Savings Account Rules: ఈ రోజుల్లో చాలా మందికి పొదుపు ఖాతాలకు సంబంధించిన నియమ నిబంధనల గురించి తెలియదంటే ఎలాంటి అతిశయోక్తి లేదేమో. అయితే ఇది సరిగ్గా పాటించకపోతే ఖాతాదారులు పన్ను నోటీసును అందుకోవచ్చు.
భారతీయ పన్ను చట్టం ప్రకారం.. పొదుపు డిపాజిట్లు బ్యాంకుల ఆధీనంలో ఉంటాయి. అయితే పొదుపు అనేది నిర్ధిష్ట పరిమితిని మించి ఉంటే ఇన్ కామ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు రిపోర్ట్ ఇస్తాయి. ఎకానమిక్ ఇయర్ ఏప్రిల్ 1నుంచి మార్చి 31 వరకు మీ సేవింగ్ ఖాతాలో డిపాజిట్ రూ.10లక్షలు దాటినట్లయితే.. ఖాతాదారులు ఇన్‌కామ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి తెలియజేయాలి. ఈ లిమిట్ అనేది ఒక్క అకౌంట్‌కి మాత్రమే కాకుండా అని అకౌంట్లకి వర్తిస్తుంది. ఒక వేళ పొదుపు రూ.10లక్షలు మించితే బ్యాంక్ లావాదేవీ వివరాలను అధికారులకు తెలుపుతోంది.
రూ.10లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయడం వల్ల కలిగి పరిణామాలివే..
ఆర్థిక సంవత్సరంలో రూ.10లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు చేస్తే అది.. అత్యధిక విలువ గల లావాదేవీలుగా పరగణిస్తారు. ఒక వేళ ఖాతాదారులు రూ.10లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే.. బ్యాంక్‌లు అలాంటి లావాదేవీలను ఇన్ కామ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేస్తాయి. ఖాతాదారులో ఒక్కరోజులో రూ.50వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే మీ పాన్ నంబర్‌ను బ్యాంక్ అధికారులు తెలపాలి. ఒక వేళ ఖాతాదారుల వద్ద పాన్ నంబర్ లేకపోతే తప్పనిసరిగా 60/61 ఫామ్‌ని నింపి బ్యాంక్ అధికారులకు అందజేయాలి.
ఆర్థిక సంవత్సరంలో మీ పొదుపు ఖాతా నుంచి రూ.10వేల కంటే ఎక్కువ వడ్డీ రాగలిగితే.. ఆ టాక్స్ స్లాబ్ ప్రకారం.. వడ్డీపై ట్యాక్స్ విధిస్తారు. ఒక వేళ రూ.10వేల కంటే తక్కువ వడ్డీ రాగలిగితే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80టీటీఏ ప్రకారం.. ఖాతాదారులు పన్ను మినహాయింపు పొందుతారు. ఇది సీనియర్ సిటజన్లకు అయితే రూ.50వేల కంటే ఎక్కువ మినహాయింపు ఉంటుంది.
ఖాతాదారులకు పన్ను నోటీసు వస్తే..?
ఖాతాదారులు రూ.10లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసినప్పుడు.. ఆదాయ వివరాల గురించి అధికారులకు తెలియజేయాలి. ఒకవేళ.. ఇన్ కామ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులకు తెలియజేయకుంటే మీ ఇంటికి నోటీసు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖాతాదారులు కొన్ని నిబంధనలు పాటించాలి. ఖాతాదారులు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, పెట్టుబడి రికార్డులు, ఆస్తి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రాసెస్ తెలియకుంటే బ్యాంక్ అధికారులను కలవవచ్చు. సెక్షన్ 269ఎస్‌టీ ప్రకారం ఒక్క రోజులో రూ.2లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేసే అనుమతి ఎవరికి లేదు. బ్లాక్ మనీ, పన్ను ఎగవేతలను నిరోధించడంలో ఈ రూల్ వర్తిస్తుంది.
Also Read: Air Forces: వైమానిక దళాల్లో టాప్-10 ర్యాంకులు కల్గిన దేశాలివే.. మన భారత్ ర్యాంక్ ఎంతంటే..?
ఖాతాదారులు కచ్చితంగా పొదుపు ఖాతాలో డిపాజిట్ నియమ నిబంధనల గురించి తెలుసుకోవాలి. బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన డబ్బులకు వచ్చిన వడ్డీని పెండింగ్‌లో ఉంచకుండా తీసుకుంటే ఖాతాదారునికి మంచింది. ఒక ఆర్థిక సంవత్సరలో రూ.10లక్షలకు మించి డిపాజిట్ చేస్తే.. ఆ తదుపరి చర్యలు ఎలా ఉంటాయో ముందే బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకోవాలి.