Big Stories

CM Revanth Reddy: 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..

CM Revanth Reddy vs KCR

- Advertisement -

CM Revanth Reddy comments on KCR(Political news in telangana): బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్ల తర్వాత అయినా కేసీఆర్ పొలం బాట పట్టడం సంతోషంగా ఉందన్నారు. అధికారం కోల్పోయినందుకు, కూతురు జైలుకు పోయినందుకు తమకు కేసీఆర్‌పై జాలి కలుగుతుందన్నారు. కేసీఆర్‌కు ఏ సీజన్ ఎప్పుడు వస్తుందో తెలియదా? అని ప్రశ్నించారు.

- Advertisement -

కేసీఆర్ పాపాలకే ఈ కరువు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయన పాపాలు కాంగ్రెస్ ఖాతాలో రాయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు వేయడానికి 10 నెలల సమయం తీసుకుందని గుర్తు చేశారు. 65 లక్షల మంది రైతుల ఖాతాలో తాము రైతు బంధు వేసామని తెలిపారు. ఇంకా 4 లక్షల రైతులే మిగిలి ఉన్నారని వెల్లడించారు.

జనరేటర్‌తో ప్రెస్‌మీట్ పెట్టి విద్యుత్ పోయిందని ప్రభుత్వంపై నిందలు వేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో తాము ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే అరెస్ట్‌లు చేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తాము తలుచుకుంటే కేసీఆర్ బయటకు వెల్లే వారా? అని నిలదీశారు.

Also Read: తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు ఏర్పాట్లు.. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన..

బీఆర్ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు రూ. 100 కోట్లు సహాయం చేయచ్చు కదా ? అని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే కేసీఆర్ యాత్ర చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సూచనలు ఇస్తే.. న్యాయమైనవి అయితే అమలు చేస్తామన్నారు.

ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాము ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రాష్ట్ర హక్కులు సాధిస్తున్నామన్నారు. కులం, కుటుంబం దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు.

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పారిపోతున్నారని అందుకే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ చెల్లని వెయ్యి రూపాయల నోటుగా మారిందన్నారు. జూన్ 9న ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల కోడ్‌లో కొత్త పథకాలు అమలు చేయరాదని రేవంత్ రెడ్డి అన్నారు. పరిపాలన ఎన్నికల సంఘం చేతిలో ఉందన్నారు. కాళేశ్వరంలో అన్ని బొక్కలేనని నీళ్లు ఎత్తిపోయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తాము నీళ్ల పొదుపుపై దృష్టి పెట్టామన్నారు. దేశంలో కాంగ్రెస్‌కు  40 ఎంపీ సీట్లు వస్తాయంటే.. మోదీకి 400 స్థానాలు వస్తాయని కేటీఆర్ ఓప్పుకున్నట్లేనా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని స్పష్టం చేశారు.

చనిపోయిన రైతుల వివరాలు ఇచ్చేందుకు కేసీఆర్‌కు 48 గంటల సమయం ఇస్తున్నా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వివరాలు ఇస్తే ఎన్నికల కోడ్ ముగియగానే రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News