E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode September 28th ‘నిన్ను కోరి’ సీరియల్‌: బిడ్డను చూసిన విరాట్ కు గతం గుర్తుకు వస్తుందా..?  

Ninnu kori Serial Today Episode September 28th ‘నిన్ను కోరి’ సీరియల్‌: బిడ్డను చూసిన విరాట్ కు గతం గుర్తుకు వస్తుందా..?  
Advertisement

Ninnu kori serial today Episode: మీరు ఎవరి గురించైతే అయ్యో పాపం అని ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి వల్లే మీకు ప్రమాదం ఉంది. మీరు ఎవ్వరి గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి.. అప్పుడే నేను శ్రీజకు కనెక్ట్‌ అవుతాను అంటూ మదన్‌ చెప్తే.. చంద్ర ఆశ్చర్యంగా ఏంటి మదన్‌ గారు నేను వినేది నిజమేనా..? అంటూ ప్రశ్నిస్తే.. అవునండి ఎలాగూ శ్రీజకు హర్ట్‌ బ్రేక్‌ అవుతుంది. ఆలోపే నేను శ్రీజను డైవర్ట్‌ చేయాలి అది మీకు మంచిది.. నాకు మంచిది అని చెప్తాడు మదన్‌.. అయితే శ్రీజను బాధపెట్టకుండా చూసుకోవడం కోసం అయితే పర్వాలేదు కానీ మీరు ముందు లాంటి జుగడ్‌ మదన్‌ అయితేనే ఇబ్బంది అంటూ చంద్ర చెబితే చీ ఆ మనీ మదన్‌ గాడు చచ్చిపోయి పది రోజులు అయింది చంద్ర గారు.. అంటూ చెప్పగానే.. అలా అయితే పర్వాలేదు.. కంటిన్యూ చేయండి అంటూ చంద్ర చెప్పగానే.. ఇక చూడండి.. శ్రీజను ఎలా పడేస్తానో అంటాడు మదన్‌.

గార్డెన్‌లో ఏడుస్తూ ఉన్న శ్రీజ దగ్గరకు గిరిజ వెళ్లి ఏంటి శ్రీజ ఏడుస్తున్నావు అని అడిగితే.. బావ పెళ్లికి ఒప్పుకోవడం లేదమ్మా.. తనకు గతం గుర్తుకు వచ్చాకే పెళ్లి గురించి ఆలోచిద్దామని చెప్తున్నాడు అంటే అదేంటి వాళ్ల అమ్మ చెప్పినప్పుడు మౌనంగా ఉన్నాడు కదా ఇప్పుడు మళ్లీ ఇలా ఎలా మాట్లాడతాడు అంటూ గిరిజ అడిగితే.. బావది కూడా కరెక్టే కదమ్మా నాకు చిన్నప్పటి నుంచి జరిగిన జ్ఞాపకాలు గుర్తున్నాయి. కానీ బావకు అవేమీ గుర్తు లేవు కదమ్మా అంటూ శ్రీజ చెప్తుంటే.. ఇలా ఉంటే ఎలాగే అవతల చంద్ర సామ్రాట్‌ను తన్నుకుపోవాలని చూస్తుంది. చూశావు కదా అతనికి పొలమారగానే నీకన్నా ముందే ఎలా దూసుకెల్లి అతని ఒంటి మీద పడి నీళ్లు తుడిచిందో.. పరాయి మనిషే అలా ఉన్నప్పుడు వరసైన దానివి.. పెళ్లి చేసుకోబోయే దానివి నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు అంటూ చెప్తుంది గిరిజ. ఇప్పుడే బావ దగ్గరకు వెళ్లి ఇంప్రెస్‌ చేస్తానని శ్రీజ వెళ్తుంది.

