BB Telugu 8 Promo : ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకోనుంది. డిసెంబర్ 15వ తేదీన చాలా గ్రాండ్ గా.. ఫినాలే జరగబోతోందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై బిగ్ బాస్ మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదిలా ఉండగా మరొకవైపు హౌస్ లో 9 మంది కంటెస్టెంట్స్ మిగిలి ఉన్నారు. వీరిలో టాప్ – 5 కి ఎవరు వెళ్తారు అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఇదిలా ఉండగా తాజాగా టికెట్ టు ఫినాలే రేసులో కంటెస్టెంట్స్ భారీగా పోటీపడుతున్నారు. ముఖ్యంగా ఈ ఛాలెంజ్ నిర్వహించడానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ కూడా వచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే దేత్తడి హారిక, అఖిల్, మానస్, పునర్నవి, వితికా షేర్ తదితర సెలబ్రిటీలు హౌస్ లోకి వచ్చి సందడి చేయడమే కాకుండా కంటెస్టెంట్స్ కి గేమ్స్ నిర్వహించి టికెట్ టు ఫినాలే రేసులో ఎవరు అర్హులో తేల్చి చెప్పి వెళ్లిపోయారు. ఇక చివరిగా తాజాగా హౌస్ లోకి ప్రముఖ యాంకర్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీముఖి అడుగు పెట్టింది. శ్రీముఖి అలా వచ్చిందో లేదో అప్పుడే హౌస్ మొత్తం కళకళలాడిపోయింది. అయితే చివర్లో సడన్ ట్విస్ట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా 89వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమో విడుదల చేయగా.. ఆ ప్రోమో మొదట్లోనే టేస్టీ తేజ, ప్రేరణ భోజనం దగ్గర గొడవ పడినట్లు చూపించారు అదేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రోమో మొదలవ్వగానే కిచెన్ ఏరియాలో ప్రేరణ దోశలు వేస్తూ ఉండగా.. మధ్యలో ఎంటర్ అయ్యారు టేస్టీ తేజ. ఇక రోహిణి మాట్లాడుతూ.. అరె నాకు కూడా చీజ్ వేసి దోశ వేయించు, ఎనిమిదే కదా అయ్యాయి అంటూ అడిగింది. త్రీ మెంబర్స్ ప్లెయిన్ అన్నారు. కానీ 6 వేసేసాను అంటూ చెప్పింది ప్రేరణ. చీజ్ అన్న వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు దోసలు చీజ్ కు సంబంధించినవేనా అంటూ అడిగారు టేస్టీ తేజ. ప్రేరణ మాట్లాడుతూ.. అవును, చీజ్ దోశ తినేవారు… ప్లెయిన్ దోసెలు తినలేరు. అందుకే వేయించాను అంటూ తెలిపింది. అందరూ తినలేరా లేక నువ్వు తినలేవా అంటూ సీరియస్ అయ్యాడు టేస్టీ తేజ. ఇక తర్వాత చీజ్, ప్లెయిన్ దోశల విషయంలో గొడవ పడగా, తినే దగ్గర నుంచి కోపంగా వెళ్ళిపోయింది ప్రేరణ.
ఇక తర్వాత హౌస్ లోకి శ్రీముఖి అడుగు పెట్టింది. శ్రీముఖి మాట్లాడుతూ.. ఈ రోజు నా చేతుల మీదుగా టికెట్ టు ఫినాలే ఎవరో ఒకరికి ఇచ్చేసి వెళ్తాను అంటూ తెలిపింది శ్రీముఖి. నా దగ్గర నాలుగు బ్యాడ్జెస్ ఉన్నాయి. ఎవరు టికెట్ టు ఫినాలే గెలుస్తారని అనుకుంటున్నారో వాళ్లకి రూ . 5 లక్షలు బెట్ పెట్టండి అంటూ తెలిపింది. మొత్తానికి అయితే ఇక్కడ ఆటతో కాకుండా డబ్బుతో టికెట్ టు ఫినాలే గెలుచుకోవాలా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈరోజు ఈ టాస్క్ ఎవరు విన్ అవుతారో చూడాలి.