BigTV English

Early Retirement: 40 ఏళ్లకే పదవీ విరమణ..మారిన ట్రెండ్, ఎందుకో తెలుసా..

Early Retirement: 40 ఏళ్లకే పదవీ విరమణ..మారిన ట్రెండ్, ఎందుకో తెలుసా..

Early Retirement: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా పదవీ విరమణను 60 ఏళ్ల వయస్సులో చేయాలని భావిస్తారు. మరికొంత మంది 58 ఏళ్లకే రిటైర్ అవుతుంటారు. ఇది అనేక తరాలుగా అలాగే కొనసాగుతుంది. 60 ఏళ్ల వరకు కష్టపడి పని చేసి, ఆ తర్వాత శాంతంగా జీవించాలని భావిస్తారు. కానీ ఇప్పటి పరిస్థితులను చూస్తే మాత్రం దీని గురించి మళ్లీ ఆలోచించాల్సిన సమయం వచ్చిందని చెప్పవచ్చు.


60 ఏళ్లు అనేది ‘డెడ్ లైన్’ కాదు
కానీ ఇప్పుడు 2025కి వచ్చినప్పుడు, 60 ఏళ్లు అంటే పదవీ విరమణ వయస్సు అన్నది ఒక భ్రమలా మారిపోయింది. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం, జీవనశైలి, ఉద్యోగాలు అన్నీ వేగంగా మారిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ముందుగానే ఆర్థిక స్వాతంత్ర్యం (Financial Freedom) సాధించాలని అనేక మంది భావిస్తున్నారు.

తక్కువ వయస్సులోనే
భారతీయుడి ఆయుర్దాయం ఇప్పుడు 70-75 సంవత్సరాల మధ్య ఉంది. కానీ ఆరోగ్యంగా ఆ వయస్సు వరకు జీవించడం కొంచెం కష్టమనే చెప్పవచ్చు. డయాబెటిస్, బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఇప్పుడే 40-50 ఏళ్ల లోపలే వస్తున్నాయి. శారీరకంగా శక్తివంతంగా ఉండే వయస్సులోనే జీవితాన్ని ఆస్వాదించాలి. కానీ, శక్తి చలించిపోయిన తర్వాత కాదు.


మీ పొదుపులను మింగేస్తున్న
ఒకప్పుడు నెలకు రూ. 50,000తో చక్కగా జీవించగలిగారు. కానీ ద్రవ్యోల్బణం రేటు 6% ఉంటే, 20 ఏళ్ల తర్వాత అదే ఖర్చు రూ. 1.5 లక్షలు అవుతుంది. సాంప్రదాయ పద్ధతులు (EPF, PPF, పెన్షన్ ప్లాన్లు) ఈ వేగానికి సరిపోవు. ఉదాహరణకు 60 ఏళ్లకు ఒక కోటి corpus ఉంటే, దానికి 6% ఆదాయమొస్తే సంవత్సరానికి రూ. 6 లక్షలు మాత్రమే 2045కి ఇది సరిపోదు.

వయస్సు పెరగడం = ఖర్చు పెరగడం
ఈ నేపథ్యంలో మీరు 20లు, 30లు, 40లలో సంపాదించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇదే గోల్డెన్ టైమ్. ఇప్పుడు మీరు సేవ్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ప్యాసివ్ ఇన్‌కమ్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, డిజిటల్ వ్యాపారాలు సహా ఎన్నో మార్గాలు ఉన్నాయి.

Read Also: Viral News: నెట్టింట నకిలీ ఆధార్, పాన్ కార్డులు..ఆందోళనలో ప్రజలు

FIRE శక్తివంతమైన మార్గం
FIRE (Financial Independence, Retire Early) అనే ఉద్యమం ప్రపంచమంతా ట్రెండ్ అయింది. ఇది పని మానేయడం కోసం కాదు. పని ఎప్పుడెప్పుడు చేయాలో, ఎందుకు చేయాలనే దాని కోసం. యువత 30లలోనే పదవీ విరమణ లక్ష్యాన్ని పెట్టుకుంటున్నారు.

ముందే ప్లాన్
ఉదాహరణకి నెలకు రూ. 80,000 సంపాదించే 28 ఏళ్ల ఇంజినీర్ రాహుల్‌ని తీసుకుందాం. అతను తన ఆదాయంలో 50% ఆదా చేస్తూ, 12% రాబడితో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే, 40కి రూ. 1.2 కోట్లు corpus ఏర్పడుతుంది. అది సంవత్సరానికి రూ. 5 లక్షలు ఆదాయాన్ని ఇస్తుంది. ఇలా అనేక మంది మంచి ఆదాయం ఉన్న వారు, వారి జీవితాన్ని ముందే ప్లాన్ చేసుకుంటున్నారు.

కొత్త అవకాశాలకు తలుపులు
ఇప్పటి డిజిటల్ వాతావరణంలో 30లలోనే బ్లాగింగ్, యూట్యూబ్, ఇ-కామర్స్ వంటివి మొదలుపెట్టి, 40 నాటికి నెలకు రూ. 20,000–50,000 ప్యాసివ్ ఆదాయం సంపాదించవచ్చు. ఇది మీ సంపదకు సహాయపడుతుంది.

కుటుంబ బాధ్యతలు
భారతీయులకి పెళ్లిళ్లు, పిల్లల విద్య, తల్లిదండ్రుల సంరక్షణ వంటి బాధ్యతలు ఎక్కువ. అందుకే చాలా మంది పదవీ విరమణ ప్రణాళికను వాయిదా వేస్తారు. కానీ ఇది ఒత్తిడిని పెంచుతుంది. 60కి చేరేసరికి పొదుపులు అయిపోతే, పిల్లలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ఉత్తమం.

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×