E-Paper
Advertisement

జియో సూపర్ డూపర్ ప్లాన్స్.. రూ. 449 vs రూ. 500.. దేని బెనిఫిట్స్ ఎంత?

జియో సూపర్ డూపర్ ప్లాన్స్.. రూ. 449 vs రూ. 500.. దేని బెనిఫిట్స్ ఎంత?
Advertisement

Jio Plans: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం రూ. 449, రూ. 500 ధరలతో రెండు ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజులే అయినప్పటికీ వీటిలో లభించే ప్రయోజనాలు మాత్రం యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రూ.51 తేడాతో వచ్చిన ఈ రెండు ప్లాన్ల వివరాలు, బెనిఫిట్స్ పరంగా ఉన్న తేడాలు ఈ కథనంలో చూద్దాం.

జియో రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్

జియో అందిస్తున్న రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్ అధిక డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు 28 రోజుల పాటు రోజుకు 3 జీబీ చొప్పున మొత్తం 84 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం పొందవచ్చు. ఇక ప్రత్యేక ఆఫర్ల విషయానికి వస్తే.. ఇందులో జియోహాట్‌స్టార్ (JioHotstar), 50 జీబీ ఉచిత జియోఏఐక్లౌడ్ (JioAICloud) బెనిఫిట్స్ లభిస్తాయి. అంతేకాకుండా రూ. 35,100 విలువైన 18 నెలల ఉచిత గూగుల్ ఏఐ ప్రో (Google AI Pro) ప్లాన్, 12 నెలల ఉచిత కాన్వా ప్రో లైట్ (Canva Pro Lite) సబ్‌స్క్రిప్షన్ కూడా యూజర్లు వినియోగించుకోవచ్చు. అలాగే అర్హత ఉన్న యూజర్లకు అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా లభించనుంది.

జియో రూ. 500 ప్రీపెయిడ్ ప్లాన్

Advertisement

మరోవైపు రూ. 500 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంది. అయితే ఇందులో రోజుకు 2 జీబీ చొప్పున మొత్తం 56 జీబీ డేటా లభిస్తుంది. దీనిలో కూడా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత 5జీ డేటా ప్రయోజనాలు ఉన్నాయి. ఇక ఈ ప్లాన్ అసలు ప్రత్యేకత ఓటీటీ బెనిఫిట్స్‌. జియోటీవీ యాప్ ద్వారా యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్, జీ5, సన్‌నెక్స్ట్, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, కంచ లంక, ఈటీవీ విన్, చౌపాల్, ఫ్యాన్‌కోడ్, తరాంగ్ ప్లస్, టైమ్స్ ప్లే, హోయిచోయ్ వంటి అనేక ఓటీటీ సేవలు లభిస్తాయి. వీటితో పాటు జియోహాట్‌స్టార్ మొబైల్, హాలీవుడ్ కంటెంట్ కూడా అందుబాటులో ఉంది. అలాగే 18 నెలల గూగుల్ జెమిని ఏఐ ప్రో (Google Gemini AI Pro) ప్లాన్, 12 నెలల ఉచిత కాన్వా ప్రో లైట్, 1000కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి.

Also Read: నో గ్యాస్.. నో స్మోక్.. బొగ్గుతో పనిచేసే ఎలక్ట్రిక్ కోల్ బర్నర్.. నిజంగా అదిరిపోయింది మామ!

ఫైనల్గా ఏ ప్లాన్ ఎంచుకుంటే బెటర్?

Advertisement

రోజువారీ డేటా అధికంగా కావాలనుకుంటే రూ. 449 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. అలాకాకుండా రకరకాల ఓటీటీ యాప్‌లు, వినోదం కోరుకుంటే రూ.51 ఎక్కువైనా రూ. 500 ప్లాన్ తీసుకోవడం మంచిది. ఓవరాల్గా మీ అవసరాలకు ఏ ప్లాన్ సరిగ్గా సరిపోతుందో చూసి ప్లాన్ ను ఎంచుకోవడం బెటర్.

Also Read: కొత్త వాషింగ్ మిషన్ కావాలా? మీకిదే గోల్డెన్ ఛాన్స్.. చౌకగా బ్రాండెడ్ మోడల్స్!

Tags

Related News

సీసీ కెమెరా కొనాలనుకుంటున్నారా ?ఈ మోడల్స్‌ని మించినవి లేవు తెలుసా?

నో గ్యాస్.. నో స్మోక్.. బొగ్గుతో పనిచేసే ఎలక్ట్రిక్ కోల్ బర్నర్.. నిజంగా అదిరిపోయింది మామ!

అమెజాన్‌లో బంపర్ సేల్.. రూ.59,000 తగ్గిన ప్రీమియం రిఫ్రిజిరేటర్ ధర!

థియేటర్లలను తలపించేలా హైసెన్స్ ఎల్ఈడీ టీవీలు..ఎగబడి కొంటున్న జనం

కొత్త వాషింగ్ మిషన్ కావాలా? మీకిదే గోల్డెన్ ఛాన్స్.. చౌకగా బ్రాండెడ్ మోడల్స్!

అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే ప్రీమియం OLED టీవీలు.. ఇంటినే థియేటర్‌గా మార్చేయండి!

ఫోన్‌లో అనవసరమైన యాడ్స్ వస్తున్నాయా?ఈ 5 పద్ధతులతో చెక్ చేయండి!

Big Stories

Advertisement
×