Big Stories

JioBook @ Rs 14,000: జియో లాప్ టాప్ రూ.14 వేలే.. 100GB క్లౌడ్ స్టోరేజీ.. ఫీచర్తోస్ కూడా అదుర్స్!

latest telugu news

JioBook Laptop @ Rs Rs 14,000: ప్రస్తుతం కాలంలో ల్యాప్‌టాప్ అనేది చాలా అవసరం. ఇదివరకు ఉద్యోగం చేసే వారు మాత్రమే దీన్ని తమ పనుల కోసం ఉపయోగించే వారు. కానీ, ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా ల్యాప్‌టాప్ అవసరం ఉంది. అయితే వీటి రేట్లు ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలు వీటిని కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు.

- Advertisement -

అయితే అలాంటి వారికి అతి తక్కువ ధరలో అదిరిపోయే ల్యాప్‌టాప్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి స్కూల్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ ధరలో ల్యాప్‌టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇదొక చక్కటి అవకాశమనే చెప్పుకోవాలి.

- Advertisement -

మార్కెట్‌లోకి రిలయనస్ జియో నుంచి తక్కువ బడ్జెట్‌లో కొత్త జియో బుక్ ల్యాప్‌టాప్ దర్శనమిచ్చింది. ఇందులో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. మరి దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారి కోసం దీని ధర, ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Read More: ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. బాప్రే ఏకంగా రూ.39వేల తగ్గింపు!

జియో కంపెనీ ప్రకారం.. మన దేశంలో ఇదే తొలి లెర్నింగ్ ల్యాప్‌టాప్‌ అని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా ఇది విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. డాక్యమెంట్స్ క్రియేట్ చేయడం, ఈ మెయిల్స్ సెండ్ చేయడంతో పాటు మల్టీపుల్ ప్రయోజనాల కోసం ఈ ల్యాప్‌టాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది.

ఇందులో కోడింగ్ కూడా నేర్చుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ ల్యాప్‌టాప్‌కి వైఫైకి కనెక్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇందులో నేరుగా జియో 4జీ కనెక్టివిటీ సపోర్టు ఉంటుంది.

స్పెసిఫికేషన్స్:

11.6 ఇంచ్ యాంటీ గ్లేర్ డిస్‌ప్లేతో ఈ ల్యాప్‌టాప్ వస్తుంది. జియో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ చేసే మీడియా టెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 8 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంటుంది.

Read More: ఈ 5 బైక్స్ సూపరో సూపర్.. మైలేజ్ ఎక్కువ.. ధర రూ. లక్ష లోపే!

కాగా ఈ ల్యాప్‌టాప్ నుంచి జియో టీవీ యాక్సెస్ పొందవచ్చు.అలాగే గేమింగ్ కోసం జియో గేమ్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఈ ల్యాప్‌టాప్ పై మంచి ఆఫర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఫస్ట్ ఒక ఏడాది క్విక్ హీల్ యాంటీ వైరస్ సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఫ్రీగా అందిస్తుంది. అలాగే డిజిబాక్స్ నుంచి రెండోది 100జీబీ ఫ్రీగా క్లౌడ్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది.

ధర:

ఇకపోతే దీని ధర విషయానికొస్తే.. 4జీ కనెక్టివిటీపై ఆసక్తి ఉన్నవారు దీన్ని కొనుక్కోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.14,071. దీన్ని రిలయన్స్ డిజిటల్ షోరూమ్స్ లేదా ఆన‌లైన్‌లో అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News