E-Paper
Advertisement

ఆగస్టులో భారీగా సెలవులు.. ఏకంగా 14 రోజులు బ్యాంకులు మూసివేత.. ఏ ఏ తేదీల్లో అంటే?

ఆగస్టులో భారీగా సెలవులు.. ఏకంగా 14 రోజులు బ్యాంకులు మూసివేత.. ఏ ఏ తేదీల్లో అంటే?
Advertisement

August Bank Holidays 2026: ప్రతీ నెలలాగే ఆగస్టులోనూ బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. స్వాతంత్ర దినోత్సవంతో పాటు ఓనం, రక్షాబంధన్, మిలాద్-ఉన్-నబీ వంటి పండుగలు ఆగస్టులో ఉండటంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు ఆయా రోజుల్లో నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులతో ముడిపడి ఉన్న ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసేందుకు సెలవు తేదీలను తెలుసుకోవడం ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి. కాబట్టి బ్యాంకుల హాలీడేస్ వివరాలను ఈ కథనంలో తెలుసుకొని ఆ తేదీల్లో కాకుండా మిగిలిన రోజుల్లో బ్యాంక్ వ్యవహారాలు చక్కబెట్టేలా ప్లాన్ చేసుకోండి.

ఆగస్టు 15 దేశవ్యాప్తంగా సెలవు..

ప్రతీ ఏటా ఆగస్టు 15న జరుపుకునే భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులను మూసివేయనున్నారు. ఆ రోజు నేషనల్ హాలీడే కావడంతో ఎటువంటి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. అయితే ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఏటీఎంలో డబ్బు విత్ డ్రా, ఆన్ లైన్ లో డబ్బు ట్రాన్స్ ఫర్ వంటివి చేసుకోవచ్చు.

రాష్ట్రాల వారీగా సెలవులు ఇలా..

Advertisement

❄️ఆగస్టు 4 (మంగళవారం): కేర్ పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు.

❄️ ఆగస్టు 8 (శనివారం): టెండంగ్ లో రుమ్ ఫాత్ పండుగ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులు మూసివేయనున్నారు.

Advertisement

❄️ ఆగస్టు 13 (గురువారం): పేట్రియాట్స్ డే సందర్భంగా మణిపూర్‌లోని బ్యాంకులు పనిచేయవు.

❄️ ఆగస్టు 19 (బుధవారం): మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి సందర్భంగా త్రిపురలోని బ్యాంకులు హాలీడే పాటిస్తాయి.

❄️ ఆగస్టు 25 (మంగళవారం): మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు (మిలాద్-ఉన్-నబీ) ఏపీ సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.

❄️ ఆగస్టు 26 (బుధవారం): ఈద్-ఇ-మిలాద్, ఓణం సందర్భంగా.. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో సెలవు.

❄️ ఆగస్టు 28 (శుక్రవారం): రక్షాబంధన్, శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీడే.

Also Read: నీటిలోనూ దూసుకెళ్లే.. బెస్ట్ ‘హై గ్రౌండ్ క్లియరెన్స్’ కార్లు.. వర్షాకాలం అస్సలు తగ్గేదేలే!

ఇతర సాధారణ సెలవులు..

సాధారణంగా ప్రతి నెలా వచ్చే రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులు మూసి ఉంటాయి. కాబట్టి ఆగస్టు 2, 9, 16, 23, 30 (ఆదివారాలు) తేదీల్లో బ్యాంకులు ఉండవు. అలాగే ఆగస్టు 8న రెండో శనివారం, ఆగస్టు 22న నాల్గో శనివారం సందర్భంగా కూడా బ్యాంకులు తెరుచుకోవు. కాగా, పైన పేర్కొన్న పండుగ సెలవులు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల జాబితాను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి.. మీ ప్రాంతంలోని బ్యాంక్ బ్రాంచ్ సెలవు తేదీలను ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్.

Also Read: ఇంధన ధరలతో విసిగిపోయారా? మైలేజ్‌తో కేక పుట్టిస్తున్న.. ఈ CNG కార్లు మీకోసమే!

Related News

దేశంలో తగ్గిన బంగారం డిమాండ్.. 6 శాతానికి పతనం, నాణాలు-బిస్కట్లు-ETFలపై మొగ్గు

పసిడి ప్రియులకు షాక్.. అమాంతంగా పెరిగిన ధరలు, వెండి మాటేంటి?

Indian Army Jobs: ఆర్మీ లా ఆఫీసర్ జాబ్స్.. ఏడాదికి రూ.17 లక్షలకు పైగా సాలరీ

మధ్యతరగతి ప్రజల జేబుకు చిల్లు.. ఆగస్టు ఒకటి నుంచి ధరల మోత, ఏయే వస్తువులో తెలుసా?

స్విగ్గీ, జొమాటోల ఆటలు సాగవు.. ఆగస్టు 15 నుంచి బహిష్కరిస్తాం.. రెస్టారెంట్ల హెచ్చరిక

AIIMS Jobs: ఎయిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్.. 2,218 ఖాళీలు.. త్వరగా అప్లై చేసేయండి

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు! అదెలా సాధ్యం?

Big Stories

Advertisement
×