OTT Movie : థియేటర్లలో కొన్ని సినిమాలు అంతగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం అదరగొడుతుంటాయి. అలాంటి ఒక సినిమా గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ చిత్రం 1940ల తెలంగాణ నేపథ్యంలో జరిగిన నిజ సంఘటనల నుండి ప్రేరణ పొందింది. స్వాతంత్య్ర కాలంలో దోరల అణచివేత, ప్రజల పోరాటాన్ని చిత్రీకరించిన ఈ సినిమా థియేట్రికల్‌గా మిక్స్డ్ రెస్పాన్స్ పొందింది. ఓటీటీలో మరింత పాపులర్ అయింది. ఒక కరడుగట్టిన దొర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దొర పాత్రలో జగపతి బాబు, మమతా మోహన్‌దాస్ నటనకి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
1940లో తెలంగాణలోని రుద్రాంగి గ్రామంలో క్రూరమైన దోర భీమ్ రావు దేశ్ముఖ్ (జగపతి బాబు) నిరంకుశంగా పాలిస్తుంటాడు. అతను తన భార్య మీరా భాయ్ (విమల రామన్)తో పాటు జ్వాలా భాయ్ (మమతా మోహన్‌దాస్)ను కూడా పెళ్లి చేసుకుని, గ్రామస్తులను బానిసలుగా మార్చుకుంటాడు. ఇక కథలో మరో పాత్ర మల్లేష్ అతనికి కుడి భుజంగా ఉంటాడు. ఒకరోజు భీమ్ రావు రుద్రాంగి అనే అమ్మాయి అందానికి ఆకర్షితుడవుతాడు. కానీ ఆమె మల్లేష్ ను ప్రేమిస్తుంటుంది. అంతేకాకుండా వాళ్ళిద్దరికీ చిన్నప్పుడే పెళ్ళి కూడా జరిగి ఉంటుంది. భీమ్ రావు ఆమెను బలవంతంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో మల్లేష్ తిరుగుబాటు చేస్తాడు.
గ్రామస్తులు కూడా మల్లేష్ కి సపోర్ట్ చేస్తారు. భీమ్ రావు గ్రామానికి నీటిని వదలకుండా ఇబ్బంది పెడతాడు. ఇక అతని పతనం మొదలవుతుంది. రుద్రాంగి గ్రామం కోసం తాను స్వయంగా బలికావాలని నిర్ణయించుకుంటుంది. కానీ గ్రామస్తులు ఆమెను దేవతలా భావించి పోరాడతారు. మల్లేష్, జ్వాలా భాయ్ సహాయంతో తిరుగుబాటు చేస్తాడు. చివరికి భీమ్ రావు ఏమవుతాడు ? ఆ గ్రామానికి నీళ్ళు వస్తాయా ? మల్లేష్ తిరుగుబాటు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.
‘రుద్రాంగి’ (Rudrangi) 2023 లో అజయ్ సమ్రాట్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు పీరియడికల్ యాక్షన్ డ్రామా సినిమా. రసమయి బాలకిష్ణ్ రసమయి ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు, మమతా మోహన్‌దాస్, విమల రామన్, ఆషిష్ గాంధీ, గణవి లక్ష్మణ్, కాళకేయ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 ఆగస్టు 1 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో ఉచితంగా చూడవచ్చు. 2 గంటల 22 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఈ సినిమా IMDbలో 7.5/10 రేటింగ్ పొందింది.
Read Also : ఫస్ట్ నైట్ నాడు ఏం చేయాలో తెలియని ఆణిముత్యం… ఫ్రెండ్ మాట విని భార్యపై అఘాయిత్యం… ఫీల్ గుడ్ మలయాళ డ్రామా