Stranger things 5 Teaser:ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ.. సెన్సేషనల్ హిట్ అయిన పలు క్రేజీ వెబ్ సిరీస్లలో గ్లోబల్ సెన్సేషన్ ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ కూడా ఒకటి. ఇప్పటివరకు రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్.. ఇప్పుడు చివరి సీజన్ కి చేరుకుంది. అందులో భాగంగానే ఈ చివరి సీజన్ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేయగా.. అంచనాలు ఊహించని లెవెల్ లో ఉండడమే కాకుండా క్షణక్షణం ఉత్కంఠ భరితంగా సాగుతూ.. వెన్నులో వణుకు పుట్టించే అంశాలతో ఆధ్యంతం ఆకట్టుకుంటుంది.
ఆసక్తికరంగా మారిన స్ట్రేంజర్ థింగ్స్ 5 టీజర్..
ఇక తాజాగా మేకర్స్ వదిలిన లేటెస్ట్ టీజర్ ఈ సిరీస్ ముగింపు పై మరిన్ని అంచనాలను పెంచేసిందని చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ సిరీస్ లవర్స్ కి ఈ టీజర్ ఒక బ్లాస్ట్ అని చెప్పాలి. ఇక ఈ సిరీస్ లో యువనటీనటుల ఫ్రెండ్షిప్ విజువల్స్ ను ప్రధానంగా చేసుకొని తెరకెక్కించారు. ముఖ్యంగా ఎల్ అతని ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మొత్తం కూడా వెక్నా తో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్స్ ఏం చేశారు అనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. ముఖ్యంగా తాజాగా వదిలిన టీజర్ తర్వాత వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ ఫైనల్ సీజన్ ని నెట్ఫ్లిక్స్ వారు ఏకంగా మూడు వాల్యూమ్స్ లో తీసుకొస్తున్నట్లు సమాచారం. నవంబర్ 27న పార్ట్ 1, డిసెంబర్ 26న పార్ట్ 2 అలాగే వచ్చే ఏడాది జనవరి 1న ఫైనల్ ఎపిసోడ్ తో ముగించనున్నారు. మరి ఈ క్రేజీ సిరీస్ ఎలాంటి ట్రీట్ ఇస్తుందో తెలియాలి అంటే నవంబర్ వరకు ఎదురు చూడాల్సిందే.
భయం పుట్టిస్తున్న స్ట్రేంజర్స్ థింగ్స్ 5 టీజర్..
ఇకపోతే ఈ 2:49 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ లో ఏలియన్ తో పాటు మరి కొన్ని వింతైన జంతువులను కూడా చూపించారు. ముఖ్యంగా మంటలలో ఒక చిన్న పిల్లాడిని ఎగరవేసే సీన్ ఇక్కడ హైలెట్గా నిలిచింది. అంతేకాదు అత్యంత భయానకంగా సాగే సన్నివేశాలు చూసే ప్రేక్షకుడి వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ప్రతి సన్నివేశం కూడా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ముఖ్యంగా నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే ఆత్రం ఆడియన్స్ లో తప్పకుండా కలుగుతుంది అని చెప్పవచ్చు. భారీ అంచనాల మధ్య చివరి సీజన్ గా రాబోతున్న ఈ స్ట్రేంజర్ థింగ్స్ 5 వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
ALSO READ:Star Hero: కన్నకొడుకు మరణాన్నే కోరుకున్న నటుడు..అసలు నిజం తెలిస్తే షాక్!