BigTV English
Advertisement

BSNL: BSNL బంపర్ ఆఫర్.. జస్ట్ ‘హాయ్’ అని మేసేజ్.. మూడు నెలలు అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్!

BSNL: BSNL బంపర్ ఆఫర్.. జస్ట్ ‘హాయ్’ అని మేసేజ్.. మూడు నెలలు అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్!

BSNL: దేశీయ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ఫైబర్ బేసిక్ ప్లాన్‌పై లిమిటెడ్ ఆఫర్‌ను ప్రకటించింది. మాన్‌సూన్ డబుల్ బొనాంజా ఆఫర్‌‌లో భాగంగా ఇప్పుడు నెలకు కేవలం రూ. 399కి అందుబాటులో ఉన్న ప్లాన్‌పై BSNL మొదటి నెల పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. దీని సాధారణ ధర రూ. 499 నుండి తగ్గింది. BSNL తన భారత్ ఫైబర్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ ఆఫర్ తీసుకొచ్చింది. మరిన్ని ఇంటర్నెట్ సేవలతో వినియోగదారులను ఆకర్షించడానికి, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ఫైబర్ బేసిక్ ప్లాన్‌పై పరిమిత-కాల ఆఫర్‌ను అందిస్తోంది.


మాన్‌సూన్ డబుల్ బొనాంజా ఆఫర్‌ భారత్ ఫైబర్ (FTTH) సేవలను ప్రజలకు తక్కువ ధరలో మెరుగైన సేవలు అందించడానికి తీసుకొచ్చారు. ఇది పర్సనల్, ప్రోఫేషనల్ అవసరాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. వినియోగదారులు ప్రస్తుత ఇంటర్నెట్ కనెక్షన్‌ని అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్న కస్టమర్‌లు ఈ ప్రమోషన్‌ను పొందవచ్చు. ఇది లిమిటెడ్ ఆఫర్, కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

BSNL Fiber Basic Plan
BSNL ఫైబర్ బేసిక్ ప్లాన్ మొదటి మూడు నెలలకు రూ.399లకి అందుబాటులో ఉంటుంది. తర్వాత 499 రీఛార్జ్ చేసుకోవాలి. ప్లాన్ కస్టమర్‌లకు 60 Mbps నుండి 3300 MB వరకు డేటాను పొందుతారు. దాని ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) 4 Mbps స్పీడ్ అందిస్తోంది. అలానే  BSNL కస్టమర్‌లు ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయవచ్చు.

ఈ ఆఫర్‌ను పొందడానికి మీరు వాట్సాప్ ద్వారా 1800-4444కు హాయ్ అని మేసేజ్ చేయాలి. బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ మధ్య BSNL దీన్ని తీసుకొచ్చింది. ఇక్కడ ప్రొవైడర్లు అట్రాక్టీవ్ డీల్స్, హై స్పీడ్ సర్వీసెస్ అందించడానికి ప్రయత్నిస్తారు. సబ్‌స్క్రైబర్స్ నచ్చిన ప్లాన్‌ను తీసుకోవచ్చు.

జియో, ఎయిర్‌టెల్, విఐ కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌లను భారీగా పెంచడంతో చాలా మంది కస్టమర్‌లు నిరాశ చెందారు. ఈ కంపెనీలు వినియోగదారులకు  ఇష్టమైన, తక్కువ ధరలో లభించే రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించారు. దీంతో ప్రజలు ప్రభుత్వ టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్‌లను ఇష్టపడుతున్నారు.

Also Read: మరో బడ్జెట్ ఫోన్.. రూ.14 వేలకే 108 MP కెమెరా, బిగ్ బ్యాటరీ.. టెక్నో స్పార్క్ 20 ప్రో!

BSNL రీఛార్జ్ ప్లాన్‌లు ప్రజలకు ఆప్షన్‌గా మారుతున్నాయి. రూ. 666 ప్లాన్ గురించి మాట్లాడినట్లయితే ఈ ప్లాన్ Jio, Airtel, Vi  ప్లాన్‌ల కంటే చాలా చౌకగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌ను బెస్ట్ సెల్లర్ ప్యాక్ అని కూడా పిలుస్తారు. ఈ రీఛార్జ్‌తో మీరు అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ పొందుతారు. ఈ మొత్తానికి ప్లాన్ 150 రోజుల వరకు వాలిడిటితో వస్తుంది. మీరు హై స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, రోజుకు 2GB డేటా పొందుతారు.

Related News

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Jiomart Offers: నవంబర్‌లో ఆఫర్ల వర్షం.. జియోమార్ట్‌లో సూపర్ డీల్స్ వచ్చేశాయ్..

Gold Rate Dropped: వావ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Dak Sewa App: ఇక మీ పాకెట్ లో పోస్ట్ ఆఫీస్ సేవలు.. సరికొత్త యాప్ లాంచ్ చేసిన తపాలాశాఖ

Gold Rate Dropped: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత తగ్గాయంటే..

Jio Offer: జియో కస్టమర్లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఉచిత హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

EPFO Enrollment Scheme: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ఎన్ రోల్మెంట్ స్కీమ్.. మీరు అర్హులేనా?

Big Stories

×