E-Paper
Advertisement

బాలయ్య ఇల్లు కూల్చివేత.. ఎన్టీఆర్ జ్ఞాపకాలు కనుమరుగు

బాలయ్య ఇల్లు కూల్చివేత.. ఎన్టీఆర్ జ్ఞాపకాలు కనుమరుగు
Advertisement

Balakrishna:నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా ఇటు ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన.. తన నివాస స్థలంలో సగానికి పైగా స్థలాన్ని కూల్చి వేయడానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.దీంతో ఎన్టీఆర్ జ్ఞాపకాలు కనుమరుగవుతాయి అంటూ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రజా ప్రయోజనాల కోసం బాలకృష్ణ ఇల్లు సగానికి పైగా కూల్చివేత..

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వంతో పాటు అధికారులు పలు అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కే.బీ.ఆర్ పార్క్ పరిసర ప్రాంతాలలో వాహనాల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ప్రధాన కూడళ్ళ విస్తరణ పై దృష్టి సారించారు. కే.బీ.ఆర్ పార్క్ చుట్టూ జి హెచ్ ఎం సి ప్రయోగాత్మకంగా అమలు చేసిన వన్వే ట్రాఫిక్ విధానం విజయవంతం కావడంతో దానిని శాశ్వతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది . అందులో భాగంగానే కొన్ని చోట్ల ఉన్న ఇబ్బందులను తొలగించి, వాహనాల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు రోడ్ల విస్తరణ పనులు చేపట్టింది. ఈ క్రమంలోనే బాలకృష్ణకు చెందిన నివాస స్థలంలో సగానికి పైగా భాగాన్ని రోడ్డు విస్తరణ కోసం సేకరించే ప్రతిపాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది . ఈ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం ఇవ్వడానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రజా ప్రయోజనాల పట్ల ఆయన నిబద్దత అందర్నీ ఆకర్షించింది.

ఎన్టీఆర్ జ్ఞాపకాలు కనుమరుగు..

Advertisement

అయితే బాలకృష్ణ నివాసానికి నందమూరి కుటుంబంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన తండ్రి , దివంగత నందమూరి తారకరామారావు 1982లో ఈ ఇంటిని నిర్మించారు. అప్పటి నుంచి ఈ నివాసం బాలకృష్ణ జీవితంలో ఒక ముఖ్య భాగంగా నిలిచింది. ఇక ఎన్టీఆర్ అభిమానులను కలుసుకోవడంతో పాటు సినీ, రాజకీయ సంబంధిత కార్యక్రమాలకు కూడా ఈ ఇల్లు వేదికగా నిలిచింది. అందుకే ఇది కేవలం ఇల్లు మాత్రమే కాకుండా నందమూరి కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలతో ముడి పడిన ప్రదేశంగా గుర్తింపు సొంతం చేసుకుంది. అలాంటి ఇంటి స్థలంలో సగానికి పైగా స్థలం రోడ్డు విస్తరణకు ఇవ్వాలనే ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది

also read:కెప్టెన్ సుధీర్ కి ఘోర అవమానం.. నోరుజారిన త్రిగుణ్, రోహిత్!

స్థలాన్ని ఇవ్వడానికి బాలయ్యతో పాటు ముందుకొచ్చిన మరికొన్ని సంస్థలు..

Advertisement

బాలకృష్ణ నివాసానికి సంబంధించి సుమారు 862.77 చదరపు గజాల స్థలాన్ని సేకరించాల్సి ఉంటుందని సమాచారం.. దీనివల్ల బంజారాహిల్స్ , జూబ్లీహిల్స్ నుంచి దుర్గం చెరువు ,కేబుల్ బ్రిడ్జి , నాలెడ్జ్ సిటీ వైపు వెళ్లే వారికి ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది. బాలకృష్ణతో పాటు మరికొన్ని సంస్థలు కూడా రోడ్డు విస్తరణకు తమ స్థలాలను ఇచ్చాయి. కేబీఆర్ పార్క్ ప్రధాన ద్వారం వద్ద ఫ్రీ లెఫ్ట్ రోడ్డు కోసం శబ్దాలయ స్టూడియో 608 చదరపు గజాల స్థలాన్ని అప్పగించింది . ఫిలింనగర్ జంక్షన్ ను ఐటి కారిడార్ తో అనుసంధానం చేసే పనుల కోసం భవ్య కన్స్ట్రక్షన్స్ 341.33 చదరపు గజాల భూమిని ఇచ్చింది. అయితే వీరంతా కూడా ఎటువంటి నగదు పరిహారం తీసుకోకుండా బదిలీ అభివృద్ధి హక్కుల (టీడీఆర్)పద్ధతిని ఎంచుకోవడం విశేషం.

Related News

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీకాంత్ కుమార్తె మేధా… పూర్తి డీటెయిల్స్ ఇవే!

లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ సినిమాపై బిగ్ అప్డేట్.. ఆ వార్తలకు చెక్ పెట్టారుగా!

స్నిగ్ధ లెస్బియనా కాదా? చివరకు అసలు విషయం చెప్పేసిందిగా!

నేను బ్రతికున్నంత వరకు నీ ఆత్మ నరకం అనుభవించాలి – తనుశ్రీ

పెళ్లి వద్దు.. పిల్లలు ముద్దు.. నరేష్ ఊహించని కామెంట్!

చిరంజీవి మూవీని వదులుకున్న బాలయ్య కూతురు!

తెరపై పద్ధతిగా.. నెట్టింట స్టైలిష్‌గా.. సురేఖా వాణి రూటే సెపరేటు!

Big Stories

Advertisement
×