E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : కళ్యాణ్ తో తనూజా అంతమాట అనేసిందేంటి ? ఎక్కడో తేడా కొడుతోంది మావా

Bigg Boss 9 Telugu : కళ్యాణ్ తో తనూజా అంతమాట అనేసిందేంటి ? ఎక్కడో తేడా కొడుతోంది మావా
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్స్ అన్నవి సర్వసాధారణం. అయితే ఈసారి రెండు లవ్ ట్రాక్స్ నడుస్తుండగా, అందులో కళ్యాణ్ పడాల – తనుజా ట్రాక్ ఒకటి. నిజానికి వీళ్ళిద్దరూ ప్రేక్షకులకు తమ బంధం గురించి అర్థం అయ్యి, కానట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడూ వీళ్ళ నుంచి వచ్చే ఆణిముత్యాలు మాత్రం ఆడియన్స్ కు ఒక క్లారిటీని ఇస్తాయి. తాజాగా తనుజా – కళ్యాణ్ బాండ్ గురించి అందరూ ఆశ్చర్యపోయే స్టేట్మెంట్ ఒకటి పాస్ చేసింది బిగ్ బాస్ ముద్దుబిడ్డ.

కెప్టెన్సీ టాస్క్ లో ఊహించని స్టేట్మెంట్ 

కెప్టెన్సీ డ్యాగర్ టాస్క్ లో చివరికి రీతూ, కళ్యాణ్, డెమోన్ మిగిలారు. నిజానికి సంజన చేతిలో ఉన్న డ్యాగర్ రీతూ చేతికి వచ్చినా కళ్యాణ్ నే పొడుస్తుంది. అలాగే పవన్ చేతికి వెళ్ళినా కళ్యాణ్ డేంజర్లో పడతాడు. అయితే దివ్య, సంజన మాత్రం రీతూ వెళ్లిపోవాలి అన్న ఉద్దేశంతో ఆ డ్యాగర్ ను కళ్యాణ్ కు ఇవ్వడానికి ఇంట్రస్ట్ చూపించారు. చివరగా కళ్యాణ్ డ్యాగర్ నీ చేతికి వస్తే నువ్వేం చేస్తావ్ అని పవన్ ను అడిగాడు. ‘అతను చెప్పలేను. కానీ నాకు నీతో కెప్టెన్సీ ఆడాలని ఉంది’ అని చెప్పాడు. ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్ కు వచ్చి రీతూని పక్కకు తప్పించారు. ఈ గ్యాప్ లో తనుజా దగ్గరకు వెళ్లి సలహా అడిగాడు కళ్యాణ్. ఆమె వెంటనే ‘నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నిన్ను నేను కెప్టెన్ గా చూడాలి. నువ్వు కెప్టెన్ కాకపోతే మీ అమ్మ ఎంత బాధ పడుతుందో తెలీదు కానీ, నేనైతే అంతకంటే ఎక్కువే బాధ పడతా” అని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక కెప్టెన్సీ విన్ అయ్యాక కళ్యాణ్ కూడా తనూజ, ఇమ్మూ చేతులు పట్టుకుని ముద్దు పెడుతూ, ఆనందబాష్పాలు రాల్చాడు.

ఇదే మొదటిసారి కాదు 

Advertisement

అయితే వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ గా మూవ్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఫ్యామిలీ వీక్ లో ఫ్యామిలీకి స్పేస్ ఇవ్వండి అని అందరినీ పంపేసిన కళ్యాణ్ తనూజను మాత్రం పక్కనే ఉంచాడు. అలాగే తనూజ కూడా కళ్యాణ్ తల్లితో స్పెషల్ గా ముచ్చటించడమే కాకుండా, ఆమె వెళ్లేటప్పుడు చీర పెట్టి పంపించింది. ‘ఎందుకు మా అమ్మే.. ఇంతమంది అమ్మలకు లేనిది?” అని కళ్యాణ్ అడిగితే.. “ఈ హౌస్ లో నువ్వే నన్ను బాగా చూసుకున్నావ్. బయటకు వెళ్ళాక నీ దారి నీది నా దారి నాది. ఇక ఎలాగూ అంతలోపే మీ అమ్మే హౌస్ లోకి వచ్చింది కదా. అందుకే. ఇందులో పర్సనల్ ఏమీ లేదు” అని కవర్ చేసింది. మరి వీళ్ళ బంధం బిగ్ బాస్ హౌస్ వరకే పరిమితం అవుతుందా? లేదంటే హౌస్ బయట కూడా కొనసాగుతుందా? అనేది చూడాలి.

Read also : టాస్క్ ఆడుతూ కుప్పకూలిన డెమోన్… ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే ?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×