Big Stories

Aanandh Mahindhra: ఆనంద్ మహీంద్రానే ఆశ్చర్యపరిచిన కారు.. అసలేంటి ఆ కారు స్పెషాలిటీ ?

Aanandh Mahindhra latest tweet

- Advertisement -

Aanandh Mahindhra latest tweet(Telugu news headlines today): సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త, ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. రోజుకో ఆసక్తికర వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లకు రోజుకో మెసేజ్ ఇస్తుంటారు. అంతేకాదు నెటిజన్లు నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలకు స్పందిస్తుంటారు. తాజాగా తన కంపెనీ కారునే మార్చేసి ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యపరిచిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆటోమోటివ్ టెక్నాలజీ హవా నడుస్తోంది. కారును నడపడానికి మనుషులు లేకుండా ఆటోమెటిక్‌గా నడిపే కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలోను ఇటువంటి కార్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్లతో లెవల్-2 అడాస్ అనే కారు ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉంది. ఈ తరుణంలోనే బోపాల్ కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ కొత్త రకమైన టెక్నాలజీతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతెందుకు ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ స్టార్టప్ కంపెనీకి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. సెల్ప్ డ్రైవింగ్ టెక్నాలజీతో వచ్చిన ఈ కారు విశేషాలను నెటిజన్లతో పంచుకున్నారు.

Also Read: కచోరి షాపులోకి దూసుకొచ్చిన బెంజ్ కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు

 

కేవలం డైరెక్షన్లు ఇస్తే చాలు.. స్టిరీంగ్ తిప్పకుండానే నగరంలోని రోడ్లపై కారు ప్రయాణిస్తుంది. ఈ ఎస్ యూవీని సంజీవ్ శర్మ అనే ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ తయారుచేశాడు. 2009 నుంచి తనకున్న ఇంట్రెస్ట్‌తో ఈ ఎస్ యూవీని సెల్ఫ్ డ్రైవింగ్ చేసేలా తయారుచేసినట్లు పేర్కొన్నాడు. ఈ సెల్ఫ్ డ్రైవ్ కారులో సెన్సార్స్, కెమెరా, రాడార్ సిస్టమ్, రియల్ టైం డెసిషన్ తీసుకోగల సెంట్రల్ సిస్టమ్ ను కూడా ఈ కారులో అమర్చాడు. ఇతర వాహనాలను తప్పుకుంటూ రోడ్డులోని ట్రాఫిక్ లో ప్రయాణించడానికి ఈ కారు ఫీచర్లు అద్భుతంగా పనిచేస్తున్నాయి.

మహీంద్రా బులోరో కారును సెల్ఫ్ స్టీరింగ్ కారుగా మార్చడం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంజినీర్ చేసిన ఈ సెల్ఫ్ కారు ప్రయోగంపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. భారతదేశ వ్యాప్తంగా సాంకేతిక పెరుగుతుందనడానికి ఈ ఘటన నిదర్శనం అన్నారు. మరో డెలివరీ యాప్‌ను రూపొందించిన ఇంజినీర్ అంటూ సంజీవ్‌ను ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. నేను ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. అయితే దీనికోసం అతడు ఎంచుకున్న కారుపై మాత్రం చర్చించను అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News