BigTV English

Ram – Lakshman : ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సినీ కెరీర్ లో తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్..?

Ram – Lakshman : ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సినీ కెరీర్ లో తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్..?

Ram – Lakshman : ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొ ప్రత్యేకత ఉంటుంది.. రైటర్స్ సింగర్స్ ఎంత ముఖ్యమో సినిమాకు ఫైట్ మాస్టర్ కూడా అంతే ముఖ్యం. ఈమధ్య ఎక్కువగా యాక్షన్ సీన్లకు జనాలు కనెక్ట్ అవుతున్నారు. ఇలాంటి సినిమాలకు కచ్చితంగా ఫైట్ మాస్టర్ ఉండాల్సిందే. మన తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది ఫైట్ మాస్టర్లకు ప్రత్యేక స్థానం ఉంది. అందులో అన్నదమ్ములైన రామ్ లక్ష్మణ్ మాస్టర్ లకు మంచి డిమాండ్ ఉంది. అప్పటినుంచి ఇప్పటికీ వీళ్లు సినిమాలు చేస్తూనే ఉన్నారు. అన్నదమ్ములైన వీరిద్దరూ సినిమాలకు ఫైట్ మాస్టర్ గా వ్యవహరిస్తూ మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. వీరిద్దరూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తమ గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. అందులో వాళ్ళిద్దరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ గురించి వివరించారు. అయితే వీరు తమ సినీ కెరియర్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఏ సినిమాకు తీసుకున్నారు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


రామ్ లక్ష్మణ్ మాస్టర్ల జీవితం.. 

తెలుగు చిత్ర పరిశ్రమలో వీరిద్దరు చేసిన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు ఫైట్ మాస్టర్ గా వ్యవహరించారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ తమిళ, తెలుగు చిత్రసీమలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సాధారణ ఫైట్ మాస్టర్స్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన వీరు.. హీరోలుగా ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిధాయకమే. తెలుగులో వీరు బస్తీమే సవాలే అనే చిత్రంలో హీరోలుగా కూడా నటించి మెప్పించారు. అయితే వీరు జీవితంలో ఎన్నో కష్టాలను పడ్డారని గతంలో చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ దగ్గర వీళ్ళు ఫైటింగ్ నేర్చుకొని ఇండస్ట్రీలోకి ఫైట్ మాస్టర్ గా అడుగుపెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిద్దరూ తమ ఫస్ట్ సినిమా గురించి, అలాగే హైయెస్ట్ పారితోషికం గురించి బయట పెట్టారు.


Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. బన్నీ ఫ్యాన్స్ కు పండగే..

రామ్ – లక్ష్మణ్ హైయెస్ట్ రెమ్యూనరేషన్.. 

ముఖ్యంగా బోయపాటి చిత్రాల్లో వీరిది మరో లెవెల్. మాస్ యాక్షన్ సీక్వెన్స్‌కు థియేటర్లో బాక్సులు బద్దలవ్వాల్సింది. అంతలా పేరు తెచ్చుకున్న వీరు తమ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు అనుభవించారని గతంలో అనేక సందర్భాల్లో బయట పెట్టారు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో వీరిద్దరూ మాట్లాడుతూ.. ఫైట్ మాస్టర్ గా ఫస్ట్ చేసిన సినిమా శివుడు అని చెప్పారు.. ఈ మూవీకి వీళ్ళ రెమ్యూనికేషన్ దాదాపు 5 వేల వరకు ఉంటుందని చెప్పారు. అలాగే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమా రవితేజ నటించిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాకు లక్ష రూపాయలు వరకు తీసుకున్నారట. తమ జీవితంలో అదే హైయెస్ట్ అమౌంట్ అని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆరోజుల్లో అంత తీసుకున్నారంటే ఈ రోజుల్లో ఇంకా ఎక్కువే తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ మాస్టర్ల ఫైట్ సీన్లకు ఒక క్రేజ్ ఉంటుంది అందుకే ఇప్పటికి ఇండస్ట్రీలో పలు సినిమాలకు వీరు మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు. అటు సమాజ సేవ కూడా చేస్తుంటారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×