Automatic SUV Under Rs 10 Lakhs: చాలా మంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్‌ను కొనుక్కునేందుకు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ట్రాఫిక్, ఇతర రద్దీ సమయంలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌తో కారును నడపడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి. అందువల్ల కేవలం రూ.10 లక్షల ధరలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్న వారికోసం ఇక్కడ.. AMT ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఐదు చౌక SUVల లిస్ట్‌ను పొందుపరిచాం. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ AMT:
నిస్సాన్ మాగ్నైట్ AMT మోడల్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇది రూ.6.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే.. రెనాల్ట్ కిగర్ AMT మాత్రం కొంచెం ఖరీదైనది.
ఈ మోడల్ రూ.7.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు మోడల్స్ కూడా 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. 71bhp, 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చింది.
Also Read: జీప్ కంపాస్ కొత్త వేరియంట్ లాంచ్.. కేకపుట్టిస్తున్న స్పీడ్!
టాటా పంచ్ AMT:
టాటా పంచ్ AMT కూడా మంచి లుక్, డిజైన్‌తో వాహన ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ మైక్రో SUV 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 86bhp, 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా పంచ్ AMT 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఎఎమ్‌టి ఆప్షన్లను కలిగి ఉంది. ఈ టాటా పంచ్ AMT ప్రారంభ ధర రూ.7.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి రూ.8.95 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
హ్యుందాయ్ ఎక్సెటర్ AMT:
టాటా పంచ్‌కు హ్యుందాయ్ ఎక్సెటర్ ప్రత్యక్ష పోటీదారుగా ఉంది. హ్యుందాయ్ ఎక్సెటర్ AMT ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 82bhp, 113.8Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ఎంపికను కలిగి ఉంది. కాగా హ్యుందాయ్ ఎక్సెటర్ ఎఎమ్‌టి రూ.8.22 లక్షల ప్రారంభ ధర నుండి రూ.10.28 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర మధ్య ఉంటుంది.
మారుతీ ఫ్రాంక్స్ AMT:
Also Read: 9 సీట్లతో మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ లాంచ్!
మారుతీ కార్లకు మార్కెట్‌లో సూపర్ డూపర్ డిమాండ్ ఉంది. అందులో మారుతీ ఫ్రాంక్స్ ఎఎమ్‌టి ఒకటి. దీని ముందు భాగంలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 88.5bhp పవర్, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ఎంపికతో వస్తుంది. ఇది రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. దీని డెల్టా రూ. 8.87 లక్షలు, డెల్టా ప్లస్ రూ.9.27 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర వద్ద ఉన్నాయి.
టాటా నెక్సాన్ AMT:
ఇక్కడ పొందుపరచిన అన్నింటిలోకెళ్లా టాటా నెక్సాన్ మాత్రమే 6-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది తొమ్మిది వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ AMT వెర్షన్ ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 13 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.