Big Stories

Bike Vs Scooter Mileage: బైక్‌ లేదా స్కూటర్‌.. ఏది తక్కువ మైలేజ్‌ ఇస్తుంది?

Bike Vs Scooter Mileage
Bike Vs Scooter Mileage

Bike Vs Scooter which One Gives High Mileage: బైక్ లేదా స్కూటర్ వాడకం అనేది ఈ రోజుల్లో కామన్. మనం అందరం బైక్ కొనుగోలు చేసెటప్పుడు ప్రధానంగా చూసేది మైలేజ్. అయితే బైక్ కంటే స్కూటర్ తక్కువ మైలేజ్ ఇస్తుందట. ఒకే రకమైన ఇంజిన్ ఉన్నా కూడా ఈ రెండిటి మైలేజ్ విషయంలో తేడా ఉంటుందట. ఇక బైకుల, స్కూటర్ల మధ్య అనేకమైన ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవేంటో చూడండి.

- Advertisement -

సాధారణంగా బైక్‌తో పోలిస్తే స్కూటర్‌ ఎక్కువ మైలేజ్ ఇస్తుందని మనలో చాలా మంది భావిస్తుంటారు. కానీ ఆ భావన అనేది తప్పు. ఒకే సీసీ ఇంజిన్ ఉన్న మైలేజ్ స్కూటీ కంటే బైకే ఎక్కువ ఇస్తుంది. దీనికి వెనకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో చూడండి.

- Advertisement -

ఒక వెహికల్ లీటర్‌ ఆయిల్‌కు ఎంత దూరం ప్రయాణిస్తుందో చెప్పేదే మైలేజ్. మన ప్రయాణంలో ఎంత పెట్రోల్ ఖాళీ అవుతుందనేది బైక్ లేదా స్కూటీ ఇంజిన్‌పై ఆధారపడి ఉంటుంది. వీటి ఇంజిన్ పనితీరులో RPM అనేది కీలక పాత్ర పోషిస్తోంది. RPM మీదనే మైలేజ్ ఆధారపడి ఉంటుంది.

Also Read: రికార్టుల మోత.. 48 లక్షల బైకులను సేల్స్ చేసిన హోండా!

చెప్పాలంటే.. మీరు బైక్‌ లేదా స్కూటర్‌ను 2000 rpm వద్ద ఒక గంటపాటు నడిపితే.. ఒక గంటలో ఒక లీటర్ పెట్రోల్ ఖర్చవుతుందని అనుకుందాం. ఈ ఒక్క గంటలో మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారో చూస్తే అదే మీ బైక్ మైలేజ్‌గా చెప్పవచ్చు. అలానే మీరు తక్కువ RPM బైక్‌ను నడిపితే తక్కువ మైలేజ్ ఇస్తుంది.

ఇవన్నీ పక్కనబెడితే.. బైక్, స్కూటర్ మైలేజ్ విషయంలో తేడా రావడానికి ఇతర కారణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా గేర్లు. బైకులు ఎక్కువగా మాన్యువల్ గేర్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. కానీ స్కూటర్లు మాత్రం CVT గేర్ బాక్స్‌తో వస్తాయి. దీని వలనే ఈ రెండిటి మధ్య మైలేజ్ విషయంలో తేడా ఉంటుంది.

గేర్ బాక్స్.. ఇంజిన్‌లో ఉత్పన్నమయ్యే టార్క్‌ను చక్రాలకు అందిస్తోంది. అంతేకాకుండా మాన్యువల్ గేర్ బాక్స్ విషయంలో టాప్ గేర్‌లో ప్రయాణించేప్పుడు ఇంజిన్ ఎక్కువ టార్క్‌ను టైర్లకు అందిస్తోంది. దీని ద్వారా బైక్ ఎక్కువ దూరం ప్రయాణిస్తోంది. మాన్యువల్ గేర్ బాక్స్‌ను డ్రైవర్ కంట్రోల్ చేయగలడు. కాబట్టి మైలేజ్ కూడా డ్రైవర్‌పై ఆధారపడి ఉంటుంది.

Also Read: ఏంటి భయ్యా ఈ క్రేజ్.. భారీగా పెరిగిన ఆడి అమ్మకాలు

ఈ విధంగా మాన్యువల్ గేర్స్ కలిగిన బైక్.. తక్కువ RPMతో ఎక్కువసేపు టాప్ గేర్‌లో ప్రయాణిస్తే ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. ఇక స్కూటీ విషయానికి వస్తే ఇందులో RPMను బట్టి గేర్‌లు ఆటోమెటిక్‌గా
మారతాయి. స్కూటీ తక్కువ RPM వద్ద ఉన్నప్పుడు ఇది డౌన్‌షిఫ్ట్‌కి కారణమవుతుంది. ఎక్కువ ఆర్‌పీఎమ్ వద్ద ఉన్నప్పుడు మాత్రమే దాని గేర్ సాధారణంగా టాప్‌లో ఉంటుంది.

దీని కారణంగానే స్కూటర్ రైడర్‌కు గేర్‌పై కంట్రోల్ ఉండదు. ఈ విధంగా బైక్, స్కూటీలో మైలేజ్ పోల్చిచూస్తే బైక్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. స్కూటర్ తక్కువ మైలేజ్‌ని ఇస్తుంది. ఫైనల్‌గా రైడర్‌పై మైలేజ్ అనేది ఆధారపడి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News