BigTV English

Saving Sleep: ధనం లాగే నిద్రను కూడా బ్యాంకులో దాచుకోవచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Saving Sleep: ధనం లాగే నిద్రను కూడా బ్యాంకులో దాచుకోవచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Saving Sleep| పనిలో నిమగ్నమై, పరీక్షల కోసం లేదా ప్రయాణాలు చేసే సమయంలో తక్కువ నిద్రపోవడం లాంటివి చాలా మంది చేస్తుంటారు. దీని వల్ల శరీరంలోని సర్కెడియం రిథమ్ అనే నిద్ర చక్రం గతి తప్పుతుంది. అయితే ఈ సమస్యకు కొంతవరకు ఒక పరిష్కారం ఉంది. అదే నిద్రను సేవ్ చేసుకోవడం అంటే ముందస్తుగా దాచుకోవడం. ఒకవేళ మనం కోల్పోయిన నిద్రను బ్యాంకులో డబ్బులా దాచుకోగలిగితే ఎంత బాగుండు! అలా చేయడం నిజంగా సాధ్యమేనా? అవును, అది సాధ్యమే! దీన్ని “నిద్ర బ్యాంకింగ్” అంటారు. ఇది సైన్స్‌లో ఊహాగానం కాదు, నిజంగా శాస్త్రీయంగా నిరూపితమైన విషయం.


నిద్ర బ్యాంకింగ్ అంటే ఏమిటి?
నిద్ర బ్యాంకింగ్ అంటే మీరు ముందుగానే ఎక్కువ నిద్రపోవడం ద్వారా రాబోయే నిద్రలేమి సమయానికి సిద్ధం కావడం. ఉదాహరణకు, ఒక రోజు మీ ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తే, అది రోజంతా ఉపయోగపడుతుంది కదా? అలాగే, నిద్రను కూడా ముందుగా ఎక్కువగా పొందడం ద్వారా రాబోయే రాత్రి నిద్రలేమి సమయంలో మీ శరీరం బాగా పనిచేసేలా చేయవచ్చు.

ఢిల్లీలోని సీకే బిర్లా హాస్పిటల్‌లో పల్మనాలజిస్ట్ అయిన డాక్టర్ వికాస్ మిత్తల్ నిద్ర బ్యాంకింగ్ గురించి ఇలా వివరించారు. “నిద్ర బ్యాంకింగ్ అంటే నిద్రలేమి రోజులు రాబోతున్నాయని మీకు ముందుగానే తెలిసినప్పుడు, ముందుగా కొన్ని రోజులు ఎక్కువ నిద్రపోవడం.” అని చెప్పారు. అలాగే ముంబైలోని హిందూజా హాస్పిటల్‌లో పల్మనాలజిస్ట్ అయిన డాక్టర్ లాన్స్‌లాట్ మార్క్ పింటో.. దీన్ని డబ్బు ఆదా చేయడంతో పోలుస్తూ… “మీరు భవిష్యత్తులో నిద్ర తక్కువగా ఉంటుందని భావించినప్పుడు ముందుగా ఎక్కువ నిద్రను ఆదా చేయడమే నిద్ర బ్యాంకింగ్” అని నిర్వచించారు.


ఇది నిజంగా పనిచేస్తుందా?
అవును, ఇది పనిచేస్తుంది! 2009లో రప్ అనే పరిశోధకులు చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒక వారం పాటు రోజూ 10 గంటలు నిద్రపోయిన వారు, తర్వాత 3 గంటలు మాత్రమే నిద్రపోయినప్పుడు, సాధారణంగా 7 గంటలు నిద్రపోయిన వారి కంటే ఎక్కువ హుషారుగా, మెరుగైన పనితీరుతో ఉన్నారు. ఈ పరిశోధన గురించి డాక్టర్ మిత్తల్ మాట్లాడుతూ.. “ఎక్కువ నిద్ర ముందుగా తీసుకున్నవారు మానసికంగా చురుకుగా ఉంటారు.”

దీనికి డాక్టర్ పింటో కూడా రెండు మార్గాలను సూచిస్తూ.. “రాత్రి నిద్రను రెండు గంటలు ఎక్కువ చేయడం లేదా పగటిపూట చిన్న నిద్ర విరామాలు (న్యాప్‌లు) తీసుకోవడం. గదిని చీకటిగా, చల్లగా ఉంచడం, స్క్రీన్ టైమ్‌ను తగ్గించడం వంటివి చేస్తే.. నిద్ర సరిగ్గా రావడానికి సహాయపడతాయి.”

Also Read: ముఖానికి ఐస్ ప్యాక్‌తో మొటిమలకు చెక్.. కానీ ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

జాగ్రత్త!.. దీర్ఘకాలం చేస్తే సమస్యలు
నిద్ర బ్యాంకింగ్ తాత్కాలిక సమస్యలకు బాగా పనిచేస్తుంది. కానీ, దీనిపై ఎక్కువగా ఆధారపడితే సమస్యలు వస్తాయి. డాక్టర్ పింటో హెచ్చరిస్తూ.. “ఎక్కువ నిద్ర బ్యాంకింగ్ మీ శరీర గడియారాన్ని (సర్కెడియన్ రిథమ్) గందరగోళానికి గురి చేస్తుంది. ఇది కొత్త షెడ్యూల్‌కు సర్దుబాటు చేయడాన్ని కష్టతరం చేస్తుంది,” అని చెప్పారు.

డాక్టర్ మిత్తల్ మాట్లాడుతూ.. “ఎప్పుడూ నిద్ర తక్కువ చేసి, తర్వాత దాన్ని భర్తీ చేస్తానని ఆలోచిస్తే, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.”

ఎలా చేయాలి?
మీకు రాబోయే వారం బిజీగా ఉంటుందని లేదా రాత్రి పని చేయాల్సి ఉంటుందని తెలిస్తే, ఈ చిట్కాలు పాటించండి:

ముందుగా ప్రారంభించండి: 3 నుంచి 7 రోజుల ముందుగా రోజూ 1 లేదా 2 గంటలు ఎక్కువ నిద్రపోండి.

చిన్న నిద్ర విరామాలు: 20–30 నిమిషాల చిన్న న్యాప్‌లు తీసుకోండి.

నిద్ర సౌకర్యం: గదిని చీకటిగా, చల్లగా ఉంచండి. కెఫీన్, ఫోన్ టివి చూడడం నివారించండి.

నిద్ర బ్యాంక్ ప్రక్రియను అతిగా వాడకండి: దీన్ని ఎప్పుడైనా అవసరమైతేనే మాత్రమే ఉపయోగించండి, శాశ్వత పరిష్కారంగా కాదు.

“నిద్ర బ్యాంకింగ్‌ ను ఒక రక్షణ కవచంలా ఉపయోగించండి, ఎప్పుడూ దానిపై ఆధారపడకండి. నిద్రలేమి రోజులకు సిద్ధం కావడానికి ఇది ఉపయోగపడుతుంది, కానీ ఎప్పుడూ దీని ప్రకారమే నిద్ర షెడ్యూల్‌‌ చేయకూడదు.” అని డాక్టర్ పింటో అభిప్రాయపడ్డారు.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×