Airtel Users: ట్రెండ్‌కు అనుగుణంగా అడుగులు వేస్తున్నాయి టెలికాం ఆపరేటర్లు. లేకుంటే వెనుకబడిపోతామని ఆలోచన చేస్తున్నాయి. తాజాగా దేశంలో రెండో టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త చెప్పేసింది. ఏడాది పాటు ఉచితంగా పెర్ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్ అందించనుంది.
అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వినియోగదారులు ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త కొత్త ఫీచర్స్ కోసం వెతుకులాట మొదలు పెడుతున్నారు. యూజర్స్ ఆలోచన విధానం పసిగట్టిన ఎయిర్‌టెల్ కంపెనీ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ Perplexity తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఏంటి అనుకుంటున్నారా? అక్కడికి వచ్చేద్దాం.
ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఉచిత పెర్ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఇవ్వనుంది. మొబైల్ యూజర్స్ మాత్రమేకాకుండా వైఫై, డీటీహెచ్ సబ్‌స్క్రైబర్లందరికీ వర్తించనుంది. Perplexity Pro లో అధునాతన AI టూల్స్ ఉన్నాయి. వినియోగదారులు రోజువారీ పరిశోధనలు, సెర్చింగ్, అధునాతన AI మోడళ్లకు యాక్సెస్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు GPT 4.1, క్లాడ్ వంటివి ఉంటాయి. వాటిని ఎంచుకునే సామర్థ్యం, లోతైన పరిశోధన, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్‌లోడ్, విశ్లేషణ, అలాగే పర్ప్లెక్సిటీ ల్యాబ్స్, ఆలోచనలకు ప్రాణం పోసే ఒక ప్రత్యేకమైన సాధనం Perplexity Pro సొంతం. ఏడాదికి 17 వేల రూపాయల ధర కలిగిన Perplexity Proని సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇవ్వనుంది.
ALSO READ: బంగారం బంపరాఫర్.. మార్కెట్లోకి 9 క్యారెట్ల గోల్డ్
ఎయిర్‌టెల్‌కి దేశ విదేశాల్లో దాదాపు 360 మిలియన్ల వినియోగదారులున్నారు. ఈ మధ్యకాలంలో ఎయిర్‌టెల్‌కు కస్టమర్ల సంఖ్య తగ్గుతోంది. జియోకు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాత వినియోగదారులు డ్రాప్ కాకుండా, కొత్తవారిని ఆకట్టుకునేందుకు ఆ కంపెనీ వేసిన స్కెచ్‌గా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మే 31నాటికి ఎయిర్‌టెల్‌కు సుమారు 390 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. జియోకు 472 మిలియన్ల మంది ఉన్నారు. జియో 2.7 మిలియన్ల అదనపు కనెక్షన్లు ఉండగా, ఎయిర్‌టెల్ కేవలం 275,000 మాత్రమే ఉంది. Perplexity Pro తో జత కట్టడం చాలా ఆనందంగా ఉందని ఎయిర్‌టెల్ ప్రతినిధుల మాట.
రియల్ టైమ్ నాలెడ్జ్ టూల్‌ను కొన్ని మిలియన్ల మందికి అందుబాటులోకి రానుందని తెలిపారు. వేగంగా విస్తరిస్తోన్న డిజిటల్ యుగంలో వినియోగదారులను అప్‌డేట్ చేసేందుకు టెలికాం ఆపరేట్-మరొక ఏఐ సంస్థతో జతకట్టడం దేశంలో ఇదే తొలిసారని అంటున్నారు. వినియోగదారులు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఉచితంగా ఆఫర్‌ను పొందవచ్చు.