Advertisement

సామ్రాట్‌ దగ్గరకు వెళ్తున్న శ్రీజకు ఎదురుగా వెళ్లిన మదన్‌ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. సామ్రాట్‌ దగ్గరకు వెళ్తున్నాను అంటూ శ్రీజ చెప్పగానే.. మదన్‌ షాక్‌ అవుతాడు. ఎలాగైనా శ్రీజను సామ్రాట్‌ నుంచి దూరం చేయాలని మదన్‌  తన మాటలతో శ్రీజను కన్ఫీజ్‌ చేస్తాడు. సామ్రాట్‌ మాత్రమే కాదు ఎవ్వరైనా మీ వెంట పడేలా చేస్తాను. అందుకే ఒక్కసారి సామ్రాట్‌ గారిని దూరం పెట్టండి తనే మీ వెంట పడతాడు అని చెప్పగానే.. శ్రీజ అనుమానంగా నిజంగా పడతాడా..? అని అడిగితే..

అవును ఇప్పుడే ప్రూవ్‌ చేస్తాను రండి అంటూ హాల్లోకి తీసుకెళ్లి దూరంగా నిలబెట్టి నేను ఇప్పుడే వెళ్లి ప్రూవ్‌ చేస్తాను మీరు ఇక్కడి నుంచి చూస్తూ ఉండండి అంటూ మదన్‌, సామ్రాట్‌ దగ్గరకు వెళ్లి ఒక ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పాలి అంటూ అమ్మాయిలు అబ్బాయిల వెంట పడితే నచ్చుతారా..? అని అడగ్గానే.. ఎనాలసిస్‌ ప్రకారం అయితే అబ్బాయిలే అమ్మాయిల వెంట పడాలి అప్పుడే అందంగా ఉంటుంది అని చెప్పగానే.. మదన్‌ ఓకే సామ్రాట్‌ గారు అంటూ శ్రీజ దగ్గరకు వెళ్లి ఇప్పుడైనా అర్థం అయిందా అని చెప్పగానే.. అవును అర్థ అయింది.. ఇప్పటి నుంచి అలాగే ఉంటాను. అంటూ శ్రీజ వెళ్లిపోతుంది. మదన్‌ హ్యాపీగా ఫీలవుతాడు.

Advertisement

గిరిజ నీలగిరి కలిసి దాక్షాయణి దగ్గరకు వెళ్లి శ్రీజ, సామ్రాట్‌ ల పెళ్లి గురించి మరోసారి మాట్లాడమని చెప్తారు. దాక్షాయణి నెల రోజుల టైం ఇచ్చాడు కదా మళ్లీ మాట్లాడటం దేనికి అంటూ చెప్పగానే.. నెల రోజులు టైం అడిగారు కానీ తర్వాత పెళ్లి చేసుకోనని మాట మారుస్తే శ్రీజ పరిస్థితి ఏమవుతుంది అంటూ చెప్తుండగానే.. ఊరోళ్లు ఇద్దరు భార్యాభర్తలు వచ్చి సామ్రాట్‌ వల్లే తామ సంతోషంగా ఉన్నామని. తమ బిడ్డ ఇవాళ ఇలా ఉందంటే మీరే కారణం ఈ బిడ్డకు మీరే పేరు పెట్టాలి అంటూ ఆ బిడ్డను సామ్రాట్‌ చేతిలో పెడితే సామ్రాట్‌ తల పట్టుకుని బిడ్డ నేను ఎవరికో మాటిచ్చాను బిడ్డను అప్పగిస్తానని తల పట్టుకుని కూలబడిపోతాడు. చంద్ర వచ్చి ఆ బిడ్డ క్షేమంగా ఉంది మీరు కూల్‌ గా ఉండండి అంటూ చెప్తూ.. సామ్రాట్‌ను రూంలోకి తీసుకెళ్లమని మదన్‌కు చెప్తుంది చంద్ర. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : గోపికకు దిమ్మతిరిగే షాక్.. నారాయణకు మహా సేవలు.. పెద్దోడు ఫుల్ ఖుషి..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో శ్రీవల్లి.. ధీరజ్ కు టెన్షన్.. చింతామణికి షాక్..

Intinti Ramayanam Today Episode: భానుమతికి అనుమానం.. పల్లవి ఫుల్ హ్యాపీ.. శ్రీకర్ కు దిమ్మతిరిగే షాక్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 అవుట్..

Monday Tv Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఫైమా, యాదమరాజు మధ్య బాంగిల్స్ గోల.. నవ్వులే నవ్వులు!

సోనియానే నా హీరో అన్న యష్.. ఎందుకో తెలుసా?

Big Stories

Advertisement
×