Bigg Boss 9 Telugu : బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ ప్రస్తుతం 9వ సీజన్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఒక వారం పూర్తి చేసుకుంది. రెండో వారం నామీనేషన్స్ వాడి వేడిగా జరిగాయి. సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీల మధ్య రచ్చ రణరంగంగా మారింది.. ఎక్కువమంది సెలబ్రిటీలను టార్గెట్ చేశారు. ఈ విధంగా మాస్క్ మెన్ ని టార్గెట్ చేయడం పై సర్వత్ర అనుమానాలు వ్యక్తమబోతున్నాయి. అందరిలో కల్లా ఎక్కువగా హరీష్ కే రంగు పడింది. అటు సెలబ్రిటీల భరణిని ఎక్కువగా టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే మరి ఈ వారం నామినేషన్స్ ఎలా జరిగాయి. ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు అన్నది ఆసక్తిగా మారింది.. తాజాగా కామనర్ మనీష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఆ వార్త విన్న అందరు షాక్ అవుతున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే..
బిగ్ బాస్ సీజన్ 9 సీజన్ 9 సామాన్యులను ఒకరైన మనీష్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అందరు అనుకున్నట్లుగా అయినా కామన్ మ్యాన్ కాదని నువ్వు వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అందరూ అనుకుంటున్నట్టు ఇతను సామాన్యుడు మాత్రం కాదు. మంచి బిజినెస్ మ్యాన్. సినీ ఇండస్ట్రీ లో గొప్ప సర్కిల్ కూడా ఉంది. ఆ సర్కిల్ ని ఉపయోగించుకొనే అగ్నిపరీక్ష లోకి ఎంట్రీ ఇచ్చాడు.. గతంలో ఈయన ఎన్టీఆర్ పోస్టుగా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోలో కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది.. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను నిజంగానే మనీషా లేదా అన్నది మీరే ఒకసారి ఇటు చూసేయండి..
Also Read: తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..
బిగ్ బాస్ షో కోసం అగ్నిపరీక్ష అనే షోను సామాన్యుల ను ఎంపిక చేసేందుకు నిర్వహించిన షోలో మనీష్ కామనర్ గా సెలెక్ట్ అయ్యాడు. అయితే హౌస్ లోకి శ్రీముఖి బలవంతంగా లోపలికి పంపింది. హౌస్ లోపలికి వెళ్లిన తర్వాత అతని ప్రవర్తన, మూడ్ స్వింగ్స్ చూసి మెంటలెక్కిపొతుంది. ఇతన్ని స్పెషల్ క్యాటగిరీ లో సెలెక్ట్ చేసి లోపలకు పంపినందుకు శ్రీముఖి ని ఆడియన్స్ ప్రతీ రోజు తిట్టుకుంటూనే ఉన్నారు.. ఇతను సామాన్యుడు మాత్రం కాదు. మంచి బిజినెస్ మ్యాన్. సినీ ఇండస్ట్రీ లో గొప్ప సర్కిల్ కూడా ఉంది. ఆ సర్కిల్ ని ఉపయోగించుకొనే అగ్నిపరీక్ష లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన ఫాలోయింగ్ ను ఉపయోగించుకొనే హౌస్ లో నెగ్గుకురావాలని అనుకుంటున్నాడు.. ఈ వారం ఎక్కువ మంది ఇతన్నే నామినేట్ చేశారు.. మరి రెండో వారం హౌస్ నుంచి బయటకు వెళ్తాడా? లేదా అన్నది చూడాలి..