Bank Customers: మీకు క్రెడిట్ కార్డు ఆఫర్ ఉంది.. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సదుపాయాలు మా బ్యాంకు మాత్రమే అందిస్తుందని ఫోన్ చేసి ఒకటే రీసౌండ్. నిత్యం బస్సుస్టేషన్లు, రైల్వేస్టేషన్లల్లో బ్యాంకు ఏజెంట్లు క్రెడిట్ కార్డులంటూ సామాన్యులను వెంటాడుతారు. కొత్త కస్టమర్లు ఏమోగానీ, ఉన్నవారిపై బాదుడు మొదలు పెడుతున్నాయి బ్యాంకులు.
తాజాగా ఏటీఎం ఛార్జీల పేరిట తొలుత బాదుడు మొదలుపెట్టింది యాక్సెస్ బ్యాంక్. బ్యాంకుల్లో సేవింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీనివల్ల బ్యాంకు రావాల్సిన ఆదాయం తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు దాని రేషియా బాగానే ఉండేది. ఇప్పుడు క్రమంగా పడిపోతోంది.
ఇక కొత్త ఖాతాదారుల గురించి అడగాల్సిన అవసరం లేదు. ఇంటింటికి సిబ్బందిని పంపి అకౌంట్ తీసుకోవాలని చెబుతున్నాయి కొన్ని బ్యాంకులు. కొన్ని బ్యాంకులకు కాస్తో కూస్తో ఉన్న వినియోగదారులు డ్రాపవుతున్న సందర్భాలు లేకపోలేదు. బ్యాంకులు ఆదాయాన్ని పెంచుకోవడానికి వినూత్నం మార్గాలను అవలంభిస్తున్నారు. కస్టమర్లపై రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నాయి.
తాజాగా జూలై ఒకటి యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు కష్టాలు మొదలుకానున్నాయి. సేవింగ్స్ ఖాతాదారులకు ATM ఛార్జీలను పెంచనుంది. వినియోగదారులు ఒకప్పుడు 21 రూపాయలకు బదులుగా 23 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. యాక్సిస్ పొదుపు ఖాతాలు, NRI ఖాతాలు, ట్రస్ట్ ఖాతాలతో పాటు కొందరు కస్టమర్లపై ప్రభావితం చూపనుంది.
ALSO READ: మీరు తెలివైన వారేనా? ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌లో ఈ తప్పులు చేయవద్దు
మెట్రోపాలిటిన్ సిటీల్లో ఏటీఎం కార్డును ఉపయోగిస్తే మూడు సార్లు, మెట్రోయేతర నగరాల్లో కార్డు ఐదుసార్లు ట్రాన్స్‌యాక్షన్ చేయవచ్చు. అంతకుమించి లావాదేవీలు చేసే కస్టమర్లకు వడ్డన మొదలైంది. ప్రతి లావాదేవీకి 23 రూపాయల చొప్పున వసూలు చేస్తామని యాక్సిస్ బ్యాంక్ చెబుతోంది. ఇప్పటివరకు ఈ ఛార్జీ 21 రూపాయలుగా ఉండేది.
అదనంగా రెండు రూపాయలు ఇకపై చెల్లించాల్సి ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులు లేదా నాన్-యాక్సిస్ బ్యాంక్ ATMలలో నగదు ఉపసంహరణల లావాదేవీలకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చి 28న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ATM ఇంటర్ చేంజ్ ఛార్జీని ఇప్పుడు ATM నెట్‌వర్క్ నిర్ణయిస్తుందని తెలిపింది.
మే ఒకటి నుంచి ఏ బ్యాంకు కస్టమర్ ఉచిత లావాదేవీ పరిమితి దాటితే వారిపై గరిష్టంగా 23 రూపాయల ఛార్జ్ విధించవచ్చు. ATM ఇంటర్ చేంజ్ ఛార్జ్ అంటే ఏమిటన్నదే అసలు ప్రశ్న. యాక్సిక్ కస్టమర్.. మరొక బ్యాంక్ ATM నుండి డబ్బును విత్‌డ్రా చేస్తే ఆయా బ్యాంక్‌కు చెల్లించే దాన్ని ఇంటర్ చేంజ్ రుసుము అని అంటారు. ఈ మొత్తాన్ని కస్టమర్ నుండి వసూలు చేస్తారు.