Big Stories

Toyota Launched Fortuner Hybrid: అదరగొడుతున్న టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ.. ఫీచర్స్ చూస్తే అవక్కే..!

Toyota Launched Mild Hybrid Electric Fortuner SUV: అతిపెద్ద కార్ల తయారీ కంపెనీలో టయోటా కూడా ఒకటి. ఈ కంపెనీకి చెందిన టయోటా ఫార్చ్యూనర్ మార్కెట్‌లో బిగ్గెస్ట్ సక్సెస్‌ఫుల్ వెహికల్‌గా ఉంది. ఈ క్రమంలో టయోటా ఫార్చునర్ మైల్డ్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఎస్‌యూవీ వేరియంట్‌ను దక్షిణాఫ్రికా మార్కెట్ లాంచ్ చేసింది. ఈ మోడల్ వెహికల్ 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ మోటార్ జనరేటర్‌తో కూడిన 2.8L డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇదే ఇంజన్ గ్లోబల్-స్పెక్ హిలక్స్ లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్‌లో కూడా ఇవ్వబడింది. దీని కంబైన్డ్ పవర్, టార్క్ అవుట్‌పుట్‌లు వరుసగా 201bhp, 500Nm, అయితే మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ 16bhp, 42Nm పవర్ బూస్ట్‌ను అందిస్తుంది.

- Advertisement -

స్పెసిఫికేషన్
టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఎస్‌యూవీ మెరుగైన టార్క్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్, స్మూత్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌లు లభిస్తాయి. అదనంగా ఇందులో దాని డీజిల్ వేరియంట్‌తో పోలిస్తే ఫార్చ్యూనర్  ఇంధన సామర్థ్యాన్ని 5 శాతం పెంచుతుందని టయోటా వెల్లడించింది. 2WD, 4WD రెండు డ్రైవ్ ట్రైన్లు ఇందులో అందించబడ్డాయి. టయోటా ఫార్చ్యూనర్ MHEV 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానుంది.

- Advertisement -

Also Read: రెనాల్ట్ డస్టర్ నుంచి కొత్త ఎస్‌యూవీ.. అట్రాక్ట్ చేస్తున్న స్పోర్టీ లుక్!

ఫీచర్లు
దక్షిణాఫ్రికాలో స్పెక్ టయోటా ఫార్చ్యూనర్ MHEVలో 360-డిగ్రీ కెమెరా, టయోటా సేఫ్టీ సూట్ ADAS కూడా ఉన్నాయి. లేన్ డిపార్చర్ అలర్ట్, ప్రీ-కొలిజన్ సిస్టమ్, లేన్ ట్రేసింగ్ అసిస్ట్, డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్, రోడ్ సైన్ అసిస్ట్, ఆటోమేటిక్ హై బీమ్ మరియు ప్రోయాక్టివ్ డ్రైవింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఈ ADAS టెక్నాలజీలో అందించబడ్డాయి.

దేశంలో కొత్త ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ కొత్త మోడల్ 2025 ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది. బ్రాండ్  TNGA-F ప్లాట్‌ఫారమ్ ఆధారంగా కొత్త టయోటా ఫార్చ్యూనర్ వర్టికల్ ఇన్‌టేక్‌తో రీడిజైన్ చేయబడిన గ్రిల్, అప్‌డేట్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లు, బంపర్ హౌసింగ్ స్క్వేర్ షేప్ ఫాగ్ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్, రియర్ బంపర్‌లను చూడవచ్చు.

Also Read: ఫోర్డ్ రీ ఎంట్రీ.. ఆ కంపెనీలకు పోటీగా ఎస్‌యూవీ

2025 కొత్త ఫార్చ్యూనర్ వెహికల్ ఎలక్ట్రిక్ స్టీరింగ్‌ను పొందుతుంది. ఇది దాని పనితీరును కూడా పెంచుతుంది. ఇండియా స్పెక్ వెర్షన్ ఇప్పటికే ఉన్న 2.8L టర్బో డీజిల్ ఇంజన్‌ను పొందే అవకాశం ఉంది. అయితే ఇందులో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉండే అవకాశం కూడా ఉంది…

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News