E-Paper
Advertisement

ఈఎంఐలు కట్టలేక అల్లాడుతున్నారా? ఈ 5 ట్రిక్స్ పాటిస్తే చాలు.. దెబ్బకు బయటపడతారు!

ఈఎంఐలు కట్టలేక అల్లాడుతున్నారా? ఈ 5 ట్రిక్స్ పాటిస్తే చాలు.. దెబ్బకు బయటపడతారు!
Advertisement

EMI Management: ఈరోజుల్లో జీతం అకౌంట్‌లో పడిన కొద్దిసేపటికే మాయమైపోతోందనే భావన చాలామందిలో ఉంది. ఈఎంఐలు, రుణాల చెల్లింపులే నెలవారీ సంపాదనలో సింహభాగం తినేస్తుండటంతో చాలామందికి పొదుపు చేసుకోవడానికి, వ్యక్తిగత ఖర్చుల కోసం చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. దీనికి తోడు డిజిటల్ లోన్లు సులభంగా అందుబాటులోకి రావడం, పెరిగిన వడ్డీ రేట్లతో బడ్జెట్ నిర్వహణ మరింత కష్టతరంగా మారుతోంది. అయితే కొన్ని తెలివైన ప్రణాళికలతో ఆర్థిక పరిస్థితిని, మనశ్శాంతిని మళ్లీ చేతుల్లోకి తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఆర్థిక నిపుణుల సలహా ఏంటి?

హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ క్రెడిట్ ఆఫీసర్ రోహిత్ పట్వర్ధన్ మాట్లాడుతూ.. ‘ముందస్తు ప్రణాళిక లేకపోతే పెరిగిన ఈఎంఐలు కుటుంబ బడ్జెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. వినియోగదారులు తమ అనవసర ఖర్చులను పునఃసమీక్షించుకోవాలి. అత్యధిక వడ్డీ ఉన్న రుణాలకు ప్రాధాన్యతనిచ్చి, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పరిమితికి మించి అప్పులు చేయకపోవడం చాలా ముఖ్యం’ అని తెలిపారు. మెుత్తంగా క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణ.. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చని ఆయన సూచించారు.

ఈఎంఐలు భారమైతే ఏం చేయాలి?

Advertisement

నెలవారీ ఈఎంఐలు నిర్వహించడం కష్టమైపోయి ఒత్తిడి పెరుగుతుంటే.. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. ఇందులో భాగంగా ముందుగా ఖర్చుల సరళిని పరిశీలించి, ఎక్కడ డబ్బు వృథా అవుతుందో గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడమే మొదటి ప్రాధాన్యత కావాలని హితవు పలుకుతున్నారు. తద్వారా మిగిలిన మొత్తాన్ని అప్పుల తీర్చేందుకు మళ్లించడం ద్వారా రుణ భారాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.

Also Read: జియో సూపర్ డూపర్ ప్లాన్స్.. రూ. 449 vs రూ. 500.. దేని బెనిఫిట్స్ ఎంత?

ఈ 5 మార్గాలు పాటిస్తే సరి..

Advertisement

ఆర్థిక పరిస్థితిని అదుపులో ఉంచుకోవడానికి 5 మార్గాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో మెుదటిది ఖర్చుల ఆడిట్. నెలవారీ ఖర్చులను క్షుణ్ణంగా పరిశీలించి, అనవసరమైన వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. రెండో మార్గం కింద.. అప్పుల భారం నుంచి త్వరగా బయటపడటానికి అత్యధిక వడ్డీ ఉండే రుణాలను ముందుగా తీర్చాలి. మూడో మార్గంలో భాగంగా కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్‌ను సిద్ధం చేసుకోవాలి. మరోవైపు ఈఎంఐ చెల్లింపుల తేదీలను మీ జీతం వచ్చే రోజులకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే బెటర్. చివరిగా ఉన్న అప్పు తీరే వరకూ కొత్త అప్పు చేయకుండా ఉండటం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Also Read: నో గ్యాస్.. నో స్మోక్.. బొగ్గుతో పనిచేసే ఎలక్ట్రిక్ కోల్ బర్నర్.. నిజంగా అదిరిపోయింది మామ!

Tags

Related News

రూ.22 లక్షల ప్లాట్ రూ.8 కోట్లకు విక్రయించిన సీనియర్ సిటిజెన్‌కు పన్ను నోటీస్.. కోర్టులో ఇలా వాదించి గెలిచాడు

క్రెడిట్ కార్డు ఓవర్‌లిమిట్ సదుపాయం వల్ల లాభాలు, నష్టాలు.. భారీ ఫైన్ పడకుండా ఈ టిప్స్ పాటించండి

ఉద్యోగం వదిలి వ్యవసాయం.. ఎకరాకు రూ.30 లక్షలు ఆదాయం.. ఆంధ్రా యువకుడి భలే ఐడియా

రూ. కోట్లు ఖర్చు చేసి కారు పార్కింగ్ స్థలాలు కొనుగోలు చేసిన మహిళ.. డబుల్ ఆదాయం

‘వంటమనిషికి నెలకు రూ.8000 చెల్లిస్తున్నా.. వంట యువరేజ్’..బెంగుళూరు మహిళ పోస్ట్ వైరల్

బ్యాంకులకు కొత్త కష్టాలు..రూల్స్ మార్చేసిన ఆర్బీఐ, అసలు మేటరేంటి?

మీ కార్ లోన్, పర్సనల్ లోన్ల ఈఎంఐ పెరగబోతోందా? ఇలా తెలుసుకోండి

Big Stories

Advertisement
×