E-Paper
Advertisement

Municipal Elections: మిర్యాలగూడ కాంగ్రెస్‌లో రగులుతున్న రాజకీయం.. పుర పోరులో ఓ ఎమ్మెల్యే కుటుంబం..?

Municipal Elections: మిర్యాలగూడ కాంగ్రెస్‌లో రగులుతున్న రాజకీయం.. పుర పోరులో ఓ ఎమ్మెల్యే కుటుంబం..?
Advertisement

Municipal Elections: మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల పోరులో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబం నామినేషన్ దాఖలు చేసి బరిలో నిలవటం మిర్యాలగూడ(Miryalaguda) రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మున్సిపల్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ చేయగా ఇప్పటికే చైర్మన్ రేస్‌లో ఉన్న అభ్యర్థులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుండగా ఎమ్మెల్యే సతీమణి మాధవి 39 వ వార్డు అశోక్ నగర్ నుంచి నామినేషన్ దాఖలు చేయటం మున్సిపల్ ఎన్నికల హీట్‌ను పెంచేసింది. కాంగ్రెస్ పార్టీలో రసవత్తర రాజకీయం నడుస్తోంది.

మున్సిపల్ పీఠం కేంద్రంగా ఆసక్తికర పోరు

మిర్యాలగూడ మున్సిపాలిటీలో 48 వార్డులో ఉన్నాయి. కాగా మున్సిపాలిటీని జనరల్ మహిళకు రిజర్వేషన్ చేశారు. కాగా ఎమ్మెల్యే సతీమణి సహా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, మాజీ మహిళ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని టార్గెట్ చేసి ఎన్నికల బరిలో దిగటంతో మున్సిపల్ పోరు ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సతీమణి బత్తుల మాధవి 39వ వార్డు (అశోక్ నగర్) జనరల్ స్థానం నుంచి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి సతీమణి తన ప్రభుత్వ ఉద్యోగానికి రిజైన్ చేసి 17వార్డు (విద్యానగర్. హౌసింగ్ బోర్డ్) జనరల్ మహిళా స్థానం నుంచి నూకల కవిత, 27వ వార్డు శాంతినగర్ జనరల్ మహిళ, 14వ వార్డు షాబునగర్ జనరల్ స్థానం నుంచి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తిరు నగర్ నాగలక్ష్మీ భార్గవ్, 2వ వార్డు (తాళ్లగడ్డ చైతన్య నగర్) జనరల్ మహిళ స్థానం నుంచి శాగ జయలక్ష్మి జలంధర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

Advertisement

Also Read: MLA Malla Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన మల్లారెడ్డి.. కేసీఆర్ అంటూ ప్రచారం

రాజకీయ వ్యూహంతో పాటు..

31వ వార్డు(బంగారుగడ్డ) నుంచి చిలుకూరి సుధ బాలకృష్ణ, 4వ వార్డు రాంనగర్, 39, 41వ వార్డు నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గుడిపాటి నవీన్ సతీమణి శిరీష, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్ మాతృమూర్తి మిట్టపల్లి శ్రీదేవి 40 వ వార్డు శాంతినగర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ప్రధానంగా మిర్యాలగూడ మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వు కాగా ఆ పదవిని దక్కించుకునేందుకు అధికార పార్టీలోనే గట్టి పోటీ ఉంది. అభ్యర్థులు రాజకీయ వ్యూహంతో పాటు ఆర్థికంగా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉండటంతో చైర్మన్ పీఠంపై అధికార పార్టీలో హాట్ టాపిక్ నడుస్తోంది. కాగా మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తో పాటు అనుచరులకు టికెట్లను కేటాయించకపోతే ప్రత్యామ్నాయ పార్టీల వైపు, ఇప్పుడున్న పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తానికి పురపోరు ఉత్కంఠగా మారింది.

పురపోరులో ఎమ్మెల్యే కుటుంబం

Advertisement

కాగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సతీమణి బత్తుల మాధవి 39వ వార్డు అశోక్ నగర్, ఎమ్మెల్యే పెద్ద కుమారుడు బత్తుల సాయి ప్రసన్నకుమార్ 40 వ వార్డు శాంతినగర్, చిన్న కుమారుడు బత్తుల ఈశ్వర్ గణేష్ కుమార్ 28 వార్డు సీతారాంపురం నుంచి నామినేషన్లు దాఖలు చేసిండ్రు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డుల్లో 93020 వేల ఓట్లు ఉండగా ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారు అనేది తేలనుంది.

Also Read; Google Maps AI: గూగుల్ మ్యాప్స్‌లో AI.. వాకింగ్, సైక్లింగ్ కోసం హ్యాండ్స్-ఫ్రీ నావిగేషన్

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×