E-Paper
Advertisement

పండగ సీజన్‌ వేళ కేంద్రం శుభవార్త.. వంట నూనె ధరలకు ఊరట!

పండగ సీజన్‌ వేళ కేంద్రం శుభవార్త.. వంట నూనె ధరలకు ఊరట!
Advertisement

Edible Oils : దేశంలో పండుగల సీజన్‌ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ధరలను అదుపులో ఉంచేందుకు దిగుమతి సుంకాలను తగ్గించింది. కొత్త సుంకాల రేట్లు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో మార్కెట్లో ధరలు దిగి వచ్చే అవకాశముందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.

పండగ సీజన్‌ వేళ కేంద్రం శుభవార్త

ద్రవ్యోల్భణం నేపథ్యంలో కొంతకాలంగా వంట నూనెల ధరలు పెరుగుతూ వచ్చాయి. ఏడాది కాలంలో కూరగాయలు, నూనె ధరలు దాదాపు 20 శాతం వరకు పెరిగాయి. పండుగ సీజన్ నేపథ్యంలో ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. ఇందులో భాగంగా పామాయిల్, సోయా నూనె, పొద్దు తిరుగుడు నూనెతోపాటు శుద్ధి చేసిన వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఈ విషయాన్ని బుధవారం రాత్రి ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది ప్రభుత్వం.

వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు, దిగిరానున్న ధరలు

Advertisement

సెప్టెంబర్- నవంబర్ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ, దసరా, దీపావళి వంటి పండగల సమయంలో స్వీట్స్, స్నాక్స్, వేపుడు పదార్థాలకు డిమాండ్ పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగా నూనె వినియోగం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో ధరల ప్రభావం సామాన్యుడిపై పడకుండా ఉండేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ముడి పామాయిల్, ముడి సోయా నూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. శుద్ధి చేసిన పామాయిల్, సోయా నూనెలపై సుంకాన్ని 32.5 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గించినట్లు నోటిఫికేషన్‌లో ప్రస్తావించింది. ముడి పొద్దుతిరుగుడు నూనెపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి సున్నాకు తగ్గించగా, శుద్ధి చేసిన నూనెపై సుంకాన్ని 32.5 శాతం నుంచి 22.5 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది.

Advertisement

దిగుమతి సుంకం కాకుండా దేశంలోకి దిగుమతి అయ్యే వంట నూనెలపై వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్, సామాజిక సంక్షేమ సర్‌చార్జ్ కూడా విధిస్తాయి. ముడి పామాయిల్, ముడి సోయా నూనెపై 16.5 శాతం నుండి 11 శాతానికి తగ్గించింది. ముడి పొద్దు తిరుగుడు నూనెపై 16.5 శాతం నుండి 5.5 శాతం సుంకాన్ని విధించనుంది. దిగుమతి సుంకం తగ్గుతుందని ఊహించి రిఫైనరీలు కొనుగోళ్లను నిలిపివేశాయి. ఇప్పుడు పండుగ సీజన్ డిమాండ్‌ను తీర్చడానికి దిగుమతులను పెంచుతాయని ముంబైకి చెందిన నూనె బ్రోకరేజ్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.

ALSO READ: బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25వ తేదీనే జీతాలు.. కేంద్రం కీలక ఆదేశాలు!

భారతదేశంలో నూనె అవసరాలకు సంబంధించి దాదాపు మూడింట రెండు వంతులు దిగుమతుల ద్వారానే జరుగుతుంది. మలేషియా, ఇండోనేషియా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్ నుండి పామాయిల్, సోయా నూనె, పొద్దు తిరుగుడు నూనెలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. సుంకం తగ్గింపు వల్ల పొద్దుతిరుగుడు నూనె అత్యధికంగా లబ్ధి పొందుతుందని అంటున్నారు. రిఫైనర్లకు మరింత ఆకర్షణీయంగా మారి సోయా నూనె, పామాయిల్‌ల నుండి కొంత డిమాండ్‌ను మళ్లించే అవకాశం ఉందని పలువురు ఆయిల్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Related News

బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25వ తేదీనే జీతాలు.. కేంద్రం కీలక ఆదేశాలు!

పిపిఎఫ్ vs సుకన్య సమృద్ధి యోజన.. మీ కూతురి భవిష్యత్తు కోసం ఏ పథకం ఎక్కువ లాభదాయకం

చమురు ధరల పెరుగుదల.. ఆయిల్ కంపెనీలకు భారీగా నష్టాలు, పెట్రోల్‌పై రూ.8-డీజిల్‌ పై రూ.9

చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే.. కట్ చేస్తే నేడు వేల రూ.కోట్లకు అధిపతి

భారీగా దిగొస్తున్న బంగారం ధర.. మహిళల్లో ఒక్కటే ఆనందం, ఇవాళ మార్కెట్లో ధరలు

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్‌లో నెలకు రూ.4000 పెట్టుబడితో 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

సమ్మె ప్రభావం.. ఆదివారం బ్యాంకులు ఓపెన్, ఆర్థిక‌శాఖ ప్రకటన

Big Stories

Advertisement
×