E-Paper
Advertisement

ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకున్న రణబాలి..రన్ టైం ఎంతంటే?

ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకున్న రణబాలి..రన్ టైం ఎంతంటే?
Advertisement

Ranabaali Movie: విజయ్ దేవరకొండ రష్మిక ప్రధాన పాత్రలలో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రణబాలి. ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక (Rashmika)ఎంతో బిజీగా గడుపుతున్నారు మరోవైపు ఈ సినిమా విడుదలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది.

కుటుంబ సమేతంగా చూసేలా రణబాలి..

ఈ సినిమా చూసిన అనంతరం సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాకు ఏ విధమైనటువంటి కట్స్ లేకుండా జీరో కట్స్ తో U/A సెన్సార్ సర్టిఫికెట్ (Censor Certificate) జారీ చేశారు చిన్న పిల్లలతో కలిసి కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా ఈ సినిమా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాకు 2:50 నిమిషాల రన్ టైం (Runtime)లాక్ చేశారు. ఇలా ఈ సినిమా రన్ టైమ్ కూడా చాలా మంచిగానే ఉందని చెప్పాలి. ఇక రణబాలి సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అక్టోబర్ 16వ తేదీ విడుదల చేయనున్నారు. సాధారణంగా ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాకు ప్రీమియర్లు ప్రసారం చేస్తున్నారు.

ఇరుముడి సెంటిమెంటుతో రణబాలి..

Advertisement

రణబాలి సినిమాకు మాత్రం ఎలాంటి ప్రీమియర్లు లేవని తెలుస్తోంది. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇరుముడి సినిమాకు కూడా ప్రీమియర్లు లేవు. ఇదే సెంటిమెంటుతోనే రణబాలి సినిమాకి కూడా ప్రీమియర్లు లేకుండా నేరుగా ఈ సినిమాని 16వ తేదీ విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ విధమైనటువంటి టికెట్ల రేట్లు పెరుగుదల కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి.

రాయలసీమ ప్రాంతంలో కరువు..

రణబాలి సినిమా సుమారు 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పరిపాలనలో రాయలసీమ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, రాయలసీమలో సంభవించిన కరువు కాటకాల నేపథ్యంలో ఈ సినిమా రాబోతోందని తెలుస్తుంది. చరిత్ర కూడా చెప్పని కొన్ని విషయాలను ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి అనే పాత్రలో కనిపించబోతున్నారు. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Also Read: తమిళనాడు సీఎం విజయ్ ను కలిసిన విజయ్ దేవరకొండ రష్మిక దంపతులు!

Related News

తెలుగు సినిమాల్లో దుమ్మురేపిన తెలంగాణ జానపద పాటలు ఇవే!

నాకు ఎలాంటి రోగం లేదు..తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దన్న కమెడియన్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. జటాయువు పాత్రలో స్టార్ సెలబ్రిటీ!

గీతా గోవిందం, రంగస్థలం వదులుకున్న అనుపమ..కారణం?

300 ఎకరాల్లో ఫిలిం స్టూడియో నిర్మిస్తున్న బడా ప్రొడ్యూసర్స్.. ఎక్కడంటే?

ప్రేమించిన వాడి చేతిలోనే నరకం.. మొన్న అనుపమ.. నేడు?

మూవీలో ఛాన్స్ ఇస్తా.. ఒక నైట్ పడుకోమన్నాడు.. నీతి టేలర్ సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×