E-Paper
Advertisement

సామాన్యులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకుల సమ్మె వాయిదా, డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందా?

సామాన్యులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకుల సమ్మె వాయిదా, డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందా?
Advertisement

Bank strike called off: సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరగాల్సిన బ్యాంకుల సమ్మె అనుకోకుండా వాయిదా పడింది. యూనియన్ల డిమాండ్లను కేంద్రం అంగీకరించిందా? సమ్మె కచ్చితంగా ఉంటుందని ఆదివారం సైతం బ్యాంకులు పని చేశాయి. అంతలోనే ఎందుకు వెనక్కి తగ్గాయి? ఇవే చాలామందిని వెంటాడుతున్నాయి. అసలు ఏం జరిగింది?

బ్యాంకుల సమ్మె వాయిదా, ఏం జరిగింది?

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుండి అనగా సోమవారం నుంచి మూడు రోజులపాటు జరగాల్సిన బ్యాంకుల సమ్మె అనుకోకుండా వాయిదా పడింది. ఈ నిర్ణయాన్ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్-యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమావేశం అనంతరం తీసుకున్నాయి. ఆదివారం రాత్రి రాత్రి 9.30 గంటలకు IBAతో జరిగిన సమావేశం అనంతరం ఓ సర్క్యులర్‌ జారీతో UFBU ఈ సమాచారాన్ని అందించింది.

ఆదివారం రాత్రి జరిగిన బ్యాంకు యూనియన్ల సమావేశం

Advertisement

ఈ సమావేశంలో బ్యాంకు సంస్కరణలు, స్కేల్-IV, అంతకంటే పై స్థాయి అధికారుల కోసం ఉద్దేశించిన PLI పథకంలో మార్పులు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. బ్యాంకు యూనియన్ల డిమాండ్లు, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఇరుపక్షాలు కొన్ని నిర్ణయాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. శనివారం సెలవు దినంగా ప్రకటించే అంశాన్ని పరిష్కరించడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్-IBA, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్-UFBU లతో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు

ఈ కమిటీ ఎవరికీ అసౌకర్యం కలిగించకుండా సాధ్యమయ్యే అన్నిమార్గాలను పరిశీలించి సంబంధిత వర్గాలతో చర్చించనుంది. బ్యాంక్ యూనియన్లు- వినియోగదారులు ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి ఈ కమిటీ కృషి చేయనుంది. ఈలోగా యూనియన్లు-సంఘాల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనల దృష్ట్యా, స్కేల్-IV అంతకంటే పై స్థాయి అధికారుల కోసం ఉద్దేశించిన PLI (పనితీరు ఆధారిత ప్రోత్సాహకం) పథకానికి సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో చర్చలు జరుగుతాయి. మార్పుల కోసం ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి పంపుతారు.

ALSO READ: ఫిక్స్‌డ్ డిపాజిట్లకు పెట్టుబడి ప్రత్యామ్నాలు వెతుకుతున్న భారతీయులు.. ఎందుకంటే?

Advertisement

మార్చి 8, 2024 నాటి సమావేశంలో మినిట్స్‌లో పేర్కొన్న మిగిలిన సమస్యలను పరిష్కరించడానికి ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతాయి.ఈ నిర్ణయాలు దృష్ట్యా సమ్మె కార్యక్రమాలను వాయిదా వేయడానికి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్-UFBU అంగీకరించింది. ఫలితంగా ప్రతిపాదిత మూడు రోజుల బ్యాంకుల సమ్మె వాయిదా పడినట్టు ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

 

Related News

అక్టోబర్ 1 నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్‌ రూల్స్‌లో మార్పులు.. రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు ఇవే

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు పెట్టుబడి ప్రత్యామ్నాలు వెతుకుతున్న భారతీయులు.. ఎందుకంటే?

30 ఏళ్లు వచ్చేలోపు..ఈ 7ట్రిక్స్ పాటిస్తే, మీ ఫ్యూచర్ సెట్టైనట్టే!

మీకు 4-5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? ఎక్కువ అకౌంట్లు ఉంటే జరిగే నష్టాలు ఇవే!

క్రెడిట్ కార్డ్ Vs వర్సెస్ బ్యాంక్ లోన్.. అత్యవసర సమయంలో ఏది బెటర్?

మీ బంగారంపై ఉన్న హాల్‌మార్క్ అసలైనదా? లేదా ?ఇలా గుర్తించండి!

ఒక్క ఏడాదిలోనే రూ.3.2 లక్షల నుంచి రూ.40 లక్షల ప్యాకేజీకి.. ప్రభుత్వ కాలేజీ విద్యార్థి కెరీర్ సూపర్ ఫాస్ట్

Big Stories

Advertisement
×