BSNL Best Recharge Plans: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL వినియోగదారులకు ఆకట్టుకునే అదిరిపోయే ప్లాన్స్ ను పరిచయం చేస్తోంది. తక్కువ ధరలో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ధీటుగా రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది. సెప్టెంబర్ 2025 కోసం BSNL అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏంటి? ఏది బెస్ట్? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక ఈ నెలలో BSNL అందించే ప్లాన్స్ లో బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 997గా చెప్పుకోవచ్చు. ఈ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు ప్రతి రోజూ 2 జీబీ డేటాతో 160 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇక రూ. 1,499 రూపాయలతో రీఛార్జ్ చేసుకునే వారికి మొత్తం 24 జీబీ డేటాతో ఏడాది వ్యాలిడిటీ అందిస్తుంది. అటు ప్రతి రోజూ 2 జీబీ డేటాతో395 రోజుల వ్యాలిడిటీ అందించేలా రూ.2,399 ప్లాన్ కూడా అందుబాటులో ఉంటుంది. రోజూ 2GB డేటాతో 50 రోజుల వ్యాలిడిటీతో రూ.199 ప్లాన్ కూడా అందిస్తోంది. ప్రతి రోజూ 2 జీబీ డేటాతో ఏడాది పాటు వ్యాలిడిటీ అందించే రూ. 1,515 ప్లాన్ కూడా అందుబాటులో ఉంచింది.
సెప్టెంబర్ లో BSNL అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే!
⦿ రూ. 997 ప్లాన్: 160 రోజుల పాటు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.
⦿ రూ.1,499 ప్లాన్: 336 రోజుల పాటు మొత్తం 24GB డేటాను, అపరిమిత కాల్స్ ను అందిస్తుంది.
⦿ రూ.1,999 ప్లాన్: 365 రోజుల పాటు 600GB డేటా (రోజుకు సుమారు 1.6GB) అందిస్తుంది.
⦿ రూ. 2,399 ప్లాన్: 395 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2GB డేటాను అందిస్తుంది.
⦿ రూ. 199 ప్లాన్: 50 రోజుల పాటు రోజుకు 2GB డేటాను అందించే స్వల్పకాలిక డేటా ప్లాన్.
⦿ రూ. 1,515 ప్లాన్: 365 రోజుల పాటు రోజుకు 2GB డేటాను అందించే వార్షిక ప్లాన్.
Read Also: 2 జీబీ డేటా.. 28 రోజుల వ్యాలిడిటీ.. మరీ ఇంత తక్కువ ధరకా?
BSNL ప్లాన్ ను ఎలా రీఛార్జ్ చేసుకోవాలంటే?
⦿ ప్రొవైడర్ వెబ్ సైట్ ను చెక్ చేయండి: ప్రస్తుత ఆఫర్లను తెలుసుకునేందుకు BSNL వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
⦿ రాష్ట్రం/సర్కిల్ ను సెలెక్ట్ చేసుకోవాలి: అందుబాటులో ఉన్న ప్లాన్లను చూడటానికి మీ రాష్ట్రంతో పాటు సర్కిల్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
⦿ మీకు తగిన ప్లాన్ ను సెలెక్ట్ చేసుకోవాలి: మీ అవసరానికి సరిపడ డేటా, వ్యాలిడిటీ పీరియడ్ లాంటి వివరాలను పరిశీలించి సెలెక్ట్ చేసుకోవాలి.
⦿ రీఛార్జ్ చేయడానికి కొనసాగండి: మీ రీఛార్జ్ ను పూర్తి చేయడానికి ప్లాన్ ను ఎంచుకుని, తర్వాతి స్టెప్స్ ఫాలోకండి. నచ్చిన ఫ్లాన్ రీఛార్జ్ చేసుకుని హ్యాపీగా కాల్స్, డేటాను ఎంజాయ్ చేయండి.
Read Also: జియో రీఛార్జ్ చేసుకోండి, క్రేజీ క్యాష్ బ్యాక్ ఆఫర్ పట్టేయండి!