Electric Coal Burner: సాధారణంగా మెజారిటీ ప్రజలు కిచెన్ లో వంట చేయడానికి ఎల్పీజీ సిలిండర్లనే వినియోగిస్తున్నారు. ఇటీవల ఏర్పడ్డ గ్యాస్ సంక్షోభం కారణంగా చాలా ఇళ్లల్లో ఇండక్షన్ స్టవ్ వినియోగం కూడా పెరిగింది. అయితే ఇండక్షన్ స్టవ్ వినియోగిస్తే కరెంటు షాక్ కొడుతుందని, పవర్ బిల్లు విపరీతంగా పెరుగుతుందని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఇలాంటి సమయాల్లో ఎలక్ట్రిక్ కోల్ బర్నర్ అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. తక్కువ ధరలో లభించే ఈ స్టవ్‌లో గ్యాస్ టెన్షన్ గానీ, షాక్ కొడుతుందనే భయం గానీ ఉండవు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? దీని ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.
పేరుకు తగ్గట్టుగానే దీన్ని ఉపయోగించడానికి కరెంట్, బొగ్గు (Coal) అవసరం అవుతాయి. ఇది ప్రత్యేకంగా బొగ్గును వేడి చేయడానికి రూపొందించిన ఒక రకమైన ఎలక్ట్రిక్ స్టవ్. దీనిలో మంట, గ్యాస్ అవసరం లేకుండా కేవలం విద్యుత్ సహాయంతో బొగ్గును వేడి చేస్తారు. దీన్ని నేరుగా పవర్ అవుట్‌లెట్‌కి ప్లగ్ చేయడం ద్వారా బొగ్గు క్షణాల్లో వేడెక్కుతుంది. దీనివల్ల ఎలాంటి పొగ రాకుండానే టీ పెట్టుకోవడం నుండి వంట చేయడం వరకు అన్నీ సులభంగా చేసుకోవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ స్టవ్‌లో అత్యంత ముఖ్యమైన భాగం హీటింగ్ ఎలిమెంట్. ఇది ఒక కాయిల్ రూపంలో ఉంటుంది. విద్యుత్ ప్రవహించినప్పుడు ఈ కాయిల్ వేడెక్కి బొగ్గును మండిస్తుంది. దీని పైన ఒక మెటల్ ట్రే (Metal Tray) ఉంటుంది. ఇది బొగ్గు కదలకుండా ఒకే చోట ఉండేలా చూస్తూ సమంగా మంట వచ్చేలా సహాయపడుతుంది. వేడిని మనకు కావాల్సిన విధంగా నియంత్రించడానికి టెంపరేచర్ కంట్రోల్ నాబ్ సైతం ఇందులో ఉంటుంది. అలాగే ఇండికేటర్ లైట్లు, ఆటోమేటిక్ షట్ ఆఫ్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.
Also Read: కొత్త వాషింగ్ మిషన్ కావాలా? మీకిదే గోల్డెన్ ఛాన్స్.. చౌకగా బ్రాండెడ్ మోడల్స్!
ఈ స్టవ్‌పై ఎలాంటి వంట పాత్రలనైనా (స్టీల్, అల్యూమినియం, మట్టి పాత్రలు మొదలైనవి) ఉపయోగించుకోవచ్చు. దీన్ని హ్యాండిల్ చేయడం, మెయింటైన్ చేయడం చాలా ఈజీ. పైగా ఎల్పీజీ గ్యాస్, ఇండక్షన్ స్టవ్ తో పోలిస్తే దీని ధర కూడా చాలా తక్కువే. సాధారణ గ్యాస్ స్టవ్‌లా దీనికి పెద్దగా మంట రాదు కాబట్టి దీన్ని ఉపయోగించడం వల్ల ఫైర్ సేఫ్టీ కూడా లభిస్తుంది. ఎలక్ట్రిక్ కోల్ బర్నర్ త్వరగా వేడెక్కడం వల్ల వంట చాలా ఫాస్ట్ గా ఫినిష్ అవుతాయి. బొగ్గు వాడినప్పటికీ దీని నుంచి ఎలాంటి పొగ రాదు కాబట్టి.. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. బరువు తక్కువగా ఉండటం వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకి చాలా ఈజీగా తీసుకెళ్లవచ్చు.
Also Read: అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే ప్రీమియం OLED టీవీలు.. ఇంటినే థియేటర్‌గా మార్చేయండి!