Google Play : గూగుల్ ప్లే కొత్త సెక్యూరిటీ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ తో యూజర్ సెక్యూరిటీని మరింత మెరుగుపరుస్తుంది. ఇకపై VPN కోసం 10,000 ఇన్‌స్టాల్‌లు, 250 సమీక్షలు ఉండాలని తెలిపింది. అంతేకాకుండా కనీసం 90 రోజుల పాటు Google Playలో ప్రచురించబడాలి.
సైబర్ క్రైమ్స్ తో పాటు మాల్వేర్ యాప్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో గూగుల్ తన భద్రతను మరింత పెంచే చర్యలు చేపట్టింది. ఇప్పటికే గూగుల్ క్రోమ్ తో పాటు జీమెయిల్లో ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకొచ్చేసిన ఈటెక్ దిగ్గజం తాజాగా గూగుల్ ప్లే మరో కీలక ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చేసింది. ఈ ఫీచర్ తో గూగుల్ ప్లేలో ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తే ముందు దాని ఇన్స్టాలేషన్స్ తో పాటు సమీక్షలు క్లియర్ గా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
గూగుల్ తన గూగుల్ ప్లేలో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తన బ్లాగ్ పోస్ట్‌లో ప్రస్తావించింది. ఈ ఫీచర్ ప్రత్యేకంగా యూజర్ అదనపు గోప్యతతో పాటు భద్రతను మరింత మెరుగుపరచటానికి రూపొందించారు. ఇక ఈ ఫీచర్‌కి ‘బ్యాడ్జ్’ అని పేరు పెట్టారు.
Google Play Badge Feature –
Google Play ఇప్పటి నుండి ఆమోదించబడిన VPNలలో ధృవీకరణ బ్యాడ్జ్‌లను ప్రదర్శించనున్నట్టు తెలిపింది. ఈ ఫీచర్ వినియోగదారు గోప్యత, భద్రతను హైలైట్ చేయడానికి ప్రాధాన్యతనిచ్చే మార్గమని బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. దీంతో పాటు “ఈ కొత్త ఫీచర్ వినియోగదారుల గోప్యత, భద్రతను మరింత పెంచుతుంది. అంతేకాకుండా వినియోగదారుడు భద్రత కోసం పనిచేసే యాప్స్ కు సహాయపడుతుంది. వినియోగదారుడు సరైన యాప్స్ ను ఎంచుకోవడానికి, యాప్స్ పై విశ్వసనీయతను మరింత పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డౌన్లోడ్ చేసే యాప్ భద్రతను సైతం వివరిస్తుంది..” అని తెలిపింది.
వెరిఫికేషన్‌లు VPNల కోసం ప్లే స్టోర్ బ్యానర్, Play స్టోర్‌లోని డేటా సేఫ్టీ సెక్షన్ డిక్లరేషన్ ను అందిస్తాయి. వీటితో సహా ఇప్పటికే ఉన్న ఫీచర్‌లను కూడా క్లియర్ గా తెలుపుతాయి. ఈ ఫీచర్ Google నిర్వచించిన నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇక ధృవీకరణ బ్యాడ్జ్‌కి అర్హత పొందేందుకు, వినియోగదారుడి VPN తప్పనిసరిగా మొబైల్ అప్లికేషన్ సెక్యూరిటీ అసెస్‌మెంట్ (MASA) లెవల్ 2 ధ్రువీకరణతో సహా కొన్ని అసెస్‌మెంట్ పరీక్షలను పూర్తి చేయాలి. ఈ స్టెప్స్ యాప్ భద్రతను అంచనా వేస్తాయి.
VPN సెక్యూరిటీ స్టేజ్ దాటడానికి యాప్స్ 10,000 ఇన్‌స్టాల్‌లు, 250 సమీక్షలు కలిగి ఉండాలి. ఇంకా కనీసం 90 రోజుల పాటు Google Playలో ప్రచురించాలి. డేటాను ఎలా సేకరిస్తున్నారు.. స్వతంత్ర భద్రతా సమీక్షలను ఎలా ఎంచుకుంటున్నారు అనే దాని గురించి సరైన సమాచారాన్ని సమర్పించాలి.
Google బ్లాగ్ పోస్ట్ ఇంకా ఏం వివరిస్తుందంటే.. “VPN బ్యాడ్జ్‌ని పొందటం అంటే కేవలం బాక్స్‌ను చెక్ చేయడం మాత్రమే కాదు.. ఈ VPN యాప్.. యాప్ భద్రతను పాటిస్తుందని చెప్పటానికి ఇదే రుజువు. ప్లే భద్రత, భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి, మొబైల్ అప్లికేషన్ సెక్యూరిటీ అసెస్‌మెంట్ (MASA) లెవల్ 2 ధ్రువీకరణను విజయవంతంగా పూర్తి చేసిందని తెలుపటం అంటూ గూగుల్ వెల్లడించింది.
ALSO READ : టాప్ లేచిపోయే ఫీచర్స్ తో సామ్సాంగ్ ఫోల్డబుల్ మెుబైల్.. త్వరలోనే లాంఛ్