Amazon Summer Sale 2026: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. ఈ ఏడాది సమ్మర్ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్, గృహోపకరణాలతో పాటు మరెన్నో కేటగిరీలపై ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్స్ అందిస్తోంది. ప్రైమ్ మెంబర్ షిప్ సభ్యులు గ్రేట్ సమ్మర్ సేల్‌కు కాస్త ముందుగా యాక్సెస్ చేయవచ్చు.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 8న ప్రారంభం అవుతుంది. కస్టమర్లు ముందుగా విష్‌లిస్ట్‌లను రెడీ చేసుకునేందుకు.. ఇప్పటికే పలు కేటగిరీలలో ప్రీ-సేల్ డీల్స్‌ను స్టార్ట్ చేసింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు, ఈజీఈఎంఐ ఆప్షన్ తో 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లను కూడా అందిస్తుంది. అలాగే ఇన్ స్టాల్మెంట్ ప్లాన్ లు రోజుకు రూ. 9 నుంచి స్టార్ట్ చేస్తుంది. ప్రైమ్ మెంబర్లు 2 లక్షలకు పైగా ప్రొడెక్టులపై అదనంగా 3 శాతం డిస్కౌంట్, మరిన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
గ్రేట్ సమ్మర్ సేల్ లో ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, డిజిటల్ కూపన్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ప్రైమ్ మెంబర్లకు, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఫ్లాట్ 10 శాతం డిస్కౌంట్, 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. సెలెక్టడ్ ఐటెమ్స్ పై రూ. 1,250 వరకు క్యాష్‌బ్యాక్, రూ. 2,500 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అమెజాన్ ప్రోమోకోడ్ హంట్ ఫీచర్లను కూడా పరిచయం చేస్తోంది. దీని ద్వారా సేల్ సమయంలో గేమిఫైడ్ పార్టనర్షిప్ తో ఎడిషనల్ డిస్కౌంట్లను పొందవచ్చు.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్‌లు, ఫ్యాషన్, హోమ్ అప్లయెన్సెస్ వంటి పలు కేటగిరీలలో భారీ తగ్గింపులు అందిస్తుంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, హోమ్ అప్లయెన్సెస్ పై ప్రారంభ డీల్స్‌ను ప్రకటించింది. షియోమి Pad 8 టాబ్లెట్ ధర 37,999 రూపాయల నుంచి 30,999 రూపాయలకు తగ్గనుంది. అలాగే iQOO 15R కాస్ట్ 53,999 రూపాయల నుంచి 42,999 రూపాయలకు తగ్గనుంది. 69,999 రూపాయల విలువ చేసే JBL 800 Pro సౌండ్‌బార్ ను 49,999 రూపాయలకే లభిస్తుంది.
అమెజాన్ AI అసిస్టెంట్ రూఫస్ కస్టమర్ల షాపింగ్ ను మరింత ఈజీ చేయనుంది. రూ. 2,000 లోపు బెస్ట్ డీల్స్ అని అడగగానే.. ఏఐ అసిస్టెంట్ అందుకు తగిన డీల్స్ స్క్రీన్ పై డిస్ ప్లే చేస్తుంది. కస్టమర్లు షాపింగ్ ను ఈజీ చేసేందుకు 30 నుంచి 90 రోజుల ధరల హిస్టరీని ఏఐ యాక్సెస్ చేస్తుంది. వ్యూ ఇన్ యువర్ రూమ్ ఫీచర్ తో ఫర్నీచర్ మన రూమ్ లో ఎలా ఉంటుందో ముందుగానే చెక్ చేసుకోవచ్చు.
Also Read: అమెజాన్ సమ్మర్ స్పెషల్.. ఏసీలపై బంపరాఫర్లు.. ఇవి నిజంగా వర్త్ వర్మా వర్త్!