బడ్జెట్ లో పెరిగేవి.. తగ్గేవి..
ఈసారి బడ్జెట్ లో కొన్న వస్తువుల ధరలు పెరగనుండగా.. కొన్ని తగ్గనున్నాయి..
పెరిగేవి..
విదేశీ మద్యం, లగ్జరీ వాచ్ ధరలు పెరగనున్నాయి.
తగ్గేవి..
క్యాన్సర్ ఔషధాలు, డయాబెటిక్ మెడిసిన్, ఈవీ బ్యాటరీలు, సోనాల్ ప్యానెల్స్, విదేశీ స్టడీ, చెప్పులు, ఫారెన్ టూర్ పై ధరలు తగ్గనున్నాయి. అలాగే లోకల్ మొబైల్స్, ట్యాబ్లెట్ ధరలు కాస్త తగ్గే ఛాన్స్ ఉంది..
ఏడు నగరాల మధ్య హై స్పీడ్ కారిడార్స్…
హైదరాబాద్ – పూణె
హైదరాబాద్ – బెంగళూరు
హైదరాబాద్- చెన్నై
ముంబై – పూణె
ఢిల్లీ – వారణాసి
వారణాసి – సిలిగురి
చెన్నై – బెంగళూరు
సమయం 12:30
2026-27 ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు..
దాదాపు 80 నిమిషాలకు పైగా మంత్రి ప్రసంగం సాగింది..
సమయం 12: 15 PM
చిన్న మదుపరుల కోసం మోదీ సర్కార్ కీలక నిర్ణయం
కార్పొరేట్ బై బ్యాక్ కొనుగోళ్ల పైన 22 శాతం ట్యాక్స్
నాన్ కార్పొరేట్ బై బ్యాక్ కొనుగోళ్లపైన 30 శాతం ట్యాక్స్
సమయం 12:10
ద్రవ్యలోటు 4.3 శాతానికి తగ్గించాలని లక్ష్యం
ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు రూ.లక్షా 4 వేల కోట్ల నిధులు
సమయం 12:00
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం
వీదేశీ యాత్రలపై ట్యాక్స్ తగ్గింపు
వైద్యం, విద్యపై టీడీఎస్ 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గింపు
చిన్న పన్ను చెల్లింపుల దారుల కోసం ప్రత్యేక పథకం
రోడ్డు ప్రమాదాల పరిహారంపై ట్యాక్స్ తొలగింపు
సమయం 12:25 PM..
స్టాక్ మార్కెట్ కు బిగ్ షాక్..
భారీ నష్టాల్లోకి సూచీలు
సెన్సెక్స్ 833 పాయింట్స్ పతనం
25050 పాయింట్స్ దిగువకు జారిన నిఫ్టీ
12: 20 PM
17 ఔషధాలపై ట్యాక్స్ తగ్గింపు..
క్యాన్సర్ రోగులకు శుభవార్త.. వారు ఉపయోగించే మెడిసిన్ పై ట్యాక్స్ తగ్గింపు..
మైక్రో అవెన్స్ పై ట్యాక్స్ తగ్గింపు
సమయం 11: 55
దివ్యాంగుల ప్రయోజనం కోసం దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ సహకర యోజన
ఈస్ట్ ప్రాంతాల్లో 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
సమయం 11: 50 ఏఎమ్
దేశంలో మూడు ఆయుర్వేద ఆస్పత్రుల ఏర్పాటు
ఆయుష్ కేంద్రాల అప్ గ్రేడేషన్
జామ్ నగర్ లో సంప్రదాయ వైద్య పరిశోధన కేంద్రం
ప్రైవేట్ రంగంలో పశు వైద్య, డయాగ్నిస్టిక్స్ సెంటర్స్ ఏర్పాటు
వైద్య రంగంలో నూతన కోర్సులు
సమయం: 11:20
ఎన్ఆర్ఐలకు భారీ గుడ్ న్యూస్..
భారత్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ పరిమితి పెంపుకు ఛాన్స్
మూలధన వ్యయం రూ.12.2 లక్షల కోట్లకు పెంపు
5 లక్షల జనాభా దాటిన నగరాలపై స్పెషల్ ఫోకస్
5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు, విద్య, వైద్య పరిశోధనల సంస్థల ఏర్పాటు
బడ్జెట్…
దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్త వరకు అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెడుతున్న మూడో పూర్తి స్థాయి బడ్జెట్ ఇది కావడం విశేషం. అంతేకాకుండా, నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు.
అభివృద్ధి పథంలో కీలక అడుగు
2047 నాటికి భారత్‌ను ‘అభివృద్ధి చెందిన దేశం’ (వికసిత భారత్)గా మార్చాలనే బలమైన సంకల్పంతో మోదీ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీగా కాకుండా.. భవిష్యత్ భారత్ నిర్మాణానికి ఒక రోడ్ మ్యాప్‌లా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు పేదలే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగినట్లు తెలుస్తోంది.
కీలక రంగాలపై ఫోకస్..
ఈసారి బడ్జెట్‌లో పలు కీలక రంగాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు ఇలా పలు రంగాల్లో మోదీ సర్కార్ నిధులు కేటాయించనుందా..? అనే దాని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
వ్యవసాయం: అన్నదాతలకు అండగా ఉండేలా మౌలిక సదుపాయాల కల్పన, కనీస మద్దతు ధర (MSP) పెంపుపై దృష్టి సారించవచ్చు.
విద్యారోగ్యం: నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే, ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం మరియు గ్రామీణ వైద్యంపై నిధుల వర్షం కురవవచ్చని సమాచారం.
మౌలిక సదుపాయాలు: రైల్వేలు, జాతీయ రహదారులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పెద్దపీట వేసే అవకాశం ఉంది.
ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు వస్తాయని, ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ పెంచుతారని సగటు పన్ను చెల్లింపుదారుడు ఆశగా ఎదురుచూస్తున్నాడు.
వ్యూహాత్మక అడుగులు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వినియోగాన్ని పెంచడం, తద్వారా పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడం కేంద్రం వ్యూహంగా కనిపిస్తోంది. గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మేక్ ఇన్ ఇండియా 2.0 కింద మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటలకు నిర్మలమ్మ తెరిచే ఆ డిజిటల్ బడ్జెట్ బాక్సులో దేశ భవిష్యత్తును మార్చే అస్త్రాలు ఏమున్నాయో చూడాలి.
ALSO READ: Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026.. బ్లూషీట్ నుంచి హల్వా వరకు.. ఐదు ఆసక్తికర విషయాలు