BigTV English

Anand Mahindra Offers Job to Teen: ఆ అమ్మాయి తెలివికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. ఉద్యోగమిస్తామంటూ ట్వీట్..!

Anand Mahindra Offers Job to Teen: ఆ అమ్మాయి తెలివికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. ఉద్యోగమిస్తామంటూ ట్వీట్..!
Anand Mahindra
Anand Mahindra

Anand Mahindra offers a Job to Teen: తెలివితేటలకు, సమయస్ఫూర్తికి వయసుతో సంబంధం లేదు. సందర్భాన్ని బట్టి మనిషి సమయస్ఫూర్తికి పదును పెడతాడు. మీరు గమనించినట్లైతే.. ఇటీవల ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అలెక్సాను వాడి.. 13 ఏళ్ల బాలిక తన మేనకోడలిని కోతుల బారి నుంచి రక్షించుకుంది. యూపీలోని బస్తీ జిల్లాకు చెందిన నికిత అనే బాలిక చేసిన సాహసమిది. కాదు కాదు.. సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరు ఇది.


15 నెలల వామికతో కలిసి నికిత ఆడుకుంటూ ఉండగా.. కోతుల సమూహం ఇంట్లోకి ప్రవేశించి ఆహారాన్ని, వస్తువులను పాడుచేశాయి. వాటిలో ఒకటి నికిత, వామికల వద్దకొచ్చింది. అదేం చేస్తుందోనని నికిత భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. వెంటనే అలెక్సా గుర్తొచ్చింది. అంతే.. దానికి కుక్కలా మొరుగు అని కమాండ్ ఇచ్చింది. వెంటనే అలెక్సా డాగ్ లా మొరుగుతూ పెద్దగా శబ్దాలు చేయడంతో కోతులు భయపడి అక్కడి నుంచి ఉడాయించాయి. ఈ విషయాన్ని నికిత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఆ వీడియో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కంట పడింది. మామూలుగానే ఆయన ఇలాంటి ఆసక్తికరమైన విషయాలపై తరచూ స్పందిస్తుంటారు. నికిత సమయస్ఫూర్తికి ఫిదా అయిపోయారు.


Also Read: విప్రో సీఈఓ రాజీనామా.. కొత్త బాస్ ఎవరంటే..?

“టెక్నాలజీకి మనం బానిసలుగా మారుతామా లేక టెక్నాలజీ మాస్టర్స్ అవుతామా అన్నది ఈ యుగంలో మనముందున్న ప్రధాన ప్రశ్న. కానీ.. ఈ బాలిక అలెక్సాను వాడిన తీరు చూశాక.. సాంకేతికత మన ఆజ్ఞలను పాటించేదే అన్న భావన కలిగింది. కోతుల ముందు ఆమె సమయస్ఫూర్తిగా వ్యవహరించిన తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. చదువు పూర్తయ్యాక.. ఆ బాలిక కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేయాలనుకుంటే.. మహీంద్రా రైజ్ లో చేరాలని ఆహ్వానిస్తున్నాం. ఆమెకు మేము ఉద్యోగమిస్తాం” అని ఆనంద్ మహీంద్రా X వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కింద నికిత ఎదుర్కొన్న పరిస్థితి వివరిస్తూ పోస్ట్ చేసిన వీడియో లింక్ ను కూడా జత చేశారాయన.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×