E-Paper
Advertisement

మహీంద్రా BE 07 ఇంటీరియర్ లీక్.. వారెవ్వా.. ఏముంది గురూ!

మహీంద్రా BE 07 ఇంటీరియర్ లీక్.. వారెవ్వా.. ఏముంది గురూ!
Advertisement

Mahindra BE 07 Interior: మహీంద్రా నుంచి త్వరలో రానున్న కొత్త ఎలక్ట్రిక్ SUV BE 07పై కార్ లవర్స్ తో ఆసక్తి రోజు రోజుకి పెరుగుతోంది. ఈ కారు టెస్ట్ మ్యూల్‌ కు సంబంధించిన లేటెస్ట్ స్పై షాట్స్ బయటకు రావడంతో, తొలిసారిగా దీని ఇంటీరియర్‌ కు సంబంధించిన పలు వివరాలు వెల్లడయ్యాయి. మహీంద్రా BE 07ను 2027లో భారత మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇది కంపెనీ BE ఎలక్ట్రిక్ బ్రాండ్‌ లో BE 6 తర్వాత వచ్చే రెండో మెయిన్ మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది. తాజాగా కనిపించిన టెస్ట్ కారును పరిశీలిస్తే, లోపల అధునాతన టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

మూడు స్క్రీన్లతో డ్యాష్‌ బోర్డ్

BE 07 ఇంటీరియర్‌ లో ఆకట్టుకున్న అంశం మూడు స్క్రీన్ల సెటప్. డ్యాష్‌బోర్డ్ మొత్తం వెడల్పులో మూడు పెద్ద డిస్‌ప్లేలు ఏర్పాటు చేసినట్లు స్పై షాట్స్ లో కనిపిస్తోంది. మహీంద్రా ఇప్పటికే XEV 9e, XEV 9S వంటి మోడళ్లలో ఇలాంటి స్క్రీన్ లేఅవుట్‌ను ఉపయోగిస్తోంది. దీంతో BE 07లో కూడా ఇదే డిజైన్‌ను కొనసాగించే అవకాశం ఉంది.  విండ్‌ స్క్రీన్ సమీపంలో చిన్న డ్యాష్‌ క్యామ్ డిస్‌ ప్లే కూడా కనిపించింది. అయితే, ఇది ప్రొడక్షన్ కారులో కూడా ఉంటుందా? లేదంటే టెస్ట్ మ్యూల్‌కు మాత్రమే సంబంధించినదా? అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. మహీంద్రా BE 6, XEV 9e, XEV 9S మోడళ్లలో 360 డిగ్రీ కెమెరా ఆధారిత డ్యాష్‌క్యామ్ ఫీచర్‌ను అందిస్తోంది. ప్రమాదం,  ఇతర అత్యవసర పరిస్థితుల్లో వీడియో క్లిప్‌లను రికార్డ్ చేసి సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇంటీరియర్‌లో మరిన్ని ఫీచర్లు

Advertisement

BE 07 క్యాబిన్‌లో మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్ మోడళ్లకు ప్రత్యేకంగా ఉపయోగిస్తున్న బటర్‌ ఫ్లై లోగోతో కూడిన టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉండే అవకాశం ఉంది. యాంబియంట్ లైటింగ్, ఐదు సీట్ల సౌకర్యం లాంటి ఫీచర్లు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతం కనిపించిన టెస్ట్ మ్యూల్ ఆధారంగా వచ్చిన అంచనాలు మాత్రమే. ప్రొడక్షన్ వెర్షన్‌ లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ, రేంజ్ ఎంత ఉండొచ్చు?

BE 07ను మహీంద్రా INGLO ప్లాట్‌ ఫామ్‌పై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో BE 6లో ఉపయోగిస్తున్న 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్‌లను అందించే అవకాశం ఉంది. BE 07 పరిమాణంలో BE 6 కంటే పెద్దదిగా ఉండనుంది. అందువల్ల BE 6తో పోలిస్తే దీని రేంజ్ కొంత తక్కువగా ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం BE 6కు 548 నుంచి 683 కిలోమీటర్ల వరకు MIDC-పరీక్షిత రేంజ్ ఉందని కంపెనీ వెల్లడించింది. అయితే BE 07కు సంబంధించిన బ్యాటరీ, రేంజ్ వివరాలను మహీంద్రా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఏ మోడల్స్ తో పోటీ పడుతుంది?

Advertisement

మార్కెట్లోకి వచ్చిన తర్వాత మహీంద్రా BE 07కు టాటా హారియర్ EV, విన్‌ఫాస్ట్ VF7, BYD అట్టో 3 వంటి ఎలక్ట్రిక్ SUVలతో పోటీ పడే అవకాశం ఉంది.

Read Also: 2027 నాటికి 10 లక్షల కనెక్టెడ్ కార్లు.. హ్యుందాయ్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Tags

Related News

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!

చిన్న కార్ల కోసం సుజుకి మాస్టర్ ప్లాన్.. ‘రీవ్ లైట్’ హైబ్రిడ్ వచ్చేస్తోంది!

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎంట్రీ డేట్ ఫిక్స్.. ధర అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

మహీంద్రా విజన్ ఎస్ వచ్చేస్తోంది.. కనెక్టెడ్ టెయిల్‌లైట్లతో అదిరిపోయే లుక్!

టాటా ఏరిస్ విడుదల.. రూ.5.29 లక్షలకే కొత్త సెడాన్!

Big Stories

Advertisement
×