US Food Products In India: ఇండియాలో చాలా అమెరికన్ కంపెనీలు ఫుడ్ బిజినెస్ చేస్తున్నాయి. బర్గర్ల నుంచి చాక్లెట్ల వరకు ఆహార ఉత్పత్తుల అమ్మకాలను కొనసాగిస్తున్నాయి. స్థానిక రుచులు, శాఖాహార ఎంపికలను జోడించడం ద్వారా సదరు కంపెనీలు భారతీయులకు మరింత దగ్గరవుతున్నాయి. గత కొద్ది రోజులుగా అమెరికాతో టారిఫ్ ల ఉద్రిక్తతల కారణంగా కొంతమంది భారతీయులు ఆదేశానికి చెందిన ఉత్పత్తులను బహిష్కరిస్తున్నారు. ఇంతకీ ఇండియాలో ఉన్న పాపులర్ అమెరికన్ ఫుడ్ బ్రాండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ఫాస్ట్ ఫుడ్స్
అమెరికాకు చెందిన చాలా ఫాస్ట్ ఫుడ్ చైన్‌లు మన దేశంలో బాగా పాపులర్ అయ్యాయి. మంచి రుచి కారణంగా ఇక్కడి ప్రజలు వాటిని ఎంతో ఇష్టంగా తింటారు.
❂ మెక్‌డొనాల్డ్స్: ఈ సంస్థ మెక్ ఆలూ టిక్కీ, మహారాజా మాక్ లాంటి బర్గర్లను, చికెన్ మెక్ నగ్గెట్లను విక్రయిస్తుంది. ఇవి మన దేశంలో పలు నగరాల్లో 300 కంటే ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి.
❂ KFC: చికెన్ బిర్యానీ, వెజ్ జింగర్ లాంటి భారతీయ వస్తువులతో తయారు చేసిన చికెన్, జింగర్ బర్గర్లకు ప్రసిద్ధి చెందింది.
❂ పిజ్జా హట్: తందూరీ పన్నీర్ పిజ్జా లాంటి రుచికరమైన పిజ్జాలను అందిస్తుంది. పాస్తాలు, కూల్ డ్రింక్స్ అందిస్తుంది. పానీయాలను అందిస్తుంది.
❂ డొమినోస్ పిజ్జా: పన్నీర్ మఖానీ లాంటి పిజ్జాలను అందిస్తుంది. దేశం అంతటా 1,500 కి పైగా రెస్టారెంట్లు ఉన్నాయి.
❂ బర్గర్ కింగ్: పనీర్ వొప్పర్, చికెన్ టిక్కా బర్గర్ లా ఇక్కడ ఎక్కువగా లభిస్తాయి.
❂ సబ్ వే: ఆలూ ప్యాటీ, చికెన్ టిక్కా సబ్స్ లాంటి భారతీయ ఎంపికలతో శాండ్ విచ్లను తయారు చేస్తుంది.
⦿ కూల్ డ్రింక్స్
అమెరికాకు చెందిన కూల్ డ్రింక్ కంపెనీలు భారత్ లో అతిపెద్ద మార్కెట్ ను కలిగి ఉన్నాయి.
❂ పెప్సికో: పెప్సి కంపెనీకి చెందిన పెప్సి, 7UP, మిరిండా, మౌంటెన్ డ్యూ, ట్రోపికానా జ్యూస్ లు, క్వేకర్ ఓట్స్ ను అమ్ముతుంది.
❂ కోకా కోలా: కోకా-కోలా, స్ప్రైట్, ఫాంటా, మాజా, మినిట్ మెయిడ్ జ్యూస్‌లను అందిస్తుంది. స్థానికంగా ఇష్టమైన థమ్స్ అప్ కూడా ఈ బ్రాండ్ కు చెందినదే.
ఈ కూల్ డ్రింక్స్ దేశంలోని అన్ని దుకాణాలు, రెస్టారెంట్లు, ఆన్ లైన్ స్టోర్లలో లభిస్తాయి.
⦿ స్నాక్స్, స్వీట్స్
యుఎస్ స్నాక్, చాక్లెట్ బ్రాండ్లు భారతీయ ఇళ్లలో సర్వసాధారణం కనిపిస్తాయి.
❂మోండెలెజ్ (క్యాడ్ బరీ): క్యాడ్ బరీ డైరీ మిల్క్, ఓరియో బిస్కెట్లు, బోర్న్ విటా, 5 స్టార్, పెర్క్ లను తయారు చేస్తుంది. వీటిని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.
❂మార్స్: స్నికర్స్, మార్స్ బార్లు, M&Mలను చాలా దుకాణాల్లో విక్రయిస్తుంది.
❂పెప్సికో: మ్యాజిక్ మసాలా లాంటి భారతీయ రుచులతో లేస్ చిప్స్, కుర్కురే, డోరిటోలను అందిస్తుంది.
హుయ్ ఫాంగ్ శ్రీరాచా (హాట్ సాస్), టబాస్కో (స్పైసీ సాస్) లాంటి యుఎస్ బ్రాండ్‌లు పెద్ద నగరాల్లో, ఆన్ లైన్ లో విరివిగా లభిస్తున్నాయి. స్మక్కర్స్ జామ్‌లు, పీనట్స్ కూడా కొన్ని దుకాణాలలో అందుబాటులో ఉన్నాయి.
Read Also: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!