Best 5G Phones Under 70K: గూగుల్ పిక్సెల్ 10, శాంసంగ్ ఎస్25, ఐక్యూ 15ఆర్.. ఈ పేర్లు వినగానే అమ్మో అంత ధర ఉంటే కొనలేం బాబోయ్.. అని ఆగిపోయిన వినియోగదారులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026లో ఈ ప్రీమియం 5జీ ఫోన్లన్నీ క్రేజీ డిస్కౌంట్లతో దర్శనమిస్తున్నాయి. మీరు కూడా రూ.70,000 లోపు పవర్‌ఫుల్ ప్రాసెసర్, నెక్స్ట్ లెవెల్ కెమెరా ఉన్న ఫోన్ కోసం వెతుకుతుంటే, వేల రూపాయలు ఆదా చేసే బెస్ట్ ఆఫర్ల జాబితా ఇదిగో.. ఓ లుక్కేసేయండి .
ఈ సేల్‌లో కేవలం ధరల తగ్గింపే కాకుండా.. పలు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఈఎమ్‌ఐ ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి తోడు అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ వాడుతున్న వారికి ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా వేల రూపాయల వరకు అదనపు తగ్గింపు పొందే వీలుంది.
Also Read: రూ.8,500 లోపు అదిరిపోయే లావా కొత్త ఫోన్.. ఫ్రీ డోర్‌స్టెప్ సర్వీస్, మిలిటరీ బిల్డ్ బాడీ!
ఫొటోగ్రఫీ, గేమింగ్ ప్రియులకు ఈ సేల్‌లో మంచి ఆఫర్లు ఉన్నాయి. రూ.79,999 ఉన్న Google Pixel 10 5G ప్రస్తుతం రూ.66,800కే లభిస్తోంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే గరిష్టంగా రూ.38,050 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే గేమింగ్ ప్రియులను ఆకట్టుకునే vo V70 5G ఫోన్ రూ.65,999కి బదులుగా రూ.59,999 సేల్ ధరకు లభిస్తోంది. దీనిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా దాదాపు రూ.48,050 వరకు ఆదా చేసుకోవచ్చు.
ఈ ఫ్రీడమ్ సేల్‌లో రూ.70,000 బడ్జెట్‌లో ఆకట్టుకునే ఫోన్లు చాలా ఉన్నాయి. iQOO 15R రూ.49,999కి లభిస్తుండగా, OnePlus 15Rను రూ.56,999కి సొంతం చేసుకోవచ్చు. అలాగే శాంసంగ్ అభిమానులకు శుభవార్త ఏంటంటే.. Samsung Galaxy S25 5Gని రూ.59,999కి విక్రయిస్తున్నారు. Motorola Edge 70 Max 5G రూ.58,996కి, ppo Reno 16 5G రూ.60,999కి అందుబాటులో ఉన్నాయి. మరోవైపు Pixel 10 రూ.66,800కి, Xiaomi 17T రూ.64,999 ఆఫర్ ధరకు లభిస్తున్నాయి.
Also Read: రూ.1.66 లక్షల HP గేమింగ్ ల్యాప్‌టాప్‌ను.. అమెజాన్ సేల్‌లో రూ.99 వేలకే ఇచ్చేస్తున్నారు!