువ్వు ఒక గంటలో నా పక్కలో ఉండాలి లేదంటే మాత్రం ఈ విషయాన్ని మీ మామతో చెప్తాను అని వార్నింగ్ ఇస్తాడు.. నా ముందు చేయడానికి ఇంకేమీ లేదు వాడు అడిగినట్టు కోరిక తీర్చాలి అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మదా వేదవతి దగ్గరికి వచ్చి సంతోషంతో ఉప్పొంగుతూ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అత్తయ్య అని అంటుంది.. ఐదు మంది పిల్లల్ని కన్నాను నాకు ఆ మాత్రం తెలీదా నువ్వు తల్లి కాబోతున్నావు కదా అని అంటుంది ఆ మాట చాటుగా విన్నా శ్రీవల్లి టెన్షన్ గుండెలు బాదుకుంటుంది. ఆ విషయం కాదు నాకు ప్రమోషన్ వచ్చిందన్న విషయం చెప్పాలనుకుంటే మీరేంటి ఇలా మారారు అని అనుకుంటుంది. అయితే ఈ విషయాన్ని మనం ప్రేమతో వెళ్లి చెప్పాలి అని వేదవతి అంటుంది. ప్రేమ ఇంట్లో కనిపించకపోవడంతో రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అత్త కోడలు..
ఇక శ్రీవల్లి పానీపూరి తినాలని బయటకు వస్తుంది.. పానీ పూరి తింటూ ఉంటుంది. మనం ఈ విషయాన్ని ఎలాగైనా సరే మన పెద్దమ్మడికి చెప్పాలి అని భాగ్యం ఆనందరావు నడుచుకుంటూ వస్తారు. శ్రీవల్లిని పక్కకు లాక్కుని వెళ్లి అమూల్య విశ్వంకి పెళ్లి చేసేందుకు నువ్వు సాయం చేయాలని అంటుంది భాగ్యం. అయితే శ్రీవల్లి ఇద్దరినీ తల్లిదండ్రులని కూడా చూడకుండా కొడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భాగ్యం ఏం చేయాలో నాకు తెలుసు అలానే చేస్తాను అని వెళ్ళిపోతారు. వేదవతి నర్మదా ప్రేమను చూసి ఏమైంది ఈ మధ్య నువ్వు ఒంటరిగా ఉంటున్నావు ఏదో బాధ పడుతున్నావు నీకు మేము ఫ్రెండ్స్ కదా చెప్పాలి నీకు అనిపించలేదా అని అడుగుతుంది.
ఏమి బాధపడట్లేదు ఏమి టెన్షన్ పడట్లేదు అత్తయ్య బాగానే ఉన్నాను అని ప్రేమ కవర్ చేస్తుంది. నర్మద మాత్రం నేను ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలని నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వు ఇలా ఉంటే నీ బాధ ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది అని అంటుంది. అయితే ఏంటి అక్క గుడ్ న్యూస్ అని ప్రేమ అడుగుతుంది. నాకు ప్రమోషన్ వచ్చింది అని నర్మదా చెప్పగానే ప్రేమ సంతోషంతో గంతేస్తుంది. నీ బాధ ఏంటో చెప్తావా లేదా ధీరజ్ కి ఫోన్ చేసి చెప్పమంటావా అని అడుగుతుంది.. ధీరజ్ నేను రమ్మని ఫోన్ చేసి పిలుస్తుంది.
ప్రేమ నా కున్నది ఒకటే దారి ఆ కళ్యాణ్ చెప్పినట్టు వాడి కోరిక తీర్చాలని అనుకుంటుంది. నేను అర్జెంటుగా బయటకు వెళ్లాలి అని ప్రేమ వెన్నపోతుంటే ధీరజ్ నువ్వు ఎక్కడికైనా చెప్పు నేను డ్రాప్ చేస్తానని అంటాడు.. ఎక్కడికి వద్దు నేను వెళ్తాను అని ప్రేమ ఎంత చెప్పినా సరే ఈరోజు మాత్రం మాట వినకుండా నేను నిన్ను డ్రాప్ చేస్తాను బైక్ ఎక్కువ అని అంటారు. కళ్యాణ్ రమ్మన్న చోటికి దగ్గరలో ప్రేమ ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోరా అనేసి అంటుంది. ప్రేమ చెప్పినట్లే ధీరజ్ ఒకచోట డ్రాఫ్ చేస్తాడు. అయితే ప్రేమ ధీరజ్ ఎంత అడుగుతున్నా సరే ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
Also Read : అక్షయ్ పై బాస్ సీరియస్.. భరత్ ను మార్చేసిన పల్లవి.. పెళ్లి రోజుల వేడుక కోసం ఏర్పాట్లు..
రేపటి ఎపిసోడ్లో ప్రేమ నడుచుకుంటూ ఆ కళ్యాణ్ దగ్గరికి వెళ్లిపోతుంది. ప్రేమను చూసిన కళ్యాణ్ నా కోరిక తీర్చడానికి వచ్చావని సైకోలా గా ప్రవర్తిస్తాడు. ప్రేమని గదిలోకి తీసుకొని వెళ్తాడు. నేను మాత్రం మౌనంగా ఓడిపోయానని బాధపడుతూ ఉంటుంది.. అయితే కళ్యాణ్ ప్రేమను చూసి ఈరోజుతో నువ్వు నా సొంతం అయిపోతున్నావని సంబరపడిపోతూ ఉంటాడు. ప్రేమ మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మరి కళ్యాణ్ కోరిక నెరవేరుతుందా? లేదా చూడాలి..