BigTV English

Hyundai Alcazar Facelift: క్లాసిక్ మార్పులతో హ్యుందాయ్ కొత్త ఫేస్‌లిఫ్ట్ రెడీ.. ఇంజన్, ధర వివరాలిలా..!

Hyundai Alcazar Facelift: క్లాసిక్ మార్పులతో హ్యుందాయ్ కొత్త ఫేస్‌లిఫ్ట్ రెడీ.. ఇంజన్, ధర వివరాలిలా..!

Hyundai Alcazar Facelift Launching Soon: దేశీయ ఆటో మొబైల్ రంగంలో హ్యుందాయ్ తన సత్తా చాటుతోంది. కొత్త కొత్త కార్లను లాంచ్ చేస్తూ సేల్స్‌లో దూసుకుపోతోంది. బడా బడా కంపెనీల జాబితాలో చేరిపోయిన హ్యుందాయ్ తన ఆదిపత్యాన్ని చెలాయించేందుకు మరో మోడల్‌ను మార్కెట్‌లో పరిచయం చేసేందుకు సిద్ధమైంది. హ్యుందాయ్ మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌లో తన లైనప్‌లో ఉన్న Hyundai Alcazar Faceliftను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.


ఈ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ సమయంలో చాలాసార్లు కనిపించింది. కాగా ఈ Alcazar Faceliftను ఈ ఏడాది సెప్టెంబర్ 2024 నాటికి ప్రారంభించాలని కంపెనీ చూస్తున్నట్లు తెలుస్తోంది. అప్‌డేట్ చేయబడిన ఈ మోడల్ ప్రస్తుత పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో ఉంటూ.. కొత్త ఎక్స్టీరియర్ భాగాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ లోపలి డిజైన్ విషయానికొస్తే.. అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ కొత్త డ్యాష్‌బోర్డ్, డ్యూయల్ స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇలాంటి డ్యూయల్ స్క్రీన్‌ను కొత్త క్రెటాలో చూడవచ్చు. అలాగే అప్హోల్స్టరీ, ఇంటీరియర్ థీమ్ ఆప్షన్లతో పాటు మొత్తం క్యాబిన్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

అలాగే హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ డిజైన్ విషయానికొస్తే.. అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ గ్రిల్, బంపర్‌లకు మార్పులు చేసినట్లు ఇటీవల లీక్ అయిన ఫొటోలు చూస్తే అర్థం అవుతుంది. అదనంగా ఇది స్పోర్టీ లుక్ కోసం రీడిజైన్ చేయబడిన బాడీ క్లాడింగ్, కొత్త అల్లాయ్ వీల్స్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. కాగా టెయిల్‌గేట్ పూర్తిగా కొత్తదిగా కనిపిస్తుంది. టెయిల్‌లైట్‌లు షార్పర్ రియర్ ప్రొఫైల్‌ను అందించడానికి రీడిజైన్ చేయబడ్డాయి.


Also Read: ప్రాణం ముఖ్యం బిగులు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో చౌకైన SUVలు..!

అలాగే హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అతిపెద్ద మార్పు ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్ అని చెబుతున్నారు. Tata Safari, Mahindra XUV700, MG హెక్టర్ వంటి కార్లలో ఇప్పటికే ADAS ఫీచర్లను అందిస్తున్నందున.. ఇప్పుడు ఈ ఫీచర్‌ను హ్యుందాయ్ కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో తీసుకొచ్చారు. అల్కాజార్‌లో ఇన్‌స్టాల్ చేయబడే ADAS కొత్త క్రెటాలోని టెక్నాలజీని పోలి ఉంటుంది.

హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్‌లో పవర్‌ట్రెయిన్ ఎంపికల విషయానికొస్తే.. ప్రస్తుతం ఉన్న ఇంజన్ ఆప్షన్‌లు హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కొనసాగుతాయి. ఇందులో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ 160 PS పవర్, 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తుంది. అదే సమయంలో మరొక 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది.

ఇది 116 PS పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. అంతేకాకుండా Hyundai Alcazar వివిధ రకాల డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది. హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ధర విషయానికొస్తే.. ఈ అప్‌డేట్‌లతో హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ధర ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ. 16,77,500 కాగా టాప్-స్పెక్ వేరియంట్ రూ. 21,28,400 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది.

Related News

AI Jobloss UBI: ఊడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. ఆర్థిక పరిష్కారం సూచిస్తున్న టెక్ కంపెనీ యజమానులు

DMart Exit Check: డిమార్ట్ ఎగ్జిట్ చెక్.. బిల్ మీద స్టాంప్ ఎందుకు వేస్తారో తెలుసా?

DMart: డిస్కౌంట్స్ అని డిమార్ట్ కు వెళ్తున్నారా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

Dmart Offers: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!

GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

Big Stories

×